BigTV English

BRS Karimnagar: ఉత్కంఠ రేపుతోన్న గులాబీ నేతల సైలెంట్

BRS Karimnagar: ఉత్కంఠ రేపుతోన్న గులాబీ నేతల సైలెంట్

BRS Karimnagar: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కరీంనగర్ జిల్లానే.. అంతేకాకుండా గులాబీ పార్టీకి ఆజిల్లానే ఊపిరి పోసింది.. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు.. అధికారంలోకి రావడంలో కరీంనగర్ జిల్లానే అండగా నిలిచింది.. అలాంటి జిల్లాలో బిఆర్ఎస్ నేతలు కొంతకాలంగా పూర్తిగా సైలెంటై పోయారు. కీలక నేతలంతా హైదరాబాద్‌లోనే మకాం వేస్తున్నారు. ఒక్కటి.. రెండు కార్యక్రమాలు చేసి.. చేతులు దులుపుకుని వెళ్లి పోతుండటంతో గులబీ శ్రేణులకు దిశానిర్ధేశం లేకుండా పోయిందంట


బీఆర్ఎస్‌కు కంచుకోటగా నలిచిన కరీంనగర్ జిల్లా

గతంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2018 ఎన్నికల వరకు.. అక్కడ ఆ పార్టీ పట్టు నిలుపుకుంటూ వచ్చింది. అన్ని ఎన్నికల్లో 90 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గాలిలో…13 స్థానాలకు గాను 5 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తొలి 6 నెలలు ప్రతిపక్షాలు సైలెంట్‌గా ఉంటాయి.


16 నెలలు గడుస్తున్నా కనపించని బీఆర్ఎస్ దూకుడు

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా.. బీఆర్ఎస్ దూకుడు మాత్రం కనబడటం లేదు. ఇప్పటికీ కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ క్యాడర్ బలంగానే ఉంది.. హుజురాబాద్ ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి ఒక్కరే కాస్తా దూకుడుగా వెళ్తున్నారు. మిగితా నేతలంతా.. ఏదైనా పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. కేటిఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు. మిగితా సమయాల్లో చడీ చప్పుడు చేయడం లేదు.

మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, పుట్ట మధు, కోరుకంటి చందర్

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులంతా సైలెంటయ్యారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మంథని మాజీ ఎంఎల్ఎ పుట్ట మధు, రామగుండం మాజీ ఎంఎల్ఎ కోరుకంటి చందర్, మానకొండూరు మాజీ ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఎ సతీష్ బాబు తదితర నేతలు పూర్తిగా దూకుడు తగ్గించారు. గెలిచిన ఎంఎల్ఎలు మాత్రం అప్పుడప్పడు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నామంటే ఉన్నాం అనిపించుకుంటున్నారు.

సైలెంట్ అయిన మాజీ మంత్రి గంగుల కమలాకర్

త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మాత్రం అందుకు తగ్గట్టుగా సమావేశాలు జరగడం లేదు. క్యాడర్ను ఏ మాత్రం సమయత్తం చేయడం లేదు. మెజారిటీ నేతలు అంతా హైదరాబాద్లో ఉంటున్నారు. పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే మాత్రం నియోజకవర్గాలకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించి వెళ్తున్నారు. ఎప్పుడు దూకుడుగా ఉండే మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా సైలెంట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సమయం చూసి దూకుడు పెంచుతారంట

గతంలో తరచూ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు.. ఇప్పుడు ఆరు నెలల నుంచీ ఒక్క సమావేశం కూడా నిర్వహించ లేదు. ప్రధాన పార్టీ బీఆర్ఎస్ సైలెంట్గా ఉండటంతో.. కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఆ జిల్లాలో బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అయితే తాము సమయం చూసి దూకుడు పెంచుతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్‌కి గుణపాఠం చెబుతామని క్యాడర్‌కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంట.

Also Read: కొత్త పార్టీల్లో ఒంటరి పోరాటం

అదేమంటే ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంస్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదని అంటున్నారంట. మరి గులాబీ నేతలు యాక్టివ్ అయ్యేది ఎప్పుడో కాని అప్పటికి ఆ పార్టీ క్యాడర్ చెల్లచెదురు అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ పగ్గాలు చేజారక మౌనముద్ర దాలుస్తుండటం .. కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమవ్వడం, తమ నేతలు అడ్రస్ లేకుండా పోవడంతో జిల్లా పార్టీ శ్రేణులు ఏ చిన్న పని వచ్చినా దిక్కులు చూడాల్సి వస్తోందంట.

Related News

Mahesh Kumar Goud: తెలంగాణలో దొంగ ఓట్లు.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్!

Telangana Govt: వినాయక చవితి పండుగకు.. తెలంగాణ ప్రభుత్వ సూపర్ గిఫ్ట్.. మీకు తెలుసా!

Shamshabad Airport: సాంకేతిక లోపంతో విమానం రన్‌వేపై చక్కర్లు.. 37 మంది ఆందోళన

Rain Alert: బ్రేక్ ఇచ్చిన రెయిన్.. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు..

Ganesha lorry stuck: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..

CM Progress Report: యూరియా కొరతకు చెక్..! సీఎం ప్లాన్ ఏంటంటే..?

Big Stories

×