Intinti Ramayanam Today Episode January 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో జరిగిన విషయాన్ని అవని శ్రీకర్ తో చెప్తుంది. చక్రధరత్ మా అన్న మాటలు అసలు పట్టించుకోవద్దు వదిన మీరేంటో అన్న ఏంటో మాకు తెలుసు ఆస్తి విషయం మాకు అవసరం లేదు అది నాన్న అన్నయ్య ఇద్దరు కలిసి డెవలప్ చేశారు మాకు ఇందులో సంబంధం లేదు అని శ్రీకర్ అవనికి భరోసా ఇస్తాడు. కానీ అవని మాత్రం మాకు అలాంటి ఉద్దేశం లేకపోయినా మమ్మల్ని కావాలని దోషున్ని చేశారు శ్రీకర్ అని అంటుంది.. ఇక పల్లవి బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్లడానికి కిందకు వస్తుంది. భానుమతి ఏమైందని అడుగుతుంది.. భానుమతి అందర్నీ అరిచి పిలుస్తుంది. అందరూ రాగానే పల్లవి వెళ్ళిపోతుందని ప్రభావతి కంగారుపడుతుంది. అమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అంటే మీ ఇంటి పరువు కాపాడడానికి నేను పెళ్లి చేసుకున్నాను అలాంటిది మా నాన్నకి ఇంట్లో గౌరవం లేదు అవమానం జరిగింది మీ పెద్దబ్బాయి మా నాన్నని కొట్టాడు. మా నాన్నకు అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగింది కదా అది ఆలోచించడం మీరు అని పల్లవి నిలదీస్తుంది.. మా నాన్నని కొట్టాడు అది మీకు సంతోషంగా ఉందా అని అక్షయ్ ని రాజేంద్రప్రసాద్ ని పల్లవి నిలదీస్తుంది. ఇక పల్లవి వెళ్ళిపోతుంటే పార్వతి ఆపి అక్షయ్ ని సారి చెప్పమని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తన పంతాన్ని నెగ్గిచ్చుకుంది. అక్షయ్ పల్లవి తో పాటు చక్రధర్ కూడా సారీ చెప్పాడు.. అక్షయ్ సారీ చెప్పి లోపలికి రావడంతో అవని అక్షయ్ ని ఎందుకు సారీ చెప్పారని అడుగుతుంది. తల్లి ఫీల్ అవుతుందని సారీ చెప్పారు మరి భార్య అంటే మీకు లెక్క లేదా భార్యకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అవని అడుగుతుంది. నేను కేవలం అమ్మ మీద ఉన్న ప్రేమతోనే మనసు చంపుకొని పల్లవికి వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెప్పాను. నేను తల్లిగా గుర్తించట్లేదని బాధపడుతుంది మా అమ్మ బాధపడుతుంది. ఇప్పటికే నేను తన కొడుకును కాదని ఆమె ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇలా చేయడంతో మళ్లీ ఇంకా బాధ పడుతుందని నేను మనసు చంపుకొని క్షమాపణలు చెప్పానని నువ్వు అర్థం చేసుకుంటే మన మధ్య గొడవలు రావని అక్షయ్ అంటాడు.
పల్లవి గదిలో బట్టలు సర్దుతుంది. కమల్ అక్కడికి వస్తాడు.. కమల్ ను చూసి మీరు ఎందుకు ఇలా ఉన్నాడని మనసులో అనుకుంటుంది. ఏమైంది బావ అలా ఉన్నావ్ అని కమల్ ని పల్లవి అడుగుతుంది. నేను నీకు బావని కాదు నీకు భర్తను అంతకన్నా కాదు నేను ఒక తింగరోన్ని నువ్వు అలానే అన్నావ్ మా అన్నయ్య చేత నువ్వు సారీ చెప్పించుకున్నావ్ అది నీకు మంచిదేనా అనేసి అడుగుతాడు. నేను ఏది చేసినా మన మంచికే చేశాను. మా నాన్న నా మంచికే అడిగాడు. ఇందులో తప్పు ఎవరు అనేసి అడుగుతుంది పల్లవి. కానీ కమల్ మాత్రం ముమ్మాటికీ తప్పే అని వెళ్ళిపోతాడు. అక్షయ్ బావ మీద ఇప్పుడు సింపతి ఏర్పడితే అత్తయ్య అక్షయ బావని పూర్తిగా నమ్మేస్తుంది ఇప్పుడు అత్తయ్య మనసులో అక్షయ్ ని పూర్తిగా చెడ్డవాడిని చేయాలని పల్లవి ప్లాన్ వేస్తుంది..
పార్వతి దగ్గరికి పోయి నన్ను క్షమించండి అత్తయ్య ఇదంతా నా వల్లే జరిగింది నేను అలా క్షమాపణలు అడగాల్సింది కాదు. బావగారు వయసు కూడా కుండా మా నాన్నని అవమానించాడు మా నాన్న మీద చేయి చేసుకున్నాడు నాకెలా ఉంటుంది ఇదంతా అక్షయభావ తప్పు కాదు అత్తయ్య అవని అక్కే భావనల రెచ్చగొట్టింది అని పల్లవి అవనిపై అనుమానం క్రియేట్ అయ్యేలా మాట్లాడుతుంది. పల్లవి మనసులో ఉన్నది అంతా పార్వతికి చెప్తుంది. ఇక కమల్ అన్నయ్య అమ్మ ఇద్దరూ సంతోషంగా ఉండాలని వాళ్ళని భోజనం దగ్గరికి తీసుకొస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..