Intinti Ramayanam Today Episode March 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీధర్ కోసం అవని, ప్రణతి ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రణతిని బయటే ఉండమని అవని లోపలికి వెళ్తుంది. అయితే అవని ఎంతసేపటికి లోపలి నుంచి బయటికి రాకపోవడంతో భరత్ ఏం జరిగిందో అన్ని టెన్షన్ పడుతూ నేను వెళ్లి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు ప్రనితి అని చెప్తాడు. బయట ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ప్రనితి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ప్రణతిని చూసినా అక్షయ్ తన చెల్లెల్ని చూసి తట్టుకోలేక పోతాడు. ఇక అక్కడున్న ఓ వ్యక్తి సాయంతో తన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ డాక్టరు మరేం పర్లేదు తనకి బాగానే ఉంది మీరు తీసుకెళ్లి పోవచ్చు అని అంటారు తను మీ చెల్లి అని చెప్పారు కదా అయితే కంగ్రాట్స్ అండి మీరు మావయ్య కాబోతున్నారని డాక్టర్ అంటుంది. మాట వినగానే అక్షయ్ షాక్ అవుతాడు. ఆ విషయం వినగానే అక్షయ్ కోపంతో భరత్ ని దారుణంగా కొడతాడు.. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి బయటపెడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అక్షయ్ నిజం చెప్పడంతో అందరు షాక్ అవుతారు. ప్రణతి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఎందుకు చేసింది అని అందరూ బాధపడతారు. అవనిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది పల్లవి . ఆస్తి కోసమే తన తమ్ముణ్ణి ప్రణతి మీ ట్రాప్ చేయించమని చెప్పి ఇలా చేశారు అని అందరూ అంటారు. ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. భానుమతి చూసావా రాజేంద్రప్రసాద్ నేను మొన్న అంటే నువ్వు కాదని నామీద అరిచావు ఇప్పుడు అదే నిజమైంది అని అంటుంది..
నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అక్షయని పార్వతి అడుగుతుంది. నేను చెప్పేది నిజం అమ్మ నువ్వు నమ్మిన నమ్మకపోయినా నేను హాస్పిటల్లోనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నానని అక్షయ అంటాడు. ఆ మాట వినగానే పార్వతి గుండెలు పగిలేలా రోదిస్తుంది. అలాగే ఇంట్లోని వాళ్ళందరూ అవనీదే తప్పంటూ నానా మాటలు అంటారు. కానీ కమల్ మాత్రం వదిన రోజు చెప్పాలనుకున్న విషయం ఇదే ఉంటది. ఎందుకు మీరు ఎవరు నమ్మరు అసలు ఏం జరిగిందన్న విషయం వదినని చెప్పనిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని కమలంటాడు.
రాజేంద్రప్రసాద్ నా కూతురు ఇలాంటి తప్పు చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నానని బాధపడతాడు. పల్లవి మనమందరం అవని ఎక్కదే తప్పు అని అంటున్నాం అందులో అవని యొక్క చేసింది పావులవంతయితే.. ప్రణతి ఏమాత్రం తెలివి లేకుండా చేసిందా? వాడితో ఎందుకు కలిసింది అని రచ్చ చేస్తుంది.. ఈ విషయంలో ముమ్మాటికి ప్రణతిదే తప్పు ఎవడో ఏదో గుడ్డిగా చెప్తే దాన్ని నమ్మేసి వారితో జీవితాన్ని పంచుకుంటారా అనేసి అంటుంది.
నా పరువు ని బజారు గెలిచిన దాన్ని నేను అసలు క్షమించేది లేదు అంటూ.. రాజేంద్రప్రసాద్ కోపంగా తన గదికి వెళ్లి రివాల్వర్ తీసుకొని దయాకర్ ఇంటికి బయలుదేరుతాడు. అవని ప్రణతి ఈ విషయం గురించి ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటారు.. ప్రణతి అని గట్టిగా రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ బయటకు వస్తారు. ప్రణతి లోపలే పెట్టి అవని కూడా బయటికి వస్తుంది. అల్లరి ముద్దుగా పెంచుకున్న కన్న తల్లిదండ్రులు నీకు తప్పు చేసేటప్పుడు గుర్తుకు రాలేదా? ఇలాంటివి నీచపు పని ఎలా చేసింది పిలువ పనికిమాలిన దాన్ని అని రాజేంద్రప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. రాజేంద్రప్రసాద్ కి అవని ఎంత చెప్పినా వినడు.
ప్రణతి బయటికి రాగానే కొంచమైనా నీకు సిగ్గు అనేది ఉందా? ఇంత బరితెగించావంటే అసలు నా పెంపకంలోనేనా నువ్వు పెరిగింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. తండ్రి ఆవేశాన్ని చూసి ప్రణతిని ఏదో ఒకటి చేస్తాడని తన ముగ్గురు కొడుకులు కూడా దయాకర్ ఇంటికి వస్తారు. ప్రణతి గురించి ఎంత చెప్పినా కూడా వినకుండా రాజేంద్రప్రసాద్ తనని చంపేయాలని అనుకుంటాడు. భరత్ అడ్డుపడతాడు. ఆ తర్వాత అవని అడ్డుపడుతుంది. ఈరోజు దీన్ని ఎలాగైనా చంపేసి నా పరువు నేను కాపాడుకుంటానని రాజేంద్రప్రసాద్ రివాల్వర్ తో కాలుస్తాడు. అది అవని చేయికి తగులుతుంది. అవని కింద పడిపోతుంది.
హాస్పిటల్లో అవని ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది.. కానీ ఇంట్లో రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని చంపాలనుకొని అవినీతి కాల్చానని అంటాడు. పల్లవి మాత్రం మీరేం తప్పుగా ఫీల్ అవ్వకండి మావయ్య తప్పు చేసేలా చేసిన వారిని కాల్చారు. మంచిపనే చేశారని పల్లవి అంటుంది. ఈ అనార్దాలు అన్నిటికి కారణం అవని కదా.. మంచి పని చేశారు అని పల్లవి అంటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అది కరెక్ట్ కాదు నేను చేసింది తప్పే అని దానికి క్లారిటీ ఇస్తాడు.
అక్షయ్ అవని కోసం బాధపడుతూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ అక్షయ దగ్గరకొచ్చి నా గారాల కూతురు అలా చేసిందంటే సహించలేకపోయాను తప్ప.. నా కూతురు చేసిన తప్పుని నేను భరించలేకపోయాను గుండెను రాయి చేసుకోలేకపోయా విచక్షణ కోల్పోయి ఆవేశంతో కాల్చాను.. నా తప్పే రా నన్ను క్షమించు అని అడుగుతాడు. ఇక డాక్టర్ కి అవనీ నిజం చెప్తుంది డాక్టర్ వచ్చి బయట వాళ్లను అడుగుతుంది. చేతికి తగిలిన బుల్లెట్టు మరొకచోట తగిలితే ప్రాణాలు పోయేవి అని డాక్టర్ చెబుతారు. ఆమె కండిషన్ పర్వాలేదు అని డాక్టర్ చెప్తుంది. అక్షయ్ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు. అవనీకి ఏమైందని కమల్ ని శ్రీధర్ ని అడుగుతాడు ఎలా ఉంటే నీకేం అవసరం లేదు కదా అన్నయ్య అనేసి కమలంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో రాజేంద్ర ప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఏం జరుగుతుందో చూడాలి..