BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ సక్సెస్..మీనా పై ప్రభావతి సీరియస్.. మనోజ్ కు షాక్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ సక్సెస్..మీనా పై ప్రభావతి సీరియస్.. మనోజ్ కు షాక్..

Gundeninda GudiGantalu Today episode july 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు బిర్యాని తీసుకొని వచ్చి అందరిని తినమని అంటాడు. ప్రభావతి మాత్రం రవి లేకుండా నేను అసలు తినను అని అంటుంది. అయితే బాలు మీకు ఒక నిజం చెప్పాలి ఇది అమ్మానాన్న తినలేదంటే రవిని స్వయంగా వంట వండి తీసుకొని వచ్చాడు. మిగతా హోటల్ ఎవరైనా బకెట్లో పెట్టిస్తారా వాడు కాబట్టి చేసి పంపించాడు అని అంటాడు. మాట వినగానే ప్రభావతి రవి పంపించాడా వాడే తీసుకురావచ్చు కదా అని అంటుంది. వాళ్ళ ఆవిడని తీసుకొని వస్తాడట నేను వెళ్లి మాట్లాడాను అని అంటాడు. అందరూ కలిసి బిర్యానిని ఓ పట్టు పడతారు. బిర్యానీ చాలా బాగుంది రవి గాడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని ప్రభావతి బిర్యానిని ఎప్పుడు తిననట్లు తినేస్తుంది. మనోజ్ కూడా బిర్యానీ చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు. మీనా నువ్వు కూడా తిను అనేసి అంటుంది ప్రభావతి. భోజనం చేసిన తర్వాత రోహిణి దగ్గరికి వెళ్లి మీ నాన్న ఎక్కడ అని అడుగుతుంది. రోహిణిని నాలుగు చెరువుల నీళ్లు తాగిస్తుంది.. మాణిక్యం వచ్చి రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడు అని చెప్తాడు. ఆ మాట విన్న ప్రభావతి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విజ్జితో రోహిణి మరో ప్లాన్ గురించి చెప్తుంది. మాణిక్యాన్ని ఒకసారి పిలువు ఆయనకు మొత్తం చెప్పి నాన్న మేటర్ ని క్లోజ్ చేద్దామని రోహిణి అంటుంది. మటన్ మాణిక్యం ఇంటికి రాగానే హడావిడి చేస్తాడు. బాలు ఆయనతో ఒక ఆట ఆడుకుంటాడు.  ఏమైందండీ ఎందుకట హడావిడి చేస్తున్నారంటే రోహిణి వాళ్ళ నాన్నను పార్ట్నర్స్ మోసం చేసి కోట్లు దోచుకున్నారు. మేక కూడా హాని కలిగించని ఆయనను తన పార్టనర్స్ డబ్బులు లాగేసుకుని జైలుకు పంపించారు అని చెప్తాడు. ఆ మాట వినగానే రోహిణి కెవ్వుమని అరుస్తుంది. ఆస్తులు కూడా రావు ఆయన వచ్చేంతవరకు అని మాణిక్యం చెప్పడంతో ప్రభావతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది..

అయితే సత్యం మనిషి జైల్లో ఉంటే ఆస్తులు అంటావేంటి అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు. అది కాదండి ఆయనకు కూతురైన అల్లుడైన వీళ్ళే కదా.. దగ్గరుండి ఆయన ఆస్తులు విడిపించాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది కదా.. మన రోహిణి మీరిద్దరూ అక్కడికి వెళ్లి ఆస్తులు గురించి తెలుసుకోండి అని ప్రభావతి అంటుంది.. నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు మనిషి జైల్లో ఉంటే ఆస్తి ఆస్తి అని చస్తావ్ ఏంటి అంటూ సత్యం సీరియస్ అవుతాడు.


