Film industry:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కాస్త సమయం లేదా ఏదైనా సందర్భం దొరికిందంటే చాలు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అందులో భాగంగానే తమ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మదర్స్ డే కూడా రాబోతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా తమ తల్లిదండ్రులతో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ కూడా తన చిన్నప్పటి ఫోటోని అభిమానులతో పంచుకుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఆ అమ్మాయి.. తన తండ్రి చేతుల్లో ఒదిగిపోయింది. ఈ ఫోటో చూడడానికి ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ పాపాయి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది అంటే ఎవరైనా నమ్మగలరా..? మరి ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?
తన తండ్రి చేతుల్లో అపురూపమైన అందాల బొమ్మగా ఒదిగిపోయిన ఆ చిన్నారి.. ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Pandey). ఇక ఈమె ఎవరి కూతురో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో చుంకీ పాండే (Chunky Pandey)- భావన పాండే (Bhavana Pandey)దంపతుల కూతురు. 1998 అక్టోబర్ 30 ముంబై మహారాష్ట్రలో జన్మించింది.
ఈమె తాత హార్ట్ సర్జన్ శరత్ పాండే (Sarath Pandey). ఈయన ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ సేథ్ గోర్ధందాస్ సుందర్ దాస్ మెడికల్ కాలేజీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చేసిన సర్జన్ ల బృందంలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు భారతదేశంలో రక్తరహిత ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడంలో కూడా మొదటి తరం వ్యక్తి కావడం గమనార్హం.
వరుస సినిమాలతో స్టార్ స్టేటస్..
ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనన్య పాండే.. తొలిసారి 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ‘ పతి పత్నీ ఔర్ ఓ’ అనే సినిమాలో కూడా నటించింది. ఇక తర్వత బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో కూడా ఈమె చేరిపోయింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె మరో రెండు బడా ప్రాజెక్టులలో బిజీగా ఉండడం గమనార్హం. ఇలా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె.. తెలుగులో మాత్రం డిజాస్టర్ గానే నిలిచింది.
పూరీ జగన్నాథ్ (Puri Jagannath), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ లైగర్’ లో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గానే కాకుండా బుల్లితెర షోలలో కూడా పాల్గొనింది. అంతేకాదు ఒక మ్యూజిక్ వీడియో లో కూడా పాటిస్పేట్ చేసింది. ఇంక తన నటనతో పలు రకాల అవార్డులు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాతన తండ్రి ఒడిలో ఉన్న ఆ పాపాయి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Bollywood: 12 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సౌత్ స్టార్.. ఈసారైనా గట్టెక్కేనా?