Pawan Kalyan: ఎట్టకేలకు తన సినిమా ప్రమోషన్‌లో కీలక విషయాలు బయటపెట్టారు హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రత్యర్థుల రాజకీయాలు, సొంత పార్టీ నిర్మాణం, పరిపాలన ఇలా చాలా విషయాలు బయటపెట్టారు. ఇక రాజకీయాల విషయానికి వద్దాం.
కొద్దిరోజులుగా వైసీపీ అధినేత జగన్ మొదలు నేతలు సైతం ‘రప్పా రప్పా’ మాట్లాడడం మొదలుపెట్టారు. దీనిపై తనదైన శైలిలో నవ్వుతూ ప్రత్యర్థులకు చరకలు అంటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కోసేస్తాం.. నరికేస్తాం అంటే ఇక్కడెవరూ చేతులు కట్టుకుని కూర్చోరని అన్నారు. బెదిరింపులకు పాల్పడడం వాళ్ల నైజమని చెప్పకనే చెప్పారు. వాళ్లవన్నీ తాటాకు చప్పుళ్లని వ్యాఖ్యానించారు.
వాళ్ల బెదిరింపులకు ఎదుర్కొని నిలబడ్డామని అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ కేసులు హఠాత్తుగా పెరగడానికి గత పాలకులే కారణమని బాణం వదిలారు. అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేస్తామని చెప్పి, ఆ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కేసులు పెరగడం వెనుక కల్తీ మద్యమే కారణమన్నారు.
సినిమాల మీదున్న దృష్టి పాలనపై పవన్ కల్యాణ్‌కు లేదంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై గట్టిగా కౌంటరిచ్చారు. వాళ్లు పత్రికలు, టీవీల పేరుతో బోలెడు బినామీ కంపెనీలు నడుపుతారని చురకలు అంటించారు. సంపాదనకు అనేక ఆదాయ మార్గాలు పెట్టుకుంటారని అన్నారు. తాను సినిమాలు మానేయాలా? అంటూ ప్రశ్నించారు.
ALSO READ: తిరుమల భక్తులకు తీపి కబురు.. కొద్ది గంటలు మాత్రమే
సిమెంట్ ఫ్యాక్టరీలు, వారు చేసిన వ్యాపారాలు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. తన సినిమాలు చేయడమే కనిపిస్తున్నాయని, వాళ్లు చేసేది కనిపించదా? కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. వాళ్ల మాదిరిగా తనకు ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నానని మనసులోని మాట బయటపెట్టారు.
తాను చేస్తున్న మూడు సినిమాలు ఎన్నికల ముందు పూర్తి చేయాల్సివుండగా రాజకీయ కారణాల వల్ల సమయం కేటాయించలేకపోయానని అన్నారు. కూటమిలో మూడు పార్టీలు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం. పార్టీ తరఫున ఎక్కడైనా సమస్యలుంటే వ్యక్తి గతంగా చొరవ తీసుకుని పరిష్కరిస్తున్నానని వెల్లడించారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆగస్టు 15 తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు పవన్ కల్యాణ్. ఒకప్పుడు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. క్వాంటం వ్యాలీ వల్ల ఫలితాలు ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చని, రాబోయే దశాబ్దం తర్వాత వాటి ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు.
తనపై కక్షతో ‘భీమ్లా నాయక్’ సినిమా టికెట్ ధర పెంచేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. ‘హరిహర వీరమల్లు’ టికెట్ ధర పెంచేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి వద్ద ఉందని, అయినా టికెట్ ధర పెంపు దస్త్రాన్ని నేరుగా సీఎంకు తానే పంపానన్నారు. ఇతర సినిమాలకు ఇచ్చినట్లే తనకు అనుమతి ఇచ్చారని తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటివరకు నేను దృష్టి పెట్టలేదు : పవన్ కళ్యాణ్
ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపై పని చేస్తాను
రాజధాని భూసేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వండి, బలవంతం లేదు
నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు
దానిపై నేనే నిర్ణయం తీసుకోవాలి… pic.twitter.com/x0S7B8YVBF
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2025