Intinti Ramayanam Today Episode july 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఆ రోజు నగలు కొట్టేసింది నిజంగానే కమల్ బావ. శ్రీయా అన్నట్లు బావే ఆ నగలను కొట్టేసాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చూసిన శ్రియ.. ఏంటి నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నావా అని పల్లవి తో అంటుంది. నీ గురించి తప్ప నాకు వేరే పని ఏం లేదా అని పల్లవి అంటుంది. మా బావ దొంగతనం చేశాడంటే కచ్చితంగా శ్రీకర్ బాబు కూడా హెల్ప్ చేశారని నాకు అనుమానం వస్తుంది అని అనగానే.. మీ ఆయన దొంగతనం చేశాడంటే నమ్మొచ్చు మా ఆయన జోలికొస్తే మర్యాదగా ఉండదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి ఇది తింగరిదా అనుకున్నా.. పిచ్చిది కూడా అని అర్థమవుతుంది. ఉదయం లేవగానే అవని వంట చేస్తూ ఉంటుంది అక్షయ్ అవనిని నేను చూస్తాడు. అవని పైట చెంగు స్టవ్ మీద పడటంతో ఆ విషయాన్ని గమనించిన అక్షయ్ వెంటనే అవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పైటకొంగుకు నిప్పు అంటుకుంది ఆ మాత్రం చూసుకోవా నువ్వు అని అరుస్తాడు. పల్లవికి నిజం తెలిసిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఇంట్లో అక్షయ్ కనిపించడంతో వీడియో తీస్తుంది. కచ్చితంగా అవని అక్క ఇది అంత చేసింది అని అత్తయ్యకి చెప్తే ఎంత గొడవ చేస్తుందో అర్థమవుతుంది అని పల్లవి వెళ్తూ ఉంటుంది. అవని కారు ఆపి పల్లవి ఈ నిజాన్ని నువ్వు అత్తయ్య చెప్తే నీ గురించి మీ నాన్న గురించి మొత్తం బండారు అని బయట పెట్టాల్సి వస్తుందని బెదిరిస్తుంది. అంతేకాదు నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయానని చంప పగలగొడుతుంది. మీ నాన్న గురించి నీ గురించి బయట పెడితే ఆ తర్వాత మీ నాన్న జైలుకు వెళ్తాడు నువ్వు రోడ్ల పట్టుకుని తిరుగుతావు అని వార్నింగ్ ఇస్తుంది.
నీకు నువ్వు నిజం చెప్పాలని చూసావనుకో నీకు ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని అవని అంటుంది. పల్లవిని మాట్లాడినవ్వకుండా అవని నోరుని లాక్ చేస్తే వస్తుంది. విషయం చెప్పాలనుకుంటే చెప్పు నీ ఇష్టం అని అంటుంది. అవినీకి అడ్డంగా దొరికిపోయాము. కచ్చితంగా ఈ విషయాన్ని బయటపెట్టి నాన్న నేను ఇదంతా చేశామని తెలుసుకుంటుందని కంగారు పడుతుంది. ఈ విషయం గనుక తెలిస్తే ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
దారిలో కారు ఆపేసి తలను అక్కడున్న ఫోన్ కి కొట్టుకుంటుంది. అవని కచ్చితంగా మొత్తం రాబట్టేస్తుంది. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. అక్కడ దారిలో వెళ్తున్న ఒక ఆవిడ అత్త పోరు మొగుడు పేరు ఏమైనా ఉందా అని అడుగుతుంది. అయినా నా గురించి నీకెందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పల్లవి అరుస్తుంది. ఆ తర్వాత చక్రధర్ కి ఈ విషయాన్ని చెప్పాలని చెప్తుంది. అవి నీకు తెలిసే ఛాన్స్ లేదు నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటానని చక్రధర్ మాత్రం చాలా కూల్ గా సమాధానం చెబుతాడు.
