Gundeninda GudiGantalu Today episode july 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుని రెచ్చగొట్టి గొడవ జరిగేలా చేసి శృతిని తన ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా బాలు మాత్రం తెలివిగా తప్పించుకున్నాడు.. చివరగా బాలు, సత్యం ను ఎలాగైనా అవమానించాలి భోజనం దగ్గర కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు తినాల్సిన దగ్గర మీరు తింటున్నారా? అని అవమానిస్తే వాడి కోపం వస్తుంది కచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని అనుకుంటారు శోభన సురేంద్ర.. వాళ్ళని కావాలని భోజనానికి పిలుస్తారు. శోభన వాళ్ళ మనుషులు దగ్గరుండి వాళ్ళని భోజనానికి కూర్చోబెడతారు. ఎలాగైనా సరే ఇక్కడ వీళ్ళని దారుణంగా అవమానిస్తే ఆ బాలు గాడికి కోపం వస్తుంది. కచ్చితంగా గొడవకు దిగుతాడు నాలుగు పీకుతాడు అని సురేంద్ర అనుకుంటాడు. బాలు మాత్రం వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు.. ఏదో జరగబోతుంది అని సత్యంతో అంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు భోజనానికి కోసం వెయిట్ చేస్తుంటే వారిని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. చూసిన శోభన, షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలును అడ్డుగా పెట్టుకొని ఫంక్షన్ లో పెద్ద గొడవ చేయించాలని శృతి వాళ్ల అమ్మ శోభ, తండ్రి సురేంద్ర కుట్ర పన్నుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే బాలు మొదటి నుంచే ఫంక్షన్ కు వచ్చిన సమయం నుంచి మౌనంగా ఉంటాడు. ఎవ్వరితో మాట్లాడకుండా, ఎవ్వరు ఏమన్నా సైలెంట్ గా ఉంటానని మీనాకు, తండ్రి సత్యంకు మాట ఇస్తాడు. వాళ్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. శృతి వాళ్ల అమ్మానాన్నలు బాలుపై కుట్ర చేసినా ఏమాత్రం వారి ట్రాప్ లో పడడు. రోహిణి కూడా తన బండారం బయట పడకుండా ఉండాలని బాలును ఇరికించాలని అనుకుంటుంది. కానీ బాలు తెలివిగా తప్పించుకుంటాడు.
ప్రభావతి కుటుంబం వెళ్ళేలోగా ఏదోకటి చేసి శృతిని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచుకోవాలని శోభన అనుకుంటుంది.. అందుకోసం భోజనం దగ్గర గొడవ చెయ్యాలని అనుకుంటుంది. సత్యం ను అవమానించాలని అనుకుంటారు. కానీ బాలు తెలివిగా ప్లాన్ చేస్తాడు. ఇక ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ కాకుండా వాళ్లిద్దరు కలిసి బయటికి వెళ్లి తినేసి వద్దామని అనుకుంటారు. దాంతో శృతి తన మెడలోని పూలదండను తీసి తన బెడ్ రూమ్ లో పెట్టేసి వెళ్తుంది. ఆ పూల దండకు శృతి చైన్ ఉంటుంది. అనుకోకుండా శృతి గదిలోకి వెళ్లిన మీనా పూలదండకు ఉన్న చైన్ ను చూస్తుంది. ఎవరైనా తీసుకుంటాని తానే తీసి దాచి తిరిగి ఇద్దామని అనుకుంటుంది.
అక్కడ పూల దండకు ఉన్న చైన్ ను తీస్తూ ఉంటుంది. అదే సమయంలో శృతి గదిలోకి ఆమె తండ్రి సురేంద్ర వస్తాడు. పూలదండలో ఇరుక్కుపోయిన చైన్ ను మీనా తీస్తుండటాన్ని గమనిస్తాడు.. అక్కడి వచ్చి ఎలాగైనా గొడవ చేయాలని చూస్తున్న అతనికి మీనా వల్ల అవకాశం దక్కింది. ఇక వెంటనే మీనాను ఏం చేస్తున్నావని అడుగుతాడు. పూలదండలో చైన్ ఇరుక్కుపోయిందని, తీస్తున్నానని చెబుతుంది. కానీ శోభన కూడా భర్తకు సపోర్ట్ గా మాట్లాడి రచ్చ చేస్తుంది. మీనా ఏడుస్తూ కనిపించడంతో బాలు చిర్రెత్తిపోతాడు. తన భార్యపై దొంగతనం నిందారోపణ చేస్తారా అని మండిపడుతాడు.
Also Read: వివాదంలో ” వీరమల్లు “.. రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్
మీనా మంచి అమ్మాయని, తనకున్న బంగారాన్నే ఇంట్లో పెట్టేసిందని, తనకు అలాంటి బుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ శృతి వాళ్ల నాన్న సురేంద్ర సత్యంపై మాటలు జారుతూనే ఉంటాడు. అంతే కాకుండా మీనాను కూడా దొంగ దొంగ అంటూ అవమానిస్తారు. ఇక మీనా గురించి తెలుసుకున్న తర్వాత కూడా బాలుపైనే ఫైర్ అవుతుంది. అందరు ఇంటికి వెళ్తారు.. శృతి రానని అంటుంది. రవిని వదిలేసి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి బాలుకు షాక్ ఇస్తుంది.. బాలు ఇంట్లోంచి వెళ్లిపోతాడా? లేదా?అన్నది చూడాలి.