Intinti Ramayanam Today Episode june 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి, శ్రీయాలు అవని జన్మలో ఇంటికి రాదని ఫిక్స్ అవుతారు. ఇక నగల కోసం కొట్టుకుంటారు.. ఇదంతా కాదు మనిద్దరం సగం, సగం పంచుకుందామని చెబుతారు. నగలను పంచుకుంటారు. ఇంట్లోకి రాగానే అవని నగలను శ్రీయ పల్లవి పంచుకుంటారు.. అది వినగానే శ్రీకర్, కమల్ ఇద్దరూ షాక్ అవుతారు.. కమల్ మా వదిన కూడా వస్తుంది. కాళ్లు చెయ్యి ఒకరు పంచుకోండి సరిపోతుంది అని అంటాడు. అవని అక్క ఇప్పట్లో మీ ఇంటికి వచ్చేలా లేదు అందుకే నగలను మేము వేసుకోవాలి అనుకున్నం అందులో తప్పేముంది అని పల్లవి అంటుంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఊడవలేదు.. కిచెన్లో గిన్నెలు కిచెన్ లోనే ఉన్నాయి. ఎక్కడివి అక్కడే ఉన్నాయి అవి పట్టించుకోకుండా మీరిద్దరూ నగలను పంచుకుంటున్నారు. అమ్మ వదిన ఉన్నప్పుడు ఇంట్లో దేవుడి గదిలో ఎప్పుడు దీపం వెలిగేది. ఇక చక్రధర్ ను పల్లవి కలిసి మాట్లాడిన మాటలు శ్రీకర్ కు మెంటలెక్కిస్తాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వాళ్ళ నాన్న చక్రధరి ఇంటికి వెళ్లడం చూసిన శ్రీకర్ అక్కడికి వచ్చి కిటికీలో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటారు.. శ్రీకర్ రాకముందు ఆ ఇంటిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని మాట్లాడిన పల్లవి శ్రీకర్ వింటుండడం చూసి ప్లేట్ ఫిరాయించి కుటుంబం కోసం బాధపడుతున్నట్లు మాట్లాడుతుంది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. చక్రధర్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసి శ్రీకర్ మా వాళ్ల గురించి పాజిటివ్ గా పల్లవి మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. అక్షయ్, పార్వతి, భానుమతిలు గుడికి చేరుతారు..
గుడికి వచ్చిన అవని తన కుటుంబ సభ్యులు ఇలా చెల్లాచెదురుగా అయిపోవడం చూసి దేవుడితో బాధపడుతూ మొరపెట్టుకుంటుంది. ఇకమీదటైనా అక్షయ్ తప్పు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని దండం పెట్టుకుంటుంది. అప్పుడే గుడిలో ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఎలా అయిపోయారు అని బాధపడుతుంది. అయితే అవని వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే దర్శనం అయిపోయిందమ్మా అనేసి ఒక అతను వచ్చి అడుగుతాడు. ఆయన చూడగానే వాళ్ళు మా వాళ్ళని మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా అది వాళ్ళకి ఇస్తారా అని అవని అతనికి చెప్తుంది.
అవినీ చెప్పినట్లే అతను వెళ్లి అక్షయ వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు ముందుగా నమ్మకపోయినా ఒక సరే.. ఇల్లు ఉంది అనగానే అతనితో వెళ్ళిపోతారు. అయితే ఆ ఇంటిని చూడగానే అవని వాళ్ళు ఇంటి ఎదురుగా ఉండాలా మేము ఇక్కడ ఉండము అని పార్వతి అక్షయ అంటారు. వాళ్ళ మాట విన్న ఇంటి ఓనరు అదేంటమ్మా ఇల్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మీరు ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతాడు.. ఇంటి ఎదురుగా అవని ఉంది మేం అందుకే వద్దు అని అనుకుంటున్నామని అంటారు. భానుమతి మాత్రం అవని ఇంట్లో ఉండట్లేదు కదరా..
మన ఇంట్లో మనం ఉంటున్నాం కదా ఇక నా ఓపిక లేదు. మీరైతే ఎక్కడైనా తిరుగుతారు. పొద్దున ఆకలితో గుడిలో ప్రసాదం తిని సర్దుకున్నాం.. భానుమతి మాట విని అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఇక పార్వతి భానుమతి మాట కాదనలేక ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. అందరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. అద్దె వంటివి మళ్లీ తర్వాత చూసుకుందాంలే అనేసి అక్షయ్ తో ఇంటి ఓనరు అంటాడు. ఇక ఆ ఓనరు అవని దగ్గరకు వెళ్లి వాళ్ళని ఇంట్లోకి దించేసానని మొత్తానికి చెప్పేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ ఇంటికి రాజేంద్రప్రసాద్ అవని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..