Shreyas Iyer Captaincy : టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను టీమ్ లో ఉంటే అది ఓ లక్ అని అంటుంటారు. ముఖ్యంగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించి ఫైనల్ కి చేర్చాడు. అలాగే గత ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా వ్యవహరించి ఆ జట్టు కి ట్రోఫీ ని అందించాడు. అలాగే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ను కూడా ఫైనల్ కి చేర్చాడు శ్రేయస్ అయ్యర్. జూన్ 03న ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడిన పంజాబ్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే వారం రోజుల వ్యవధిలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మరొక జట్టును ఫైనల్ కి చేర్చడం గొప్ప విషయం. ముంబై టీ-20 లీగ్ లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టుకి శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. నమో బాంద్రా బ్లాస్టర్ జట్టు పై విజయం సాధించడంతో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది.
రేపు జరగబోయే ఫైనల్ లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ తో అయ్యర్ సేన తలపడనుంది. ఐపీఎల్ లో ఫైనల్ కి వెళ్లి విజయం సాధింస్తుందనుకున్న శ్రేయస్ సేన చివరిలో తడబడి టైటిల్ ని చేజార్చుకుంది. ఇక సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు కూడా ఫైనల్ కి చేరుకుంది. ఈ జట్టు కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే సాధించడం విశేషం. కీలక మ్యాచ్ లో శ్రేయస్ పరుగులు చేస్తే.. ఆ జట్టు తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇటీవల ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ పై శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అలాగే ఫైనల్ లో శ్రేయస్ చేతులెత్తేయడంతో ఆ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయినప్పటికీ అంతా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవకపోయినా కానీ అభిమానుల మనస్సులు గెలుచుకుంది.
మరోవైపు ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2025లో ఆ జట్టు అన్ని మ్యాచ్ ల్లో కలిపి 3,140 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఒక సీజన్ లో ఒక జట్టు అత్యధిక పరుగులు ఇవే. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ 2023లో 3,054, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3,052 ఉన్నాయి. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు 8 సార్లు 200 కి పైగా స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ జట్టు టాపార్డర్ దుమ్ము రేపడంతో భారీ స్కోర్లు చేసింది. దీనికి తోడు కెప్టెన్ శ్రేయస్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రేపు జరుగబోయే ముంబై టీ-20 లీగ్ ఫైనల్ లో శ్రేయస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్ లో విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.