Indian Railways: భారతీయ రైల్వేలో వందేభారత్ రైళ్లు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. సెమీ హైస్పీడ్ రైళ్లుగా అందుబాటులోకి వచ్చి.. దేశ ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అత్యధిక వేగం, అత్యాధునికి సౌకర్యాలతో ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా పలు రూట్లలో తనమ సేవలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణీయంగా తగ్గించడంతో పాటు ఆహ్లాకదరమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.
మూడు వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మార్పు
భారతీయ రైల్వే సంస్థ మూడు వందే భారత్ రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ లో కీలక మార్పులు చేసింది. న్యూఢిల్లీ- శ్రీమాతా వైష్ణో దేవి కత్రా మార్గంలో నడిచే ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో ఛేంజెస్ చేసింది. ఈ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణీకులకు సజావుగా ప్రయాణం కొనసాగేలా ఈ సవరణలు చేసింది. షెడ్యూల్ మార్పులు చేసి రైళ్లు ఇవే..
1.రైలు నంబర్ 22477: న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందేభారత్ ఎక్స్ ప్రెస్
2.రైలు నంబర్ 22439: న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందేభారత్ ఎక్స్ ప్రెస్
3.రైలు నంబర్ 22439: న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందేభారత్ ఎక్స్ ప్రెస్
సవరించిన షెడ్యూల్ వివరాలు
⦿రైలు నంబర్ 22477: న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైలు
దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి కత్రా రూట్ లో నడి చే రైలు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. సుమారు 8.15 గంటలు ప్రయాణించి రాత్రి 11.15 నిమిషాలకు కత్రాకు చేరుకుంటుంది. ఇకపై ఈ రైలు 5 నిమిషాలు ముందుగానే బయల్దేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్త షెడ్యూల్ జనవరి 20 నుంచి అమల్లోకి రానుంది.
⦿రైలు నంబర్ 22439: న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైలు
ఈ రైలు ప్రస్తుతం ఉదయం 8.05 గంటలకు బయల్దేరుతుంది. కానీ, మధ్యాహ్నం 2.15కు కత్రాకు చేరుకుంటుంది. ప్రస్తుతం 2.05 నిమిషాలకే గమ్యస్థానాన్ని చేరుకునేది. ఈ రైలు మొత్తం 8.05 నిమిషాల్లో తన జర్నీని పూర్తి చేస్తుంది. కొత్త టైమింగ్స్ జనవరి 20 నుంచి అమలుకానున్నాయి.
Read Also: ఆ రూట్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ 50 రోజులు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?
⦿రైలు నంబర్ 22478: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- న్యూఢిల్లీ రైలు
ఈ రైలు ప్రస్తుతం ఉదయం 5.50 గంటలకు బయల్దేరుతుండగా, ఇకపై 5.45 గంటలకు బయల్దేరనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీకి చేరుకోనుంది. కొత్త టైమింగ్స్ జనవరి 21 నుంచి అమలులోకి వస్తాయి.
ఇకపై ఢిల్లీ నుంచి కత్రాకు, కత్రా నుంచి ఢిల్లీకి ప్రయాణం కొనసాగించే ప్యాసింజర్లు సవరించిన టైమింగ్స్ గురించి తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. జమ్మూ డివిజన్ లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఇప్పటికే ఒక వందేభారత్ రైలును 50 రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఈ కొత్త రూల్ తెలుసా? అది ఇక చిత్తు కాగితమే.. స్పాట్‌లోనే గెంటేస్తారు జాగ్రత్త!