BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్..శోభన, ప్రభావతి డిష్యుం..డిష్యుం.. బాలు ఇరుక్కుంటాడా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్..శోభన, ప్రభావతి డిష్యుం..డిష్యుం.. బాలు ఇరుక్కుంటాడా..?

Gundeninda GudiGantalu Today episode june 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి విజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు. మా అత్తయ్య ఈమధ్య నా మీద ప్రేమను పూర్తిగా తగ్గించేసింది. మా నాన్నని తీసుకురావాలని తెగేసి చెప్పేసింది అని అంటుంది.. అప్పుడే ప్రభావతి డోర్ కొడుతుంది.. అత్తగారింటి తరపున నీకు పెట్టాల్సిన చీరను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకొని రోహిణి చేతికి ఇస్తుంది.. రోహిణి ఆ చీర తీసుకోగానే మీ నాన్న ఎక్కడ వరకు వచ్చాడు. అసలు వస్తున్నాడా లేదా అప్పుడెప్పుడో ఫ్లైట్ ఎక్కాడు అని అడిగావు కదా వెంటనే నువ్వు ఫోన్ చేసి అడుగు ఎక్కడున్నాడు అని అడుగుతుంది.. ఫ్లైట్లో ఉన్నాడు అత్తయ్య ఫోన్ పనిచేయదు కదా.. నాట్ రిచబుల్ వస్తుందనేసి అంటుంది. ఈసారి మాత్రం మీ నాన్న రావాల్సిందే అని ప్రభావతి తేల్చి చెప్పేస్తుంది..


ఇలా ఎప్పుడు మీ నాన్నని అడిగినా అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. పెళ్లి టైంలో అలానే వస్తున్నాడు అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు వస్తున్నాడు అని అంటున్నావ్ తప్ప అసలు వస్తాడో రాడో తెలియట్లేదు. కూతురు కన్నా బిజినెస్ లు ఎక్కువ అనేసి ప్రభావతి అడుగుతుంది. పెళ్లెప్పుడు ఎలాగో రాలేదు కనీసం ఇది చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఇప్పుడు రాకుండా ఉంటే నేనేం చేస్తానో నాకు తెలియదని ప్రభావతి అంటుంది.. ఆ మాటకు రోహిణి భయపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతిని రెడీ చేస్తూ తన ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు మళ్లీ ఎప్పుడు రెడీ అవుతావు శ్రీమంతా నీకే కదా వేసుకోవే అని నగల గురించి మాట్లాడతారు. శృతి దగ్గరికి రవి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రవిని ఆటపట్టిస్తారు.. మెడ నుండి నగలు వేసుకున్నావు కదా నిన్ను ఎవరైనా ఎత్తకపోతే రేమో అని రవి కూడా సరదాగా అంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శోభాను చూసి రవి షాక్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శోభన అక్కడికి రాగానే శృతి చాలా బాగున్నావు నీ పెళ్లి కోసం చేయించిన నగలలో నువ్వు నిండుగా ఉన్నావు అని అంటుంది.


రోహిణి చూసి విద్య నువ్వు చాలా అందంగా ఉన్నావే అని మురిసిపోతుంది. ఈ చీర నీకు బాగా సెట్ అయింది చాలా ముద్దొస్తున్నావు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. నువ్వు అచ్చం పెళ్లికూతురు లాగా ఉన్నావ్ అని విజ్జి అనగానే రోహిణి ఉన్న పెళ్లే పెటాకులు ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మా నాన్న రాకపోతే కచ్చితంగా మా అత్త ఏదో ఒకటి చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు సెట్ చేసిన అతను ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. విజ్జి ఆ వ్యక్తికి ఫోన్ చేసి త్వరగా రమ్మని అంటుంది. వీడు గనక సరిగ్గా చేయకపోతే నేను అడ్డంగా దొరికిపోతాను అని టెన్షన్ పడుతుంది రోహిణి..

బాలు ఒక ఆవిడతో మాట్లాడలేదని ఒక ఆవిడతో మాట్లాడలేదని ఓ వ్యక్తి వచ్చి బాలుని తిడుతూ ఉంటాడు.. మీనా ఆయన ఈరోజు మౌనవ్రతం అండి అని అనగానే ఆయన సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత శోభ తాను తెచ్చిన చీరనే శృతి కట్టాలని తన ఫ్రెండ్ తో చెబుతుంది. వాళ్లు తెచ్చిన నాశనం చేరాలని నా కూతురికి ఎందుకు కట్టిస్తాను అని అనడం బాలు వింటాడు. ప్రభావతి చీర తీసుకొని లోపలికి వెళ్తుంటే కామాక్షి అక్కడికి వచ్చి నువ్వు తెచ్చిన చీరని వాళ్ళు కట్టని ఇస్తారా ఎంత పెద్ద ఫంక్షన్ చేస్తూ వాళ్ళు తెచ్చిన చీర కట్టాలని అంటారు అని అంటుంది.

