BigTV English

OTT Movie : ప్రెసిడెంట్ చుట్టూ మాన్స్టర్లే… వణుకు పుట్టించే సీన్స్… బుర్ర పాడయ్యే సీన్లు

OTT Movie : ప్రెసిడెంట్ చుట్టూ మాన్స్టర్లే… వణుకు పుట్టించే సీన్స్… బుర్ర పాడయ్యే సీన్లు

OTT Movie : ఏలియన్స్ స్టోరీలతో ఇది వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులు కూడా ఇష్టంగా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలు ఉంటాయి. ఏలియన్స్  విధ్వంసాలు కూడా చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ప్రత్యేకించి ఒక లవ్ స్టోరీ కూడా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఆండ్రూ కాల్డర్ (స్కూట్ మెక్‌నైరీ) ఒక ఫోటో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ప్రస్తుతం మెక్సికోలో ఏలియన్స్ వల్ల కలిగిన విధ్వంసాన్ని ఫోటోలు తీస్తూ జీవిస్తుంటాడు. అతని జీవితం చాలా కష్టాలతో నడుస్తుంది. అతను తన ఆరేళ్ల కొడుకు పుట్టిన రోజును కూడా జరుపుకోలేక పోతున్నాడు. అతని ఉద్యోగంలో కూడా సమస్యలే ఉంటాయి. ఇతని యజమాని విధ్వంసం ఉన్న ఫోటోలు కావాలని ఒత్తిడి చేస్తుంటాడు. అతని యజమాని ఒక పెద్ద ధనవంతుడు. ఇప్పుడు ఏలియన్స్ భూమి మీద దాడులు చేస్తుండటంతో, ఆండ్రూ యజమాని తన కుమార్తె సమంతా వైండెన్ (విట్నీ ఏబుల్) ను అమెరికాకు సురక్షితంగా తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సమంతా ఇప్పుడు తన జీవితం గురించి గందరగోళ పరిస్థితిలో ఉంటుంది. ఆండ్రూ తన యజమాని ఆదేశాల మేరకు సమంతాని సురక్షితంగా తీసుకురావడానికి బయలుదేరుతాడు. సమంతా మొదట్లో ఆండ్రూ అంతగా ఇష్టపడదు. కానీ వీళ్ళు కలిసి ప్రయాణించే తప్పుడు ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరుగుతుంది.


వీళ్ళు సముద్రం ద్వారా బోట్‌లో అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో వాహనాలు ధ్వంసం కావడంతో వీళ్ళ ప్రయాణం కష్టంగా మారుతుంది. ఆండ్రూ, సమంతా ఒక ఖాళీ గ్యాస్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ వీళ్ళు పోలీసులను సంప్రదిస్తారు. పోలీసులు వీళ్ళు ఇంకా బతికి ఉన్నందుకు అదృష్టవంతులని, సహాయం కోసం సమీపంలో ఆర్మీ రెస్క్యూ పెట్రోల్ ఉందని చెబుతారు. ఇద్దరూ అక్కడ తమ కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడతారు. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలోనే ఏలియన్స్ ఆ ప్రాంతం మీద దాడి చేయడానికి వస్తాయి. చివరికి ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తాయా ? సమంతా,ఆండ్రూ లవ్ స్టోరీ ఏమౌతుంది ? ఏలియన్స్ ని వీళ్ళు ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కూతురి బాయ్ ఫ్రెండ్ పై మనసు పడే తల్లి… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా సామీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా పేరు ‘మాన్స్టర్స్’ (Monsters). ఈ సినిమాకు గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఇందులో స్కూట్ మెక్‌నైరీ (ఆండ్రూ కాల్డర్), విట్నీ ఏబుల్ (సమంతా వైండెన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక భవిష్యత్ ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ NASA అంతరిక్ష నౌక ఒకటి మెక్సికోలో కూలిపోతుంది. దీంతో ఏలియన్స్ అమెరికా సరిహద్దు ప్రాంతంలో వ్యాప్తి చెందుతాయి. ఇవి అమెరికన్ ప్రెసిడెంట్ ని కూడా టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యుఎస్ సైన్యాలు యుద్ధం చేయాల్సివస్తుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×