Ind vs Aus 5Th Test: సిడ్నీటెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైంది. దీంతో టీమిండియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ తరుణంలోనే… 3-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది ఆసీస్. దీంతో దాదాపు 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. గత 2015 నుంచి ఇప్పటి వరకు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఈ తరునంలోనే… 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.
ఈ చివరి టెస్ట్ మ్యాచ్ లో… రెండు జట్లు బాగా ఆడినప్పటికీ… చివర్ లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే చివరి టెస్టులో… 162 పరుగుల లక్ష్యాన్ని.. ఆస్ట్రేలియా జట్టు అవలీలగా ఛేదించింది. ముందు కాస్త తడబడిన.. అటు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) రాలేకపోవడంతో రెచ్చిపోయింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే 162 పరుగుల లక్ష్యాన్ని… 27 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి చేదించింది ఆస్ట్రేలియా…. దీంతో దాదాపు పది సంవత్సరాల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ( Border Gavaskar Trophy )గెలుచుకుంది.
ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లలో… రెండవ వినింగ్స్ లో టాప్ ఆర్డర్ కుప్ప కూలింది. సామ్ కాన్స్టాస్ 22 పరుగులు చేయగా… ఉస్మాన్ ఖవాజా 41 పరుగులు చేసి… అవుట్ అయ్యారు. ఇక మర్నస్, స్టీవెన్ స్మిత్ దారుణంగా విఫలమయ్యారు. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ట్రావిస్ హెడ్, అలాగే వెబ్ స్టార్ జట్టును ఆదుకున్నారు. అప్పటికే నాలుగు వికెట్లు పడగా… మరొక వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లు ఎంత టెంప్ట్ చేసినా.. చాలా జాగ్రత్తగా ఆడారు. మొత్తంగా పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టులో అండర్ ఫైర్ ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులు చేసి టాప్ స్కోర్ చేశాడు. ట్రావిస్ హెడ్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అటు అరంగేట్రం ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశాడు.
Also Read: Travis Head: ఒరేయ్ ఏంట్రా.. SRH హెడ్ ను లేడీ చేసేశారు ?
దీంతో 27 ఓవర్ లోనే మ్యాచ్ ముగించేసింది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ టీమిండియా కు బ్యాడ్ లక్ ఏంటంటే… టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )… గాయం కారణంగా… రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. అదే ఇప్పుడు టీమిండియా కొంపముంచింది. ఒకవేళ టీమ్ ఇండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ చేసి ఉంటే… మ్యాచ్ ఫలితం వేరే లాగా ఉండేది. కానీ టీమ్ ఇండియా దురదృష్టం… నిన్న టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )కు గాయమైంది.
అయితే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ.. బౌలింగ్ చేయలేకపోయాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ). ఇవాళ ఉదయం బ్యాటింగ్ కు వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ఏమాత్రం ఆకట్టుకోలేదు. కానీ బౌలింగ్ చేసి ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియన్ కట్టడి చేసేవాడు. ఇక చివరి టెస్టులో మ్యాచ్ టీమిండియా దారుణంగా ఓడిపోవడంతో…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship ) నుంచి కూడా అధికారికంగా టీమిండియా వైదొలిగింది. దీంతో డబ్ల్యూటీసీ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తలపడబోతున్నాయి. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో.. టీమిండియా కు మూడవ స్థానం దక్కింది.