నేను పెద్దగా డబ్బులు పెట్టి చీర తేకపోయినా సాంప్రదాయం ప్రకారం ఈ చీరే శృతి కట్టుకోవాలి కదా నేను చూసుకుంటానులే అని ప్రభావతి లోపలికి వెళ్తుంది.. శోభన శృతి దగ్గరికి చీర దండ తీసుకొని వెళ్లి ఇస్తుంది. శృతి మాత్రం మా అత్తయ్య చీర కొన్నారు కదా అదే కట్టుకోవాలి అంటున్నారు కదా అనే మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి సాంప్రదాయం ప్రకారం నేను తెచ్చిన చీర దండని వేసుకోవాలి అని అంటుంది. కానీ ప్రభావతి మాత్రం వినకుండా.. మేము మీ అంత గొప్పగా తీసుకురాకపోయినా ఉన్నంత బాగానే తీసుకొచ్చాను అని అంటుంది..

Also Read: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. రూ. 600 కోట్ల నష్టం..సెకండాఫ్ పైనే ఆశలు..

ఇద్దరి మధ్య చీర కోసం పెద్ద వారే నడుస్తుంది. శృతి మాత్రం ఇద్దరినీ సమానంగా చూస్తుంది. అత్త తెచ్చిన చీరను కట్టుకొని తల్లిదచ్చిన దండను వేసుకుంటానని చెప్తుంది. అయితే బాలు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరూ గొడవపడి ఈ ఫంక్షన్ ఎక్కడ ఆగిపోతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని సైగలు చేస్తూ సత్యంతో అంటాడు. కానీ సత్యం మాత్రం ఏమీ అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు అక్కడికి వచ్చి నాకు కామాక్షి చీర కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా.. ఏ చీర కట్టుకుంటుందో చూడాలి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. గదిలో నుంచి బయటకు వచ్చిన శృతిని చూసి అందరూ షాక్ అవుతారు. శృతి చాలా తెలివైన అమ్మాయి మావయ్య గారు.. ఇద్దరికీ న్యాయం చేసింది అని మీనా అంటుంది. వీళ్ల దగ్గరికి వచ్చిన ప్రభావతి శృతి చాలా తెలివైన అమ్మాయి తెలుసా నేను తెచ్చిన చీర వాళ్ళ అమ్మ తెచ్చిన దండ వేసుకుంది చూసారా అని పోగుడుతుంది. ఇలాంటి తెలివితేటలు డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలకు మాత్రమే ఉంటాయని మీనాని అవమానిస్తుంది. బాలు అందుకే మా నాన్నని నీతో ఇన్నేళ్లు కాపురం చేస్తున్నారు మా నాన్నకి అవార్డు ఇవ్వాల్సిందే అని సెటైర్ వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలుని ఇరికించేందుకు రోహిణి పెద్ద ప్లాన్ వేస్తుంది. బాలు గొడవకి దిగుతాడా? ప్రభావతి చేతికి రోహిణి దొరుకుతుందా చూడాలి..

Related News

Anchor Sreemukhi: శ్రీముఖి నాకు ద్రోహం చేసింది.. స్టేజ్ మీదే ఆమె ప్రియుడు బ్రేకప్

Jayammu Nischayammuraa: చాలా లీలలున్నాయి.. శ్రీలీల పై కంప్లైంట్ చేసిన జగ్గు భాయ్!

Anasuya: అవే మెయిన్ టార్గెట్ అంటున్న అనసూయ.. భారీగానే సంపాదిస్తోందే!

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నగలతో అడ్డంగా బుక్.. రామరాజు షాకింగ్ నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: మనసు మార్చుకున్న పార్వతి.. పుట్టింట్లో ప్రణతికి ఘోర అవమానం..

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అందరి ముందు కావ్యను కడుపు వచ్చిందన్న స్వరాజ్‌ – అయోమయంలో పడిపోయిన రాజ్‌

Big Stories

×