Intinti Ramayanam Today Episode july 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి, భరత్ లు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని తెలుసుకున్న పల్లవి ఇంటికి వెళ్లి పార్వతి తో అత్తయ్య ఆ భరత్ ప్రణతి ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారు. భరత్ అవనితో చెప్పడం నేను విన్నాను అని అంటుంది.. అయితే పార్వతి అవని ఏమంటుంది అని అడుగుతుంది. నాకు తెలిసి అవని అక్కని వాళ్ళిద్దర్నీ దగ్గరుండి కలిసేలా చేసిందేమో అని అనుమానంగా ఉంది అత్తయ్య అని అంటుంది. మనం మన ప్రణతిని ఇంటికి తెచ్చుకుంటే వాడికి దూరంగా ఉంటే అంతా మర్చిపోతారు అని ఒక ప్లాన్ చెప్తుంది.
పార్వతి ఈ ప్లాన్ బాగుంది ఇదే మనం ఫాలో అవుదామని అంటుంది. అటు అవని వీరిద్దరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. స్వరాజ్యం ఈ విషయాన్ని మీ మామయ్యకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని అంటుంది. ఇదంతా నేను చూసుకుంటాను అనుకుంటుంది. ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న ఆయనకు తెలిస్తే శాశ్వతంగా దూరం అవుతాడు.. ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు పల్లవి, పార్వతి ప్లాన్ చేస్తారు. అందుకే షష్ఠి పూర్తి ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని కమల్ తో చెప్తారు.. అవని వదిన నాన్న మళ్ళీ ఇంటికి వస్తారంటే మేము ఏదైనా చేస్తామని హడావిడి చేస్తారు శ్రీకర్, కమల్. ఈ విషయాన్ని వెంటనే వదిలేసి చెప్పాలని కమల్ ఫోన్ చేస్తాడు. వదిన నీకు గుడ్ న్యూస్ అమ్మ నిన్ను నాన్నని షష్టిపూర్తికి పిలవాలని అనుకుంటుంది. అంటే మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయి. మనమందరం కలిసి ఉండే రోజులు వచ్చాయి అని అంటాడు.
అదేంటి షష్టిపూర్తి ఏంటి అని అవని అంటుంది. అన్నయ్య బామ్మ అక్కడ చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. ఈ విషయాన్ని అవని రాజేంద్రప్రసాద్ తో చెప్తుంది. ఉదయం లేవగానే అక్షయ్ కు భానుమతి కాఫీ ఇస్తుంది. ఇదిగోరా నీకు అవని కాఫీ ఇవ్వమనింది అని భానుమతి ఇస్తుంది. కాఫీ ఇస్తే సరిపోతుందిగా అవనీవమనింది అని ఎందుకనాలి అని అక్షయ్ అంటాడు. నాకు ఇప్పుడు నయమైంది కదా ఇంకెన్ని రోజులు మనం ఇక్కడే ఉంటాము వెళ్ళిపోదాం పదనానమ్మ అని అంటాడు అక్షయ్.
నువ్వు ఇంకాస్త నీరసంగా ఉన్నావు రా కొద్దిరోజులు ఆగి వెళ్ళిపోదాంలే ఇప్పుడే అంత తొందర అని భానుమతి అంటుంది.. పల్లవి పార్వతి ఇద్దరూ కలిసి అవనీని రాజేంద్ర ప్రసాద్ ని పిలవాలని అక్కడికి వస్తారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉండడం చూసిన పల్లవి అక్షయ్ బావ అమ్మమ్మ అక్కడే ఉన్నట్టున్నారు. ఇదే మంచి టైం అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అక్షయ్ పార్వతి వచ్చి అమ్మ ఏంటి అటే వెళ్ళిపోతున్నావ్ అని అడుగుతారు.
రేపు షష్టిపూర్తి చేసుకుందామని అనుకున్నాను రా మీ నాన్నని అవనిని పిలుద్దామని అనుకున్నాను. అందుకే అటు వెళ్తున్నాను పిలిచి మళ్లీ ఇక్కడికి వస్తానని పార్వతి అంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే పార్వతీ పల్లవిని చూసి చూడనట్టుగానే ప్రవర్తిస్తారు అందరూ. పల్లవి మావయ్య అని అరుస్తుంది. వాళ్లు వస్తారని తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ కావాలని బెట్టు చేస్తాడు.. మొత్తానికైతే రూములోంచి బయటికి వస్తాడు.
ఏంటి మహానుభావులు ఊరికే రారు కదా ఏదో పనితోనే వచ్చినట్టున్నారు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మీరు నేను కలిసి షష్ఠి పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాను.. షష్టిపూర్తి మనిద్దరి కదా నా పర్మిషన్ లేకుండా ఎలా చేద్దాం అనుకున్నావ్ అని రాజేంద్రప్రసాద్ పార్వతిని అడుగుతాడు. దానికి పార్వతి షష్టి పూర్తి చేసుకుంటే మంచిదని అన్నారు కదా అందుకే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను మీరు రండి అనేసి అంటుంది.
నేనిప్పుడు అవని దగ్గర ఉన్నాను నేను ఏం చేయాలన్నా కూడా అవని పరిమిషన్ తీసుకోవాలి కదా. ముందు నువ్వు అవనిని పిలిచి ఈ విషయాన్ని చెప్పు తను ఏమంటుందో చూడాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అవనిని గట్టిగా పిలుస్తుంది పార్వతి.. అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు అని అవని అంటుంది. మీ మావయ్యతో నేను షష్టిపూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు మీ తమ్ముడు ప్రణతి అందరూ కలిసి రావాలి అని పిలుస్తుంది.
మీరు ఇంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం అత్తయ్య కచ్చితంగా వస్తాము అని అవని అంటుంది. ఇదంతా చేసుకునేది నా కూతురు కోసమే అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్షయ్ దగ్గరికి వెళ్లిన పార్వతి రేపే కదా ఫంక్షన్ వెళ్దాం పదండి అని అంటుంది. భానుమతి ఫంక్షన్ రేపే కదా నేను మీతో పాటు రావడానికి బ్యాగు సర్దుకున్నాను అని అంటుంది. కానీ అక్షయ్ మాత్రం నేను ఆ ఇంటికి రానని తెలుసు కదా.. ఏదైనా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకోవచ్చు కదా అని అంటాడు.. బడ్జెట్ లేదు కదరా అందుకే అలా చేశాము రేపు నువ్వు తప్పకుండా రావాలని పార్వతి పిలుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..