Intinti Ramayanam Today Episode june 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ పల్లవి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లడంతో అందరూ ఆరా తీస్తారు. మీరిద్దరూ కలిసి వచ్చారేంటి అని పార్వతి అడుగుతుంది. ఈరోజు అవని అక్క చేసిన పనికి నన్ను అందరూ తప్పుగా అనుకునే వాళ్ళు అని పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది. కమల్ శ్రీకర్ ఒకవైపు మా వదిన మంచిదని ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ పార్వతి ఇద్దరూ కూడా వారిని అరుస్తారు.. పల్లవి అవని అక్కని మామయ్య గారు కావాలని బావగారి పక్కన కూర్చోబెట్టారు.. కనీసం ఆఫీసులో ఎటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టే అధికారం కూడా బావగారికి లేకుండా అవనికే ఇచ్చారు అని అంటుంది.. అంతేకాదు బావగారికి అధికారం రాకుండా కంపెనీని లాగేసుకునే ప్రయత్నం ఇది అని పల్లవి చెప్పగానే పార్వతి సీరియస్ అవుతుంది.. పల్లవి మొత్తానికి పార్వతిని రెచ్చగొడుతుంది. లేనిపోనివి కల్పించి చెప్పి అక్షయ్ బావగారికి అధికారం వచ్చేలా చేయాలని చెప్తుంది..
పల్లవి మాటల్ని గుడ్డిగా నమ్మిన పార్వతి అక్షయ్ ని అందర్నీ తీసుకొని ఈ విషయాన్ని ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటానని రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్తారు.. అవని ఇంటికి త్వరగా రావడంతో ప్రణతి ఏమైంది వదిన ఇంత త్వరగా వచ్చారు ఆఫీస్ లో పని లేదా అని అడుగుతుంది. అవని మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న రాజేంద్రప్రసాద్ సుదర్శన్ కంపెనీ అప్డేట్ గురించి అడుగుతాడు. కానీ ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత పార్వతి వాళ్ళు వచ్చి పెద్ద రచ్చ చేసి అక్షయ్ పేరు మీరు మీద ఆస్తులు రాయాలని డిమాండ్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. కంపెనీకి సంబంధించిన పూర్తి అధికారం అక్షయ్కి రావడంతో పల్లవి సంతోషానికి అవధులు ఉండవు. అవిని పీడ వదిలి పోయిందని పల్లవి చాలా సంతోషంగా ఆ విషయాన్ని తన తండ్రితో పంచుకోవాలని వెళుతుంది.. చక్రధర్ దగ్గరికి వెళ్లిన పల్లవి అవని నుంచి మొత్తం అధికారాన్ని అక్షయ్ బావ పేరు మీదకి వచ్చేలాగా చేసాము.. ఇప్పుడు ఆస్తిని మొత్తం అక్షయ్ చేతులారా పోగొట్టేలా చేయాలని అవని ప్లాన్ చేస్తుంది. అక్షయ్ తొందరపాటు వల్లే ఆస్తులన్నీ కోల్పోయామని వాళ్ళకి తెలియాలి మొత్తం అందరూ రోడ్డున పడాలి అని చక్రధర్ పల్లవి ప్లాన్ చేస్తారు.
ఇక ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పిన తర్వాత పల్లవి మళ్లీ తన ఇంటికి వెళ్తుంది. అక్కడే ఉన్న కమల్ పల్లవిని చూసి ఎక్కడికి వెళ్లావు ఏంటి అని ఆరా తీస్తాడు. మొత్తానికి పల్లవి ప్లాన్ చేసి మరి కమల్ నుంచి తప్పించుకుంటుంది. పల్లవి అవనిని ఇక ఇంటి వైపు చూడకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది.
అటు అవనిని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఏంటి ఎవరు సమాధానం చెప్తారు అని అంటాడు.. మీరు ఇలా చేయకపోతే నన్ను ఖచ్చితంగా ఏదో అనుకుంటారు ఇప్పుడు నా మీద మరో నిందల్ని వేస్తారు అని అవని అంటుంది. అవని చెప్పిన సమాధానం విని రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు. ఉదయం లేవగానే అక్షయ్ ఆస్తులన్నీ జప్తు చేసే అవకాశం ఉంది అంటూ ఇంట్లో వాళ్లతో చెప్తూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి కొంతమంది ఆఫీసర్లు వస్తారు.. అవి ప్లాన్ చేసినట్లు ఆఫీసర్లు అక్షయతో ఈ ఆస్తులన్నీ జప్తు చేస్తున్న మీరు తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని చెబుతారు..
పల్లవి ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతుంటుంది. అక్షయ్ మీరేంటి ఆఫీసర్స్ ఎలా వచ్చారు మీతో నేను ఆఫీస్ కొచ్చి మాట్లాడుతాను మీరు వెళ్ళండి అని అంటున్నా కూడా.. సారీ అక్షయ్ గారు కంపెనీ కోసం తీసుకున్న 85 కోట్లు మాకు తిరిగి చెల్లించాలి. మీరు ఇప్పటివరకు చెల్లించలేదు అంటే ఏంటిది మేము చెప్తే చేస్తున్నాం. మీరంతా వెంటనే ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళండి అంటూ షాక్ ఇస్తారు.. అప్పుడే అవని ఎక్స్క్యూజ్మీ ఆఫీసర్స్ అని అక్కడికి వస్తుంది. ఇంటి నమ్మి అధికారం ఎవరికీ లేదు అని చెప్తుంది. ఆ మాట విన్న పల్లవి షాక్ అవుతుంది.. ఆస్తులు గురించి అవని ఆఫీసర్స్ తో ఏదో మాట్లాడుతుంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..