Intinti Ramayanam Today Episode December 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి దగ్గరకు వాళ్ళ అమ్మమ్మ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్తుంది. ఇకమీదట ఏం కావాలన్నా నన్నే అడుగు ఆ అవనిని అడగకు అనేసి చెప్తుంది. బామ్మ ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని పల్లవి ప్లాన్ మనసులో అనుకుంటుంది. బామ్మ కు లేనిపోనివి నూరిపోసి అవని పై అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి అవనీని ఇంట్లోంచి పంపించడం ఎలా అని స్కెచ్ వేస్తారు. ఆరాధ్య తన ఫ్రెండ్ తో బయట పెయింట్ వేస్తుంటే అవి గోడల మీద పెయింట్ వేస్తారా అనేసి అరిచి లోపలికి పంపిస్తుంది అవని. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ పెయింట్ ను క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంటే బాగోలేదు అసలు ఏదో ఒకటి జరగాలని పైనుంచి ఫ్లవర్ వాస్ ను కింద పడేస్తుంది. ఇక అవని పడేసిందని బామ్మ, అక్షయ్ అని నమ్ముతారు. ఇక వినోద్ అవన్నీ పట్టించుకోవద్దు అని అంటారు. ఇక పల్లవి ప్లాన్ ఇదంతా అని తెలుసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే పార్వతీ రాజేంద్రప్రసాద్ లు స్వామీజీని రమ్మని చెప్తారు. స్వామీజీ ఇంటికి రాగానే అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంట్లో అనుకోని కలహాలు గొడవలు వస్తున్నాయని పార్వతి అడుగుతుంది. ఇంట్లో ఒక దుష్టశక్తి ప్రవేశించింది దానివల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకుంటుంది అనేసి అంటాడు. పల్లవించి ఆ మాట అనగానే పల్లవి తన గురించి నిజం తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతుంది. ఇది ఇంట్లో ఒక హోమం చేస్తే సరిపోతుందని స్వామీజీ చెప్తారు. చండీ హోమం జరిపిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని నా మీద చెప్తారు. ఈ హోమం చేయాలంటే ఇంటి మంచి కోరే వాళ్లే చేయాలి అనేసి అడుగుతారు. అక్షయ అవనీలు ఈ పూజలో కూర్చొని పూజ చేస్తారు అని పార్వతి అంటుంది. దానికి పార్వతి వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరే చేయాలా ఏంటి ఇంకెవరు చేయకూడదని అంటే కడుపుతో ఉంది కాబట్టి పూజలో కూర్చోకూడదు అని అందుకే అవన్నీ అక్షయ్ చేస్తారని అన్నాను అత్తయ్య అనేసి అంటుంది.
ఈ పూజ చేసే వాళ్ళు చాలా నిష్టగా చేయాలి ఉదయం లేవగానే చలినీటి స్నానం చేసి ఇంట్లో పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టాలి అనేసి స్వామీజీ చెప్తాడు. అవని అలాగే అంటుంది. ఇక పూజకు కావాల్సిన ద్రవ్యాల గురించి పార్వతి అడుగుతుంది.. ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నా శిష్యుల చేత పూజ కావాల్సిన సామాగ్రి గురించి పంపిస్తాననేసి స్వామీజీ వెళ్లిపోతాడు. ఇక స్వామీజీ వెళుతుంటే కమల్ తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వామీజీని అడుగుదామని వెళ్తాడు. స్వామీజీ శిష్యులు మీ సమస్య ఏంటో చెప్పమని స్వామీజీ అడిగాడు అనేసి అంటే నా భార్య నన్ను దగ్గరికి రానివ్వట్లేదు నా మీద కోప్పడుతుంది ఏదైనా చిరాకు పడుతుంది ఏం జరిగిందో ఏదైనా పూజ చేపిస్తారేమో అడుగుదామని పిలిచాను అని అంటాడు. దీనికి స్వామీజీ అవసరం లేదు మేము సరిపోతాము. స్వామీజీని ఒక అరగంటలో వదిలిపెట్టి వస్తాము నువ్వు 50,000 రెడీ చేసుకో పూజ చేస్తాము అనేసి చెప్పి వెళ్ళిపోతారు.
