Bangladesh U19 vs India U19, Final: ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ (Asia Cup Under 19 Tournament ) తుది దశకు వచ్చింది. ఇవాళ కీలక ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో (Asia Cup Under 19 Tournament ) అండర్ 19 టీమిండియా ( India U19 ), అండర్ 19 బంగ్లాదేశ్ ( Bangladesh U19 ) జట్లు తల పడబోతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్… జరగనుంది. దుబాయ్ లోని ( Dubai) ఇంటర్నేషనల్ స్టేడియంలో… బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య… ఫైనల్ పోరు జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఐసీసీ.
Also Read: Siraj vs Travis head: తగ్గేదేలే..హెడ్, DSP సిరాజ్ మధ్య వార్ ?
ఈ టోర్నమెంట్ ప్రారంభంలో… పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా… రెండవ మ్యాచ్ నుంచి అద్భుతంగా రాణించింది. అండర్ 19 టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా రాణించడంతో… ఫైనల్ వరకు వచ్చింది టీమిండియా. ముఖ్యంగా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అమాన్ లాంటి ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో… ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో ఫైనల్ వరకు వచ్చింది అండర్ 19 టీమిండియా జట్టు.
ఇక ఇవాళ అండర్ 19 బంగ్లాదేశ్ ( Bangladesh U19 ) వర్సెస్ అండర్ 19 టీమిండియా ( India U19 ), మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ మన భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మొదటి బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గురించి మాట్లాడుకున్నట్లయితే.. ఈ స్టేడియంలో టాస్ కీలకం. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకుంటే గెలిచే ఛాన్స్ ఉంటుందట. ఇక అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 22000 మంది కూర్చునే కెపాసిటీ ఉందట.
Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!
మొత్తం స్క్వాడ్‌లు:
భారత U19 జట్టు: ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ అమన్ (సి), కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (w), కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహ, అనురాగ్ కవాడే, సమర్థ్ నాగరాజ్, మహ్మద్ ఈనాన్, ప్రణవ్ పంత్
బంగ్లాదేశ్ U19 జట్టు: జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ (సి), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఎండి ఫరీద్ హసన్ ఫైసల్ (w), దేబాసిష్ సర్కార్ దేబా, ఎండి రఫీ ఉజ్జామాన్ రఫీ, ఎండి సమియున్ బసిర్ రతుల్, అల్ఫా మ్రిధా , ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, Md రిజాన్ హోసన్, అష్రఫుజ్జమాన్ బోరెన్నో, MD రిఫాత్ బేగ్, సాద్ ఇస్లాం రజిన్