Intinti Ramayanam Today Episode june 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన వాళ్లను గుడిలో చూడలేని అవని ఓ ఇంట్లో పెట్టాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే అవని తన వాళ్లను ఇంట్లోకి చేరుస్తుంది.. అయితే అవని రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు.. అయితే భానుమతి రాజేంద్రప్రసాదను చూసి ఎమోషనల్ అవుతుంది.. అరే రాజేంద్ర చూడ్డానికి వచ్చావా రా? చూసావా రా అమ్మ పరిస్థితి ఎలా మారిందో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు కన్న తల్లివి కాబట్టి ఆ బాధను చూడలేక కొడుకుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. కానీ నీ కోడలు మొగుడు వచ్చాడు అని కూడా చూడట్లేదు ఏంటమ్మా ఇది అని అంటాడు. పార్వతి పెళ్ళాం పిల్లలు అవసరం లేదని కోడలే ముఖ్యమని వెళ్లిన వారితో ఎలా మాట్లాడాలో చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. మేము ఈ పరిస్థితికి రావడానికి ఆవిడ గారు అన్న సంగతి ఆయన ఇంకా గుర్తించలేదు అని రాజేంద్రప్రసాద్ తో పార్వతి ఇండైరెక్టుగా అంటుంది. మొత్తానికి మాత్రం కుటుంబం అంతా ఒకే చోట చేరారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్ కమల్ ఇద్దరూ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు కదా అని మాట్లాడుకుంటూ వెతుకుతారు. టిఫిన్ తీసుకెళ్లా అవనీని అక్షయ్ పార్వతి దారుణంగా మాటలతో అవమానిస్తారు. భానుమతి మాత్రం టిఫిన్ కోసం అవనికి సపోర్ట్ చేస్తుంది.. కానీ ఆ ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయకుండా అవన్నీ తెచ్చిన టిఫిన్ ని వెనక్కి పంపిస్తారు. అది చూసిన రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. అవని ఏడిపించిన వాళ్లని నేను కూడా ఏడిపించాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు. అయితే బయటకు వెళ్లి ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడినట్లు భానుమతితో మాట్లాడుతాడు.
ఇక భానుమతిని పార్వతిని అక్షయ్ ని రాజేంద్రప్రసాద్ ఒక ఆట ఆడుకుంటాడు. ఎవరు తెలియని వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతాడు. పార్వతి ఏమాత్రం తగ్గకుండా రాజేంద్రప్రసాద్ కు చురకలాంటిస్తుంది. వీరిద్దరి మాట మాట పెరిగి ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది.. ఇక రాజేంద్రప్రసాద్ ని ప్రణతి బలవంతంగా లోపలికి తీసుకొని వెళుతుంది. అయితే కమల్ శ్రీకర్ అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడే ఉన్నా పార్వతి వాళ్ళని చూసి షాక్ అవుతారు. మేము ఇక్కడ ఉన్నాం అన్న విషయం మీకు మీ వదిన చెప్పిందా అని పార్వతి అడుగుతుంది.
మేము మీరు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ వచ్చాము వదిన దగ్గర ఈ విషయం చెప్పాలని వచ్చాము మిమ్మల్ని ఇక్కడ చూసి షాక్ అయ్యాము అని అంటారు. మీరు ఇక్కడ ఉన్నారు కదా మాకు చాలా సంతోషంగా ఉంది. పదండి మన ఇంటికి అని ఎంత చెప్పినా కూడా పార్వతి అక్షయ ఇద్దరు వాళ్ళపై సీరియస్ అవుతారు. ఇంకా ప్రణతి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అవని దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని అడిగితే రాజేంద్రప్రసాద్ వాళ్లకే తెలియకుండా మీ వదిన వాళ్ళని ఇక్కడ పెట్టింది అని అంటాడు.
Also Read: మౌనికకు సువర్ణ మరో ఛాన్స్.. రోహిణికి వరుస షాక్ లు.. ప్రభావతికి వార్నింగ్..
ఇది పక్కన పెడితే ఫస్ట్ ఆస్తిని మొత్తం పోగొట్టుకునేలా చేయడానికి వెనుక ఎవరో కుట్ర చేశారని అర్థమవుతుంది అది ఎవరో కనిపెట్టాలి అని శ్రీకర్ కమల్ అనుకుంటారు. కమల్ మాత్రం వాళ్ళు ఎవరో దొరకాలి పోలీస్ స్టేషన్లో కేసులు కాదు డైరెక్ట్ బొందల గడ్డకే అని సీరియస్ అవుతాడు. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిదని అవని అంటుంది. అయితే ఆరాధ్య మన నానమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చినందుకు బాధపడ్డాను కానీ నేను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామని అంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినా ఆరాధ్య వాళ్ళ కోసం భోజనం తీసుకుని వస్తుంది.. అయితే మీ అమ్మ పంపిందా అని ఆరాధన వాళ్ళ అన్న కూడా నాకు వంట చేయడం రాదు కదా అమ్మే చేసింది మీరు తింటేనే నేను మీతో మాట్లాడతాను అని ఆరాధ్య అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..