E-Paper

రత్నశాస్త్రం.. ఎంత కష్టపడి పనిచేసినా విజయం లభించడం లేదా? ఈ రత్నాలు ధరిస్తే అదృష్టం పట్టినట్లే

రత్నశాస్త్రం.. ఎంత కష్టపడి పనిచేసినా విజయం లభించడం లేదా? ఈ రత్నాలు ధరిస్తే అదృష్టం పట్టినట్లే
Advertisement

కష్టపడి పనిచేసినా చాలా మందికి ఆశించిన ఫలితాలు దక్కవు. ఎన్నో ప్రయత్నాలు చేసినా విజయానికి అడ్డంకులు ఎదురవుతుంటాయి. రత్నశాస్త్రం జ్యోతిష్యం ప్రకారం కొన్ని రత్నాలు గ్రహాల శక్తిని బలపరచి ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, కెరీర్ అభివృద్ధికి సహాయపడతాయని నమ్ముతారు.

రూబీ, గోమేధికం, నీలం రత్నాలు ఈ కోవలో అత్యంత ప్రసిద్ధమైనవిగా భావిస్తారు. అయితే వీటిని ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిని ధరించే సరైన పద్థతులు తెలుసుకోవాలి.

సూర్యుడి అనుగ్రహం కోసం రూబీ

Advertisement

రూబీ సూర్యగ్రహానికి సంబంధించిన రత్నంగా పరిగణించబడుతుంది. ఇది ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుందని నమ్మకం.
తమపై నమ్మకం తక్కువగా ఉన్నవారికి ఈ రత్నం ఉపయోగకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ప్రభుత్వ పనుల్లో అడ్డంకులు ఎదుర్కొనే వారికి కూడా దీన్ని సూచిస్తారు.
రూబీ ధరించడం వల్ల గౌరవం, గుర్తింపు, నాయకత్వ అవకాశాలు పెరుగుతాయని నమ్మకం.

రూబీ ధరించే విధానం

రూబీని బంగారు ఉంగరంలో పెట్టి కుడి చేతి ఉంగర వేళ్లకు ధరించాలి. ఆదివారం సూర్యోదయం సమయంలో ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ధరించే సమయంలో ఆ సూర్య భగవానుడిని స్తుతించాలి. ‘ఓం ఘృణి సూర్యాయ నమః’ మంత్రాన్ని జపించాలి.

రాహు ప్రభావాన్ని సమతుల్యం చేసే గోమేధిక రత్నం

Advertisement

గోమేధికం రాహు గ్రహానికి సంబంధించిన రత్నం. రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నం అయోమయం, అనిశ్చితి, అకస్మాత్తుగా ఎదురయ్యే నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఎదుర్కొనే వారికి కూడా ఈ రత్నాన్ని సూచిస్తారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోతే గోమేధికం ధరించడం మంచిదని చెబుతారు.

గోమేధికం ధరించే విధానం

గోమేధిక రత్నాన్ని వెండి లేదా పంచలోహంలో అమర్చాలి. మధ్యవేళ్లకు ధరించడం ఉత్తమం. బుధవారం లేదా శనివారం మధ్యాహ్న సమయంలో ధరించవచ్చు. ధరించే ముందు రాహుని స్తుతించాలి. ‘ఓం రాం రాహవే నమః’ మంత్రాన్ని జపించాలి.

శని గ్రహానికి చెందిన శక్తివంతమైన రత్నం నీలం

నీలం శని గ్రహానికి సంబంధించిన అత్యంత ప్రభావవంతమైన రత్నంగా భావిస్తారు. ఇది క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తుందని విశ్వాసం. కెరీర్‌లో స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి కోరుకునే వారు దీన్ని ధరించడానికి ఆసక్తి చూపుతారు. అయితే నీలం ప్రభావం బలంగా ఉంటుందని భావించి జాగ్రత్తగా ధరించాలని నిపుణులు సూచిస్తారు.

నీలం ధరించే విధానం

నీలాన్ని వెండి, ఇనుము లేదా పంచలోహంలో అమర్చాలి. శనివారం సాయంత్రం మధ్యవేళ్లకు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
ముందుగా కొన్ని రోజులు లాకెట్ రూపంలో ధరించి ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని నిర్ధారించుకోవాలి. తరువాత ఉంగరం రూపంలో ధరించవచ్చు.

రత్నాలు ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

రత్నాలను ఎప్పుడూ అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల సలహాతోనే ధరించాలి. అసలైన రత్నాలను మాత్రమే ఉపయోగించాలి.
ధరించే ముందు పవిత్ర జలంతో శుద్ధి చేయడం, మంత్ర జపం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. రత్నాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం కూడా మంచిది.

Also Read: జీడిపప్పు, బాదం అతితక్కువ ధరలో కావాలా? దేశంలోని ఈ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్ హోల్‌సేల్ మార్కెట్లు

విజయానికి అసలైన రహస్యం ఇది

రత్నాలు వ్యక్తి నమ్మకాన్ని బట్టి మానసికంగా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కానీ అవి కష్టపడి పనిచేసే మనస్తత్వానికి ప్రత్యామ్నం కావు.
నిజాయితీ, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిరంతర ప్రయత్నమే విజయానికి ప్రధాన కారణాలు. రత్నాలను సహాయక సాధనాలుగా మాత్రమే చూడాలి.

గమనిక: ఈ సమాచారం సంప్రదాయ రత్నశాస్త్ర నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. శాస్త్రీయ ఆధారాలు దీన్ని పూర్తిగా నిర్ధారించవు. రత్నాలు ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

ఆత్మీయులు దూరమైనందుకు బాధపడుతున్నారా? మనోధైర్యం నింపే భగవద్గీత బోధనలు మీ కసమే

రోజంతా ఆఫీసులో అలసటగా ఉందా? పనిచేస్తూ ఈ ప్రొటీన్ స్నాక్స్ తింటే గంటల తరబడి ఫుల్ ఎనర్జీ

ఇంట్లో లక్ష్మీదేవి రూపం ఆడబిడ్డ.. పాపకు 3 అక్షరాల అర్థవంతంమైన, సులభంగా పలికే పేర్లు ఇవిగో

ఫ్రిజ్‌లో పెట్టినా పచ్చిమిర్చి చెడిపోతోందా? ఈ చిట్కా పాటిస్తే వారాల తరబడి బాగుంటుంది

ఇంట్లో సంపద, శుభం కోసం మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ మూడు మొక్కలు దాని కంటే బెటర్

స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తుందా? గుండె డాక్టర్ చెప్పిన సమాధానమిదే

చుండ్రు కారణంగా ఎప్పుడూ తలలో దురదగా ఉందా? ఇంట్లో తయారు చేసే హెయిర్ మాస్క్ ట్రై చేశారా?

×