Jagan’s Palnadu Tour: వైసీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు జగన్ నానాతంటాలు తడుతున్నారా? టూర్ల పేరిట యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? జగన్ టూర్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలకు రెడీ అవుతోంది? ఈ లెక్కన పల్నాడు టూరులో రెచ్చిపోయిన యువత, నాయకులపై కేసులు నమోదు కావడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జగన్ పల్నాడు టూర్‌పై ఆ జిల్లా పోలీసులు దృష్టి సారించారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన యువత, నాయకులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా అవేమీ పట్టించుకోకుండా యువతను నేతలు రెచ్చగొట్టినట్టు భావిస్తున్నారు.
ఇదిలా కంటిన్యూ అయితే లేనిపోని సమస్యలు మొదలు అవుతాయని భావిస్తున్నారు. ఆదిలో ఆపకుంటే ప్రతీ టూర్లలో ఇలాంటి సమస్యలు రెట్టింపు అవుతాయని అంటున్నారు. వైసీపీ మద్దతుదారుల అత్యుత్సాహం, బైక్ ర్యాలీ నిర్వహించడం, అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శన చేశారు. అంతేకాదు అడుగడుగునా పోలీసు నిబంధనలను బేఖాతరు చేశారు.
జగన్ పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చామని అన్నారు. టూర్ మొదలు పెట్టిన నుంచి ముగిసే వరకు అన్ని నిబంధనలను అధిగమించి కార్యక్రమం జరిగిందన్నారు. పోలీసులు, ప్రజాప్రతినిధులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు పండగే.. ఏ మాత్రం ఆలస్యం కాకుండా
ట్రాఫిక్ సమస్యలతోపాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ టూర్ లో వైసీపీ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘనపై న్యాయ సలహాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన టూర్‌లో పాల్గొన్న యువతలో టెన్షన్ మొదలైంది. ఒకవేళ పోలీసులు కేసులు నమోదు చేస్తే తమ జీవితాలు నాశనం అయినట్టేనని భావిస్తున్నారు.
జగన్ పల్నాడు టూర్‌పై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. ప్రజల్లోకి వెళ్లి యువతను వైసీపీ రెచ్చగొడుతున్నట్లు భావిస్తోంది. కేసులు నమోదయితే యువత జీవితం నాశనం అవుతుందని ఆలోచన చేస్తోంది. హుందాగా వ్యవహరించాల్సిన జగన్, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టింది. కేవలం తన రాజకీయం కోసం యువతను బలి పశువు చేస్తున్నారని భావిస్తోంది.
కేసులు నమోదు చేయకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బంది తయారు అయ్యే పరిస్థితి రావచ్చని అభిప్రాయపడుతోంది. తాము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని జగన్ పదేపదే చెబుతున్నారని, ఆ మాటలు ఆయనకే తగులుతాయని అంటున్నారు.
పల్నాడు వ్యవహారంపై హోంమంత్రి అనిత రియాక్ట్ అయ్యారు. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్లిన జగన్, ఇద్దరు మృతి చెందితే కనీసం పరామర్శించిన సందర్భం లేదన్నారు. బెట్టింగులో ప్రాణం పోయిన వ్యక్తి విగ్రహం ప్రతిష్టాపనకు మాజీ సీఎం వెళ్లడం బహుశా చరిత్రలో ఎక్కడా ఉందని అంటున్నారు. దీనివల్ల జగన్ మానసిక పరిస్థితి ఎంటో తెలుస్తుందన్నారు. ఏదోవిధంగా శాంతిభద్రతలను విఘాతం కలిగించాలని చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు..
జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై సత్తెనపల్లి పీఎస్ లో కేసు నమోదు
పోలీసులపై అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు
188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు https://t.co/C6D5ELLhNV
— BIG TV Breaking News (@bigtvtelugu) June 19, 2025
బెట్టింగ్ కింగ్ గా పేరున్న వ్యక్తి విగ్రహాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి ఆవిష్కరించాడు అంటే, అతని మైండ్ సెట్ ఎలాంటిదో అర్ధమవుతుంది.#BloodOnYourHandsJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/5rLyuaIi9C
— Telugu Desam Party (@JaiTDP) June 18, 2025