Intinti Ramayanam Today Episode March 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి నావల్ల అందరికి గొడవలు జరుగుతున్నాయి. నేనే లేకుంటే ఇలాంటివి జరగవు అని ప్రణతి ఆలోచిస్తుంది. ఇంట్లోంచి బయటికి వెళ్లాలని ప్రణతి ఆలోచిస్తుంది అప్పుడే అవని చూస్తుంది. నీకేమైనా సాయం చేయనా బయటికి వెళ్లాలనుకుంటున్నావా అనేసి అడుగుతుంది. నేను ఇక్కడ ఉంటే అందరికీ గొడవలు జరుగుతున్నాయి వదిన నేను లేకున్నా ఉంటేనే ఈ సమస్యలన్నింటికీ దూరం అయిపోతాయని అంటుంది ప్రణతి. నువ్వు ఇలాంటి వాటికి దూరంగా వెళ్తే సమస్యలు తగ్గిపోతాయని అనుకుంటున్నావు నీ సమస్యలతో పోలిస్తే నా సమస్యలు ఎన్ని ఉన్నాయో చూసావు కదా.. ఈ సమస్యలన్నీ తీరాలంటే నీకన్నా ముందు నేను చచ్చిపోవాలి మరి నేను చచ్చిపోయానా చచ్చిపోతే సమస్యలు పరిష్కారం అవ్వవు అని అవని ప్రణతికి ధైర్యం చెబుతుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమేనా నువ్వు బ్రతకాలి నేను నీకు వదినగా చెప్పలేదు నీకు అమ్మగా చెప్తున్నాను అని అనగానే ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు నాకు వదినవి కాదు నిజంగానే అమ్మవే అని ప్రణతి బాధపడుతుంది. ఇక అవని బొకే షాప్ తరఫున ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ పువ్వులని మారుస్తుంది కానీ అక్షయ మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు కనిపిస్తుంటే నాకు నువ్వు చేసిన మోసమే గుర్తొచ్చింది. నిన్ను ఎంతగా నమ్మాను కానీ నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని నాకు అస్సలు ఊహించలేదు. నువ్వు నా ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు అని అక్షయ్ అంటాడు. మీ కింద పనిచేయట్లేదు నేను బొకే షాప్ కి కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా దాని ద్వారా వస్తున్నాను. మీరు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పండి అనేసి అంటుంది. నన్ను చూస్తే మీ మనసు ఎక్కడ మారిపోతుందని భయపడుతున్నారా అందుకే మీరు ఇలా అంటున్నారా లేదంటే మరి నన్ను రోజు చూడాల్సిందే హావ్ ఏ నైస్ డే అని చెప్పేసి వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ పార్వతి గుడికి వెళ్తారు అక్కడ భరత్ ని చూసి రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంటుంది. భరత్ ని నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కూతురు ఎందుకు మోసం చేశావు ఆస్తి కోసమేనా చేసావా అంటూ దారుణంగా కొడతాడు రాజేంద్రప్రసాద్. అయితే అవని వచ్చి మధ్యలో ఆపుతుంది నువ్వు నీ తమ్ముడు కలిసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశారని అంటాడు. అవని ఇప్పటికైనా నేను చెప్పేది వినండి మావయ్య అనేసి అంటుంది ఏం చెప్పాలి ఏం వినాలి అనేసి అరుస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని పార్వతి రాజేంద్రప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.
భానుమతి ఏమైంది రాజేంద్రప్రసాద్ అప్పుడే వచ్చేసావ్ ఏంట్రా అనేసి అడుగుతుంది. పార్వతి ఆ గుడి దగ్గర అవని, ఆ భరత్ కనిపించారు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. వాడిని వట్టుకొని కొట్టాడు. అని పార్వతి అంటుంది.. ఇక పల్లవి కనిపిస్తే కొట్టడం కాదు చంపేయాలని అనిపిస్తుంది. వాడు చేసిన మోసానికి ప్రణతి జీవితం నాశనం అయ్యింది. అలాంటి వాడిని వదిలేయడం కాదు వాడి కాళ్లు చేతులు ఇరగ్గొట్టేలా పోలీసులకు అప్పజెప్పాలి అని పల్లవి అంటుంది. వాడి నుంచి మన ప్రణతిని ఎలాగైనా తీసుకొచ్చి వాడి కట్టిన తాళిని తెంచేసి తన జీవితాన్ని బాగుపడేలా గుట్టు చప్పుడు కాకుండా మరో పెళ్లి చేసి తనని పంపించాలి అని పల్లవి సలహాలు ఇస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ పల్లవి మాటని వింటాడు. దాంతో పల్లవి అవని ఇంటికి పోలీసులను పంపిస్తుంది..
