CM Chandrababu: ఏపీని క్వాంటమ్ వ్యాలీకి హబ్‌గా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. సోమవారం వర్కషాప్ నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీ ప్రతినిధులు రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులను ఉండవల్లిలోని తన నివాసంలో వారికి విందు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
విజయవాడలో సోమవారం అమరావతి క్వాంటమ్ వ్యాలీపై నేషనల్ వర్క్ షాప్ జరగనుంది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి దేశంలో తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ పార్క్ నిర్వహించనున్నారు. వర్కషాపులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో వారికి ఆదివారం రాత్రి విందు ఇచ్చారు.
సీఎం చంద్రబాబు ఇచ్చిన డిన్నర్‌లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్ ఉన్నారు. ఎల్ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ ఉన్నారు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ లతోపాటు భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లాతోపాటు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి హాజరయ్యారు.
ALSO READ: కింగ్ ఫిషర్ బీరు ఒక్కటి రూ. 30 మాత్రమే
వీరితోపాటు ఫార్మాకు చెందిన రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ హాజరయ్యారు. ఏపీలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఇప్పటివరకు కంప్యూటర్ సిస్టమ్ ప్రొగ్రామింగ్ అంతా మేథమెటిక్స్‌పై ఆధారపడి ఉండేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల కలయికతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ కాంతి వేగంతో పోటీ పడుతోంది. కోట్లలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సమాచారం కోరితే క్షణాల్లో ఇచ్చేది క్వాంటమ్ కంప్యూటింగ్.
చంద్రబాబు సర్కార్ ప్లాన్ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్కు నుంచి పని చేయనుంది. కేవలం ఏపీకి పరిమితం కాకుండా పలు రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రభుత్వరంగ సంస్థలు ఈ క్వాంటమ్‌ను ఉపయోగించుకునే వీలుంది. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, మేధావులు, ప్రభుత్వరంగానికి అధికారులు, విద్యార్థులు ఈ వర్క్‌షాపులో పాల్గొంటారు. క్వాంటమ్ వ్యాలీపై డిక్లరేషన్‌ను ప్రకటించే అవకాశముంది.
I had the pleasure of hosting global tech and industry leaders for a heartfelt exchange of ideas ahead of the Amaravati Quantum Valley Workshop over dinner today.
We welcome all the visionaries to join Andhra Pradesh in leading India’s quantum revolution through innovative… pic.twitter.com/1ITJ3JHVGa
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2025