దానికి మాణిక్యం మనోజ్ కూడా అక్కడికి వెళ్లడానికి వీల్లేదు. ఎందుకు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంది. వీళ్ళ నాన్నకు సంబంధించిన బంధువులను ఎవరు వచ్చినా సరే అరెస్టు చేయాలని పోలీసులు వెతుకుతున్నారట అందుకే అక్కడికి వెళ్లడానికి వీల్లేదు. మరి నువ్వు కూడా మలేషియా కి వెళ్ళవన్నమాట అని బాలు అంటాడు. ఆవిడను దుబాయ్ కి పంపాను. నేను ఇండియాలోనే ఉండిపోతాను అని అంటాడు. వాళ్ళ నాన్న జైలు నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మలేషియాకి వెళ్తాను అని మాణిక్యం చెప్తాడు. సరే పాపా నువ్వు జాగ్రత్త నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ప్రభావతికి మీనా కాఫీ తెచ్చేస్తుంది. ఆ కాఫీ ని తీసుకోకుండా ప్రభావతి విసిరి కొడుతుంది. ఇంట్లో ఇన్ని అనర్ధాలు జరగడానికి కారణం మీనానే.. ఇది ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అన్ని నష్టాలే జరుగుతున్నాయి. ఒక నష్టజాతకురాలు. అంటూ మీనాని దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి. ఇప్పుడు నేనేం చేశాను అని నేను అడుగుతుంది. రూపాయికి దండగ లేనిది ఇలా మా నెత్తిన కూర్చోవాలని చూస్తున్నావా అంటూ ప్రభావతి పొంతన లేకుండా నానా మాటలు అనేస్తుంది.

మీనా మాత్రం మాట పడనివ్వకుండా ఎవరు రూపాయికి గతి లేకుండా ఉంటున్నారు. ఆయన కార్ డ్రైవింగ్ చేసి సంపాదించి ఇంట్లో ఇవ్వట్లేదా? నేను పూలమ్మి రూపాయి సంపాదించట్లేదా ఇంట్లో పని అంతా చెయ్యట్లేదా? ఎవరి గురించి మాట్లాడుతున్నారో అత్తయ్య అంటూ ప్రభావతిని మాట మాట్లాడి నిలకుండా అరుస్తుంది మీనా. అందరూ వెళ్లిపోయారు అంటే అది మావ తప్పు కాదు అని అనగానే ప్రభావతి ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోతుంది.

మీనా దగ్గరికి వెళ్లిన బాలు శృతిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? నువ్వు దొంగ అని అన్న ఇంటికి నువ్వు ఎలా వెళ్లావు? నీకేం అవసరం ఉండి వెళ్ళావ్ అక్కడికి అని మీనాకు క్లాస్ పీకుతాడు. శృతి రవిల కోసం అత్తయ్య చాలా దిగులు పెట్టుకుంది అందుకే వెళ్ళానండి అని మీనా అంటుంది.. మీరు రవి దగ్గరికి ఎందుకు వెళ్లారో నేను శృతి దగ్గరకి అందుకే వెళ్లాను వాళ్ళిద్దరూ కలిసి వస్తే బాగుంటుంది అని మీనా అంటుంది.

Also Read : ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్.. కోట్ల సంపాదన.. ఎవరంటే..?

రోహిణి దగ్గరికి దినేష్ వెళ్తాడు. నా భార్య పిల్లలు దూరం అవడానికి కారణం నువ్వే.. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక లక్ష రూపాయలు డబ్బులు అవసరం అవుతాయి. నువ్వు ఇస్తే ఓకే లేదంటే నీ గుట్టు మీ ఇంట్లో వాళ్లకి తెలిసేలా చేస్తాను కళ్యాణి అని అంటాడు. అప్పుడే పార్లర్ కి మనోజ్ రావడం చూసి రోహిణి అలాగే ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది. రోహిణి దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి కెనడాకు వెళ్లడానికి అని అడుగుతాడు. మాట వినగానే రోహిణి సీరియస్ అయ్యి మీ అమ్మానాన్న అడుగు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు ఇస్తారు అని సలహా ఇస్తుంది. అనూస్ ఇంటికి రాగానే సత్యం ను ప్రభావతిని ఆ విషయాన్ని అడగడాలని అనుకుంటాడు. బాలు మనోజ్ పై సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?

GudiGantalu Today episode: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: వేదవతికి కొత్త టెన్షన్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..ఇంట్లో బాంబ్ పేల్చిన కళ్యాణ్..

Big Stories

×