Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి గురించి సరస్వతి వార్డెన్ అన్ని విషయాలు మిస్సమ్మ, రాథోడ్ లకు చెప్తుంది. అరుంధతిని అది చంపిందన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసన్న విషయం దానికి తెలుసు. అందుకే ఆ నిజం మీతో చెప్పనివ్వకుండా నన్ను ఆడ్డుకుంటుంది. నన్ను చంపడానికి కూడా వెనుకాడటం లేదు అని చెప్తుంది సరస్వతి. మరోవైపు ఇంట్లో అమర్ దగ్గర ఉన్న మనోహరి ఏదో ఫోన్ వచ్చినట్టు నాటకం ఆడుతుంది. హలో ఆ అదితి అవునా సరే సరే నేను ఇప్పుడే వచ్చేస్తాను.. సరే.. అంటూ కాల్ కట్ చేసినట్టు నటిస్తూ.. అమర్ నేను అర్జెంట్‌గా ఒక ప్లేస్‌కు వెళ్లాలి.. నేను ఒక ఆఫన్నవర్‌లో తిరిగి వస్తాను అని చెప్పగానే అమర్ సరే అంటాడు మనోహరి వెంటనే అక్కడి నుంచి ఆశ్రమానికి బయలుదేరుతుంది.
ఇక నిజం తెలుసుకున్న మిస్సమ్మ బాధపడుతుంది. అరుంధతి చాలా మంచి అమ్మాయి.. దేవత లాంటి అమ్మాయి. తను ఈ ఆశ్రమం కోసం అనాథ పిల్లల కోసం ఎంతో చేసింది. తను ఒక మంచి వ్యక్తికి ఇల్లాలు అయిందని.. మంచి కుటుంబానికి కోడలు అయిందని మేము చాలా సంతోషించాం. ముగ్గురు పిల్లల తల్లిగా అరుంధతి జీవితం పరిపూర్ణం అయిందని అనుకున్నాం.. కానీ ఆ మనోహరి అరుంధతి జీవితాన్ని అసంపూర్ణం చేసింది. ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది. అరుంధతి అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజులకు కోల్ కతా వెళ్లింది. అక్కడ రణవీర్ అనే అతణ్ని పెళ్లి చేసుకుని అతనితో ఒక బిడ్డను కని ఆ బిడ్డను అనాథ ఆశ్రమంలో వదిలేసింది.
అరుంధతి మంచి మనసుతో ఆ బిడ్డను దత్తత తీసుకుని తన బిడ్డల్లో ఒక బిడ్డగా పెంచింది. ఆ విషయం మనోహరికి తెలియదు. ఆ తర్వాత మనోహరి రణవీర్‌కు విడాకులు ఇచ్చి మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చింది. మీ ఇంట్లో చేరింది. తన వల్ల మీకు మీ కుంటుంబానికి ప్రమాదం జరగుతుందని చాలా బయపడ్డాను. అందుకే తన గురించి మీకు ముందే చెబితే తనను మీరు దూరం పెడతారు అనుకున్నాను. కానీ ఇప్పటికి చెప్పగలిగాను అంటుంది. మరోవైపు అమర్ ఇంట్లో ఆరు రూం తాళం తీసి అందులోకి వెళ్లగానే అది తెలిసిన గుప్త స్పీడుగా లోపలికి వెళ్తుంటాడు. గుప్త పరుగెత్తడం చూసి ఆరు కంగారుగా గుప్త గారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఆగండి.. అంటూ వెనకే వెళ్తుంది. రూంలో అమర్.. ఆరు ఫోటో ముందు నిలబడి ఉండటం చూసి చూశారా గుప్త గారు ఆయనకు నేను గుర్తుకు వచ్చానేమో..? నన్ను చూడాలని నా గది తలుపులు తెరిచారు అంటుంది ఆరు.
దీంతో గుప్త నిన్ను చూచుటకు నీ పతిదేవుడు ఈ గది తలుపులుత తెరువలేదు బాలిక నీ సహోదరి నిన్ను చూచుటకు విధి తెరిపించినది అని మనసులో అనుకుంటాడు. ఇక ఆరు ఫోటో చూస్తూ.. ఆస్థికలు పట్టుకుని అమర్ ఎమోషనల్ అవుతుంటాడు. ఆరు నిన్ను చూడగానే ఇష్టపడ్డాను.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. నీవల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్‌లాంగ్ మనం కలిసి హ్యాపీగా ఉంటామనుకున్నాను.. కానీ విధి మనల్ని వేరు చేసింది అంటూ బాధపడుతుంటే.. మనల్ని వేరు చేసింది విధి కాదండి.. ఆ మనోహరి చేసింది అంటుంది ఆరు. నువ్వు వెళ్లిపోయావు నేను మిగిలిపోయాను కానీ నువ్వు లేని ఈ లోకంలో నేను నీ జ్ఞాపకాలతో పిల్లల కోసం బతుకుతున్నాను. నువ్వు మళ్లీ పుట్టాలి అరు.. నువ్వు మళ్లీ పుడతావని ఒక స్వామిటీ ఇంటికి వచ్చి చెప్పారు.. అందుకోసం నీ ఆస్థికలు నిమజ్జనం చేయబోతున్నాను. నీ మరుజన్మ కోసం ఎదురుచూస్తున్నాను. అంటూ ఎమోషనల్ అవుతాడు.
మరోవైపు ఆశ్రమంలో నిజం తెలుసుకుని ఇంటికి బయలుదేరుతున్న మిస్సమ్మ, రాథోడ్‌లకు ఎదురు వెళ్తుంది మనోహరి. మనోహరిని చూసిన మిస్సమ్మ వెళ్లబోతుంటే.. మనోహరి అడ్డుపడుతుంది. దీంతో రాథోడ్ కోపంగా మిస్సమ్మ ఈవిడతో ఇంకా మాటలేంటి.. డైరెక్టుగా ఇంటికి వెళ్లి సార్‌తో నిజం చెప్పేద్దాం. అంటాడు. దీంతో మిస్సమ్మ తప్పుకోవే అంటూ మనోహరిని పక్కకు తోసేసి కారు దగ్గరకు వెళ్తుంది. మనోహరి కారుకు అడ్డం నిలబడుతుంది. సరస్వతి వచ్చి మనోహరిని పక్కకు తోసేస్తుంది. మిస్సమ్మ, రాథోడ్ ఇంటికి వెళ్తారు. మనోహరి కూడా వాళ్ల వెనకాలే ఫాలో అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.