నాన్న ఇలా కూల్ గా సమాధానం చెప్తున్నాడేంటి నాకు మాత్రం టెన్షన్తో తట్టుకోలేకపోతున్నానని పల్లవి అనుకుంటుంది. శ్రియ ఇంట్లో పనులన్నీ నామీద వదిలేసి ఈ పల్లవి షికారు కెళ్ళిందని తిట్టుకుంటూ ఉంటుంది . అప్పుడే ఇంట్లోకి వచ్చిన పల్లవిని చూసి శ్రేయ పల్లవి ఇటు రా అని గట్టిగా అరుస్తుంది. అసలే చిరాకులో ఉన్న పల్లవి శ్రేయ మాట వినగానే కోపంతో రగిలిపోతుంది. అయితే నన్ను అడగడానికి నువ్వెవరు అని గట్టిగా బాధిస్తుంది. పని తప్పించుకోవడానికి నువ్వు బయటికి వెళ్ళావా అని శ్రేయ అనడంతో కోపంతో చంప పగలగొడుతుంది.
అది చూసిన కమల్ వదిన చంప పగలగొడతావా అనని కొట్టబోతాడు. అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం ఎక్కడి నుంచి నేర్చుకున్నావ్ రా అని అరుస్తుంది. వదినను కొట్టింది అని చెప్పగానే అసలు ఏమైందో అడుగుతుంది పార్వతి.. ఇలాగే వదిలేస్తే ఈరోజు నన్ను కొడుతుంది రేపు నిన్ను కొడుతుంది అని పార్వతితో కమలంటాడు.. వయసులో నీకన్నా శ్రేయ పెద్దది నువ్వు క్షమాపణ చెప్పు అని పార్వతి అంటుంది. పార్వతి మాట కాదనలేక పల్లవి క్షమాపణ చెప్తుంది.
ఇక రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. కమల్ మౌనంగా ఉండడం చూసి శ్రీకర్ ఏమైందిరా అలా ఉన్నావ్ అని అడుగుతాడు. నా భార్య నీ భార్యని కొట్టిన అని తెలిస్తే నువ్వు పెద్ద రచ్చ చేస్తావా అందుకే నేను ఏం మాట్లాడలేదు అనుకుంటాడు. అవును పల్లవి అక్షయ దగ్గరకెళ్ళావ్ కదా అక్షయ ఎలా ఉన్నాడు బాగున్నారా అనేసి అడుగుతుంది పార్వతి. అక్షయ అవని అక్క ఇద్దరు బాగున్నారా అత్తయ్య అని పార్వతి అంటుంది. అదేంటి అవని గురించి ఎందుకు చెప్తున్నావు అని పల్లవిని అంటుంది. నేను ఇచ్చిన సున్నుండలు తిన్నాడా అని పార్వతి అడుగుతుంది. మొత్తం తిన్నాడు అత్తయ్య అని పల్లవి అంటుంది.
Also Read : రోహిణి ప్లాన్ సక్సెస్..మీనా పై ప్రభావతి సీరియస్.. మనోజ్ కు షాక్..
ఎలా ఉన్నాయి అంట బాగున్నాయంటా నాని పార్వతి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఇదంతా ఎందుకు మీరే వీడియో కాల్ చేసి ఒకసారి ఎలా ఉందో అడగండి అని పల్లవి సలహా ఇస్తుంది. ఆ తర్వాత అక్షయ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుందని జూమ్ చేసి ఫోన్ మాట్లాడాలని కాల్ లిఫ్ట్ చేస్తాడు. పార్వతీ అందరితో నార్మల్గానే మాట్లాడుతాడు. ఫోను ఎలాగో మేనేజ్ చేసాడు అని పల్లవి డల్ అవుతుంది. ఇంకా అక్షయ్ హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవుతాడు. అవని నేను అందుకే వచ్చాను నేను తీసుకెళ్తాను పదండి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..