Intinti Ramayanam Today Episode February 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఏడవడం చూసి స్వరాజ్యం చెలించి పోతుంది.. మనకి నిజం చెప్పదు మనం వెళ్లి డైరెక్టుగా ఆ రాజేంద్రప్రసాద్ అని అడుగుదాం పదండి అనేసి స్వరాజ్యం ఆ ఇంటికి వెళ్తారు.. అక్కడ స్వరాజ్యం అందర్నీ ఒక ఆట ఆడుకుంటుంది. కోట్లు ఉన్నాయి కానీ మీ దగ్గర కొంచెం కూడా మానవత్వము సంస్కారం లేదు అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు కానీ పార్వతి మాత్రం స్వరాజ్యం మాటకు మాట సమాధానం చెబుతుంది. మీరు ఎలా కాదు గాని మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు ఎవరికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఎన్నో పంచాయతీలు తీర్చాను కదా ఆ మాత్రం తెలియకుండా ఉన్నాను కదా అనేసి స్వరాజ్యం వాళ్లకి వార్నింగ్ వచ్చి వెళ్ళిపోతుంది.. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఇన్ని కోట్లు ఉండి ఏం ప్రయోజనం కోడల్ని ఇంట్లో లేకుండా బయటికి గెంటేశారు. ఆ మాత్రం మీకు కొంచెం కూడా లేదు. మీరేం పెద్ద మనుషులు కట్టుకున్న భార్యను కొడుకు చేత బయటికి గెంటిస్తారా అనేసి స్వరాజ్యం దుమ్ము దులిపేస్తుంది. తనకి పార్వతి కూడా మీకు అవసరం లేని విషయాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు విషయాలు ఏంటో తెలుసుకొని తర్వాత మాట్లాడండి అంటూ పార్వతీ గట్టి వార్నింగ్ ఇస్తుంది. స్వరాజ్యం ఎన్నెన్నో పంచాయతీలు చేయడం నా వల్లే అవుతుంది ఇలాంటి ఒక లెక్కన ఎలా రావాలో అలా వస్తాననేసి బెదిరిస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దయాకర్ నేను మళ్ళీ వస్తాను ఈసారి డబ్బుల కోసం కాదు న్యాయం కోసం వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు.. పార్వతి అవనికి డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది. కానీ బంధుత్వం ఉంది అని అంటుంది.. పల్లవి దెబ్బకు పార్వతి అవని పై కోపాన్ని పెంచుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని కోసం అక్షయ్ వస్తాడు. కానీ అవని అక్షయ్ ను చూసి కలగంటుంది. అక్షయ్ మాత్రం కారు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని ఎదో సాకు చెప్తాడు. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీయ ఇంట్లో పని చేస్తుంటే పార్వతి అక్కడకు వచ్చి పనులన్నీ నీకెందుకు అమ్మ నేను చూసుకుంటాను కదా అనేసి అంటుంది. మనింట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి అత్తయ్య అని శ్రీయ అంటుంది. అప్పుడే పాలవడ వచ్చి అమ్మ పాల డబ్బులు ఇప్పించండి అమ్మ నేను ఊరు వెళ్ళాలి అనేసి అంటాడు. ఇక పార్వతి శ్రీయాను పంపిస్తుంది. అవని దగ్గర డబ్బులున్నాయి వెళ్లి తీసుకొచ్చి ఒక 10,000 అతనికి ఇవ్వమ్మా అనేసి అంటుంది. శ్రియ పల్లవి కోసం వెతుకుతుంది కానీ పల్లవి లేకపోవడంతో అక్కడున్న కీస్ తో కబోర్డ్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడే నెక్లెస్ కింద పడిపోతుంది. దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్న స్త్రీని చూసి పల్లవి కోపంతో రగిలిపోతుందిదాన్ని పట్టుకొని చూస్తూ ఉన్న శ్రీయను చూసి పల్లవి కోపంతో రగిలిపోతుంది. దొంగతనంగా డబ్బులు తీయడం నగలు తీయడం నీకు అలవాటే కదా అందుకే ఇంటికి వచ్చావా అనేసి పల్లవి అనడంతో శ్రియా రెచ్చిపోతుంది.
వీరిద్దరి గొడవ చూసి శ్రీకర్ కమల్ అక్కడికొస్తారు. ఏమైందని అడిగితే పాలు వాడికి డబ్బులు ఇవ్వాలని అత్తయ్య అంటే కానీ పల్లవి లేకపోవడంతో నేను డబ్బులు తీసానండి దానికి నన్ను దొంగ అని అంటుందని శ్రీయ చెప్తుంది. ఇక పల్లవిని కమల్అరుస్తాడు.. మనింట్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటే తప్పేంటి వదిన మీ పరాయిది కాదు కదా దొంగ అంటావా అనేసి అనగానే శ్రీకర్ ఇంకొకసారి తీసుకోవద్దని చెప్పొచ్చు కదా పల్లవి దానికి ఇంతలాగా గొడవ చేయాలా అనేసి అంటాడు. అర్థమైందా శ్రియ ఏ మనుషులతో ఎలా ఉండాలో ఇక మీ నుంచి జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తాడు. కమల్ శ్రీయకి సారీ చెబుతాడు.. ఇక అవని స్వరాజ్యం దయాకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్లు రాగానే నీ సమస్యలన్నీ తీరిపోతాయి అమ్మ నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాం అనేసి అంటారు దానికి అవన్నీ ఫీలవుతుంది మా ఇంట్లో వాళ్ళని అన్ని మాటలు అన్నారే నేను నా కష్టం మీద మీకు చెప్పుకోలేదు నా కష్టాన్ని తీర్చడానికి కూడా మీకు చెప్పుకోలేదు కానీ మీరు ఎందుకు వెళ్లారు అనేసి అడుగుతుంది. ఇక్కడ ఉంటే ఈ గొడవలు ఇంకా పెద్దవయ్యాలో ఉన్నాయి నేను వెళ్ళిపోతాను అనేసి అవని అనగానే స్వరాజ్యం అత్తింటి మీద నీకు ఎంత ప్రేమ ఉంది.. ఇకమీదట నీ గురించి ఏది అడగం నువ్వు ఎన్ని రోజులు కాబట్టే అన్ని రోజులు ఉండు.. నువ్వు మా బిడ్డ లాంటి దానివి అనేసి అవనితో అంటే అవని వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతుంది.
ఉదయం ఇవ్వగానే పార్వతి పల్లవి దగ్గరికి పోయి తాళాలు కావాలని అడుగుతుంది. పల్లవి నేను వాష్ రూమ్ లో ఉన్నాను అత్తయ్య కబోర్డ్ లో తాళాలు ఉన్నాయి తీసుకోండి అని అంటుంది. పార్వతి కబోర్డ్ లో ఉన్న తాళాలు కోసం వెతుకుతూ ఉండగా చీరలు అన్ని కింద పడిపోతాయి. అక్కడ అవనీలాంటి సారీ కనిపించడంతో పార్వతీ దాన్ని తీసుకొని బయటకు వస్తుంది. ఏమైంది ఎందుకలా పరధ్యానంగా ఉన్నామని అందరూ అడిగినా కూడా పార్వతీ పలకదు. పల్లవిని గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది. ఏమైందో అత్తయ్య ఎందుకలా అరుస్తున్నారు అని అంటే ఈ చీర అవినీది కదా నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతుంది.. ఆ చీరను చూసి పల్లవి షాక్ అవుతుంది. అక్కడితోఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి అసలు నిజం బయటపడబోతుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..