BigTV English

Fire accident in balanagar: బాలానగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in balanagar: బాలానగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in balanagar: బాలానగర్‌లోని ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం స్థలంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్పాట్‌లో 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవటంతో పెద్ద ఎత్తున ప్రాణపాయం తప్పింది.


Also Read: ఏంది సార్లు ఇది.? ప్రాజెక్ట్ కట్టింది నీళ్ల కోసం కాదా.! పైసలు దోచుకోవడానికా.?

అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూటా.. లేకపోతే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


బాలానగర్‌ అగ్ని ప్రమాదంపై వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. అసలు కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవన్న నార్త్‌జోన్ DFO శ్రీదాస్ తెలిపారు. తెల్లవారుజామున 3:25 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. ప్రమాదం జరిగిన 15 నిమిషాల తర్వాత సమాచారం వచ్చిందన్నారు ఆయన. షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామంటున్న శ్రీదాస్‌ తెలిపారు.

Related News

Husband And Wife Incident: అర్ధరాత్రి గొడవ.. భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త..

Vasudha Pharma: విషాదం.. విశాఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య..

Varshini Case: కన్నతల్లే హంతకురాలు.. వర్షిణి హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Medchal News: గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రికొడుకులు మృతి

Eluru Nimajjanam: వినాయక నిమజ్జనంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. పగిలిన తలలు

Bus Road Incident: కంటైనర్‌‌ను ఢీ కొన్న ట్రావెల్స్‌ బస్సు.. స్పాట్‌లో నలుగురు మృతి!

Big Stories

×