ఇక పల్లవి ఇంట్లో చేస్తున్న హోమం గురించి చక్రధర్ తో ఫోన్లో మాట్లాడుతుంది. రాజేంద్రప్రసాద్ ఆ విషయాన్ని విన్నాడనుకొని భయపడుతుంది. రాజేంద్రప్రసాద్ తన ప్లాన్ గురించి వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. తన ఫోన్ తీసుకొని చక్రధర్ ని ఇంట్లో హోమం ఉంది నా చెల్లి మీరు రావాలి బావగారు అనేసి పిలుస్తాడు. ఇక ఆ హోమం చాలా పవర్ ఫుల్ ఆ హోమం చేసే వాళ్ళకి అది దక్కుతుంది అసలు ఆ హోమాన్ని అవని చేసేలా చేయకూడదు అనేసి చక్రధర్ పల్లవికి సలహా ఇస్తాడు. ఇక కమల్ 50000 రెడీ చేసుకుని బయట స్వాముల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే స్వాములు వస్తారు. మనం చేసే పూజ ఎవరికి తెలియకూడదు ఇంటి వెనకాల చేయాలి అనేసి అంటారు. ఇక వింత వింత మంత్రాలతో కమల్ తో పూజ చేయిస్తారు. పూజ అయిన తర్వాత నువ్వేం మాట్లాడకూడదు నువ్వు వెళ్లి ఎవరికీ తెలియకుండా స్నానం చేయి అనేసి అంటారు.
ఇక అవని అక్షయ్ కి పూజ కోసం డ్రెస్ ని రెడీ చేసి పెడుతుంది. అక్షయ్ ఈ లోపలికి రాగానే మీరు రేపు పూజ కట్టుకోవాల్సిన డ్రెస్ ఇదే అనేసి ఇస్తుంది. కానీ అక్షయ్ మాత్రం నీతో పూజ చేయడం నాకు ఇష్టం లేదు అనేసి విసిరి కొడతాడు. ఇంట్లో వాళ్ళ మంచి కోసం సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇచ్చేదాన్ని నా కోసం నేను ఎప్పుడూ పూజ చేయలేదు అది మీరు గమనించండి అనేసి అవని అడుగుతుంది. అక్షయ్ ఇది ఒకప్పటి మాట ఇప్పుడు కాదు ఇప్పుడు నీకోసం నువ్వు ఆలోచిస్తున్నావు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావ్ అవతల వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవట్లేదనేసి అవనికి క్లాస్ పీకుతాడు. చచ్చిన ఈ పూజ చేయను అనేసి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళగానే ఆరాధ్య నాన్న బాలు పట్టుకొని వేస్తుంది. అక్షయ్ బాలు పట్టుకునే సమయంలో గుణపం దగ్గర పడిపోబోతాడు అవని వెనకాల చెయ్యి పట్టుకుంటుంది. మీరు ఇవన్నీ చూసుకోకుండా ఎలా వచ్చారు అనేసి అవని అడుగుతుంది. అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు. కమల్ స్నానం చేసి బయటకు వస్తాడు. పల్లవి కమల్ తో ప్రేమగా ఉంటేనే తన వైపు తిప్పుకోవచ్చు అనేసి అనుకుంటుంది. ఇప్పుడు లేనిది కొత్తగా టవల్ తో తలతుడుస్తూ కమలి మజ్జిగ చేసుకోవాలని అనుకుంటుంది.. ఇక ఉదయం లేవగానే అవని పూజ కోసం అంత సిద్ధం చేస్తుంది. ఈ పూజ జరగడానికి వీల్లేదని పల్లవి నెయ్యి కుండకి హోల్ పెడుతుంది. నెయ్యంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ నెయ్యి నేను తీసుకొని వస్తాననేసి బయటకు వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో స్వామీజీ ఇంట్లోకి వచ్చి పూజకి ఇంకా సిద్ధం చేయలేదని అరుస్తాడు. అవని ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో పూజ జరుగుతుందా లేకపోతే అవనీని అందరూ తిడతారు అనేది చూడాలి.