Intinti Ramayanam Today Episode December 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఈ ఇల్లు ముక్కలు అవ్వాలని, ఇంట్లో ఎవరికీ సంతోషం లేకుండా చెయ్యాలని నేను అనుకున్నాను అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను నా ప్లాన్ చేంజ్ అయింది అని పల్లవి అంటుంది. నాకు ఇండ్లు కావాలి ఇంటి ఆస్తికి నా కొడుకు ఒక్కడే వారసుడవ్వాలి అంటే శ్రీకర్ బావ లాగే నువ్వు అక్షయ్ బావ కూడా బయటికి వెళ్లాలి నీ బిడ్డ ఈ ఆస్తికి అడ్డు రాకూడదు అనేసి పల్లవి అంటుంది. పల్లవి మాటలు విన్న అవని షాక్ అవుతుంది. నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని అస్సలు ఊహించలేదు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని వృధా చేస్తూనే ఉన్నావు. ఇకమీదట నీకు అవకాశాలు ఇచ్చేదే లేదు అని అవని అంటుంది. అనుకుంటున్నవేవి జరగవు జరగనివ్వను అనేసి అవని పల్లవితో అంటుంది. ఇక అక్షయ్ ఆరాధ్యను తీసుకుని వచ్చి పాలు తీసుకొస్తాను తాగు అనేసి అంటాడు. పాలు తీసుకురాగానే ఆరాధ్య మమ్మీ తీసుకొస్తుంది కదా నువ్వెందుకు తీసుకొచ్చావు నాన్న అనేసి అంటుంది. మీ మమ్మికి చాలా పనులు ఉంటాయి నిన్ను చూసుకునే అంత పని లేదులే అనేసి వెటకారంగా అంటాడు. అప్పుడే అవని వచ్చి ఆ పాలు నేను తాగిస్తాను ఇవ్వండి అనేసి అంటుంది. కానీ నేను చూసుకుంటానని ఆరాధ్యన్ని తీసుకొని బయటికి వెళ్తాడు. అవని మందు తాగుతాను బాధను మర్చిపోవాలంటే నేను మందు తాగుతాను అని మందు తాగుతుంది. అది చూసిన అక్షయ్ షాక్ అవుతాడు. అక్షయ్ అవని నిజంగానే మందు తాగిందని భయపడతాడు. అవని నేను బయటికి వెళ్తాను అనేసి అనగానే అక్షయ్ నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్తే అందరూ ఏదో అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు మీరు తాగుతుంటే నాకు కంపెనీ కోసం నన్ను అడిగారని అంటానని చెప్తుంది దానికి అక్షయ్ షాక్ అవుతాడు.. అక్కడితో శనివారం ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాధలు ఉన్న ప్రతి ఒక్కరు తాగాలి అనుకుంటే ఈ ప్రపంచంలో అందరు అదే పనిలో ఉండాలని అంటుంది. ఇక అరవద్దు అందరు వస్తారు అని అక్షయ్ అవనిని బ్రతిమలాడుతాడు. ఏంటి తప్పు నేను తాగితే తప్ప అనేసి అవని అక్షయ్ కి షాకిస్తుంది. అవని తన మీద అనుమాన పడుతున్నాడని అక్షయ్కి చెప్తుంది. నా భర్త నన్ను కొడుతున్నాడని నన్ను తిడుతున్నాడని నామీద అనుమానంతో నన్ను దూరం పెడుతున్నాడని మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. నేను వెళ్లి ఇన్ని రోజులు బాధ పడుతున్న నిజాన్ని బయట పెడతాను అని అక్షయ్ కు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది.. అరవకు అరిస్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు బాగోదు నువ్వు తాగేవని తెలిస్తే ఇంక ఇంట్లో అస్సలు ఊరుకోరు అనేసి అక్షయ్ అవనీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అవనీని ఎలా కంట్రోల్ చేయాలి ఇలా వెళ్తే నేను అడ్డంగా దొరికిపోతానని ఆలోచిస్తూ ఉంటాడు. అవని మాత్రం అస్సలు తగ్గకుండా నేను బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మీరు నాతో డాన్స్ చేయాలని ఇద్దరూ కలిసి కాసేపు డాన్స్ చేస్తారు.
అటు పల్లవి కమల్ ను ఎలా దగ్గర చేసుకోవాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఫుడ్ తో కమల్ ను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. కమల్ కి ఇష్టమైన ఫుడ్ ని తీసుకురావాలని అనుకుంటుంది. మంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ పెట్టిన ఫుడ్డు రావడంతో మొత్తం తానే చేసిందని కవరింగ్ ఇచ్చుకునేందుకు ఆ ఫుడ్ ని ఇంట్లో చేసినట్టు రెడీ చేసి కమల్ని పిలుస్తుంది. బావా నీకు ఎప్పుడు ఫోన్ ఏనా నువ్వు రా బయటికి అనేసి తీసుకొని వస్తుంది. ఏమైంది అని అడిగితే నీకోసం నేను కష్టపడి ఫుడ్ చేశానని అంటుంది. ఇక భానుమతి పార్వతీలు అక్కడికి వస్తారు. నీ భార్య నీ కోసం కష్టపడి ఫుడ్ చేసింది మాకు చాలా సంతోషంగా ఉందని అంటారు. అనుమతి తినబోతుంటే ఇది నా భార్య చేసింది నేనొక్కడినే తినాలి నువ్వు వెళ్లి ఏం మజ్జిగ పెరుగు వేసుకుని తిను అనేసి అంటాడు. ఇక అవని అక్షయ్ కి రెస్టు లేకుండా చేస్తుంది. అక్షయ్ కి ఎలాగైనా నిజం చెప్పాలని తనని వాళ్ళిద్దరి మధ్య దూరం పోవాలని అనుకుంటుంది. అక్షయ్ కి తన అమ్మ తమ్ముడు గురించి చెప్పకపోవడానికి కారణం తన అమ్మకి ఇచ్చిన మాటే అని నిజం చెప్తుంది. నేను మా అమ్మ మా తమ్ముడిని కలవడానికి మీకు అబద్ధం చెప్పి వెళ్ళను తప్ప నేనే తప్పు చేయలేదండి అనేసి అవని అంటుంది. అవని చెప్పింది నిజమే అని అక్షయ్ అనుకుంటాడు. ఇద్దరి మధ్య దూరం తగ్గి ఒక్కటయిపోతారు. ఇక వాళ్ళను చూసి పల్లవి మల్లీ విడగొట్టాలని అనుకుంటుంది. అంతకన్నా ముందు కమల్ ను దగ్గర చేసుకోవాలని అనుకుంటుంది. కమల్ తో శోభనం కోసం రెడీ అవుతుంది.. కమల్ కు పాలు తీసుకొస్తుంది. మొదట పాలను చూసి భయపడతాడు కమల్. నన్ను చూసి భయపడుతున్నావు బావ అంటే కాదు నీ చేతిలో ఉన్న గ్లాసులో ఉన్న పాలను చూసి భయపడుతున్నానని కమలంటాడు. అప్పుడంటే భయం ఇప్పుడు భయం అవసరం లేదు అనేసి పల్లవి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఈరోజు మనిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం అనేసి అనగానే కమల్ రాత్రంతా స్టామినా ఉండాలంటే ఎక్సర్సైజులు చేయాలని ఎక్సర్సైజులు చేస్తాడు. మధ్యలో నడుం పట్టేసి పడుకుంటాడు. ఇక సోమవారం ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య మరోసారి శోభనం జరగనుందని తెలుస్తుంది.