భరత్ నువ్వు రాజేంద్రప్రసాద్ కొట్టడంతో స్వరాజ్యం దయాకర్ ఇద్దరు అవని పై సీరియస్ అవుతారు మీ అత్తింటి వాళ్లకి మనుషుల్ని అర్థం చేసుకోవడం తప్ప కొట్టడం మాత్రమే వచ్చా అని అరుస్తాడు అది విన్నప్పుడు బాధపడుతుంది. ఆయన మీ మావయ్య కాకుండా అంటే భరత్ తిరిగి కొట్టేవాడు కాదా అని దయాకర్ అంటాడు. నువ్వు చేయని తప్పుకి నువ్వు ఇలా బాధలు పడటం నాకు ఇష్టం లేదురా అనేసి అవినీ అంటే మరేం పర్లేదు అక్క నువ్వు నాకు అమ్మ తప్ప ఇంకెవరున్నారు అని భరత్ అంటాడు.
ఇప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. ప్రణతిని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేశారని ప్రణతి వాళ్ళ అమ్మానాన్న కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసులు అంటారు. దానికి అవని తాను ఇష్టపడే పెళ్లి చేసుకుంది బలవంతంగా ఎవరూ పెళ్లి చేయలేదు అని అంటే ఎస్ఐ వచ్చి మీరు అదంతా పోలీస్ స్టేషన్ లో చెప్పుకోండి లేదంటే కోర్టుకెళ్లి చెప్పుకోండి అంతేగాని ఇప్పుడు ప్రణతిని వెళ్లి తీసుకురండి అని అంటుంది. ప్రణతి అక్కడికొస్తుంది. నేను వెళ్తాను వదినా అని అంటుంది అవని అంత చెప్పినా కూడా ప్రణతి వినకుండా వెళ్ళిపోతుంది.
ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసుల్ని పంపించేస్తుంది ప్రణతి. నేను ఎందుకు వెళ్లాను నేను ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారు కదా నేను ఒక మేజర్ ని నా ఇష్టం వచ్చిన ప్రకారం నేను చేసుకోవచ్చు. ప్రేమించే హక్కు నాకుంది. అనగానే రాజేంద్రప్రసాద్ పార్వతి నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావని మాకు చెప్పాలి కదా అప్పుడే కదా మేము అర్థం చేసుకుని ఏం చేయాలో అది చేస్తాం అలాంటిది నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే మా పరువు పోలేదా అనేసి అడుగుతారు.
శ్రీకర్ అన్నయ్య, శ్రీయ వదిన ఇద్దరు ప్రేమించుకున్నారు. చెప్పారు కానీ వాళ్ళ ప్రేమని మీరు అంగీకరించారా అవని వదిన దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది అయినా అప్పటికి ఇంట్లోకి రానిచ్చారా లేదు ఇప్పుడు మీరేదో గొప్ప అనేసి చెప్పుకుంటున్నారు నాకు ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు అనేసి ప్రణతి అందరికి షాకిచ్చేలా మాట్లాడుతుంది. ఇక ప్రణతి ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ నీకు మీ వదిన ట్రైనింగ్ ఇచ్చింది కదా అలానే మాట్లాడుతున్నావే అనేసి అంటాడు. వదిన నా జీవితాన్ని కాపాడింది వదినే లేకున్నా అంటే నేను ఈరోజు మీ ముందర శవంలాగా ఉండేదాన్ని అని ప్రణతి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..