Intinti Ramayanam Today Episode January 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఒకప్పుడు అత్తయ్య నేనేం చెప్తే అదే అన్నట్టు నా మీద చాలా నమ్మకంతో ఉండేది నన్ను చాలా ప్రేమగా చూసుకునేది నా మాట కాదని ఏది చేసేది కాదు కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే లేదు నేను చేసిన చిన్న తప్పు గురించి నేను చెప్పాను క్షమాపణ అడిగాను కనీసం నాతో మాట్లాడడానికి కాదు కదా నా మొహం చూడడానికి కూడా అత్తయ్య ఇష్టపడటం లేదండి అని అక్షయకు చెప్తుంది. అక్షయ్ నువ్వు మా అమ్మ గురించి నాకు కంప్లైంట్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు. నేను కంప్లైంట్ ఇవ్వడం లేదండి అత్తయ్య గురించి చెప్తున్నాను అంతే అని అంటుంది. ఒకప్పుడు నీతో మంచిగా ఉందని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు ఇప్పుడు నిన్ను దూరం పెడుతుందని అంటున్నావ్ దానికి కారణం కూడా నువ్వే కదా.. నువ్వు చేస్తున్న పనులే మా అమ్మకి నచ్చడం లేదు అందుకే నిన్ను దూరం పెట్టేసిందేమో ఏదైనా ఉంటే మీరు మీరు వెళ్లి చూసుకోవాలి కాని నాకు చెప్పకూడదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.. ఇక కమల్ వదిన ఏడవడం చూసి ఇంట్లో పెద్ద రచ్చే చేస్తాడు. భానుమతి చంపాలని ఆల్మోస్ట్ అనుకుంటాడు. అవని అడ్డు పడటంతో ఆగుతాడు. అటు పార్వతి చిన్న కోడలుకు నెక్లేస్ ఇస్తుంది. పల్లవి అవనిని, అక్షయ్ ను ఇరికించి ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ వేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పార్వతి పల్లవిలు కమల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన అంటే వీడికి ఎంత పిచ్చి ఏంటి అసలు వీడ్ని ఎలా వదిలి పిచ్చి నుంచి బయట పడేయాలని భానుమతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా అర్థం కావట్లేదు అమ్మమ్మ మనం ఏం చేయాలనుకున్న కమ్మలు చూసి భయపడి పోవాల్సి వస్తుంది అనేసి అంటుంది. ఇక పార్వతి తన కోడలికి నగలిచ్చి, తిరిగి వచ్చేటప్పుడు దయాకర్ ఆ నగను కావాలని డిమాండ్ చేస్తాడు. కానీ పార్వతి అది మా వంశపారంగా వస్తుంది నెక్లెస్ ఇది మా ఇంటి కోడలకే ఇవ్వాలి నీకు వేరేది కావాలంటే ఇస్తానని అంటుంది. దానికి దయాకర్ అక్షయకు నిజం చెప్తే సరిపోతుంది కదా నేను మిమ్మల్ని అడుక్కోవడమేంటి అన్నట్టుగా మాట్లాడుతాడు. అక్షయకు నేను మేనమామ ని ఈ నిజాన్ని బయట చెప్పకుండా ఉండడానికి మీ ఆయన నాకు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తున్నాడు ఇక నువ్వు ఇస్తావా లేదా నిజం చెప్పమంటావా అని బెదిరిస్తాడు.. అక్షయ్ కు ఎక్కడ నిజం తెలిసిపోతదో తన కన్నతల్లి కాదని ఎక్కడ తెలిసిపోతుందని భయపడ్డ పార్వతి ఆ నెక్లెస్ ఇవ్వడానికి ముందు ఆలోచించినా అక్షయ కోసం ఇవ్వక తప్పదని అనుకుంటుంది.
ఈ నెక్లెస్ గురించి ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటూ దయాకర్కు ఆ నెక్లెస్ ఇస్తుంది. ఇక పల్లవి చక్రధర్లు అవనిని అక్షయ్ నీ ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించాలని ఈసారి ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదని పక్కా ప్లాన్ చేస్తారు. దయాకర్ కు ఆ నగని తీసుకురమ్మని చెప్తారు. దయాకర్ పార్వతి దగ్గర తీసుకున్న నెక్లెస్ ను పల్లవి వాళ్లకు ఇస్తాడు. ఈ నక్లెస్ తోనే ఇంట్లో రచ్చ రాజేసుకొనేలా చేస్తాను అవని ఆక్చలు బయటికి వెళ్లేలా చేస్తాను అని పల్లవి అంటుంది. ఈ నెక్లెస్ నీకు ఇవ్వాలంటే నాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు దయాకర్. ఇక చక్రధర్ వాడికి డబ్బులు ఇస్తాడు. ఇక పల్లవి ఈ నెక్లెస్ ని ఎలాగైనా అక్షయ్ భావ దగ్గరికి చేరాలి అది అవని దగ్గరికి చేరాలి అప్పుడే అత్తయ్య నమ్ముతుంది వాళ్ళిద్దరి మీద అనుమానం పెంచుకుంటుంది అనేసి ప్లాన్ చేస్తుంది. ఇంట్లో ఈసారి మామూలు ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ జరుగుతుందని సంబరపడిపోతుంది. అనుకున్నట్లుగానే తన ప్లాన్ ని వర్కౌట్ చేస్తుంది. ఆ నెక్లెస్ ను అక్షయ దగ్గర నుంచి అవనీకి చేరేలా చేస్తుంది. ఇక అవని ఆ నెక్లెస్ ని వేసుకొని మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన భానుమతి పార్వతికి చెప్పాలని పార్వతిని తీసుకొని వస్తుంది. అత్తయ్య ఈ నెక్లెస్ ఎలా ఉందని అడుగుతుంది. ఈ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు అని పార్వతి అడుగుతుంది. అయినా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అత్తయ్య ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది అవని. పార్వతీ మనసులో అక్షయ పై అనుమానం మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి ప్లాన్ అవన్నీ తెలుసుకుంటూనేమో చూడాలి..