Insta Reels:ఒకప్పుడు చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు ‘టిక్ టాక్’ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా తమ టాలెంట్ ను నిరూపించుకొని.. జబర్దస్త్ తో పాటు పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో ‘ఇన్స్టాగ్రామ్’, ‘యూట్యూబ్’ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కటే మార్గం కాదు కదా బోలెడు మార్గాలు.. ఈ నేపథ్యంలో చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి అని, తమ కోరికను తీర్చుకోవాలని ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్ స్టా లో రీల్స్ చేస్తూ తమ పర్ఫామెన్స్ తో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో దర్శకులను ఆకర్షించి.. ఇప్పుడు ఏకంగా యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల చిత్రాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ మరింత ఫేమ్ సొంతం చేసుకుంటున్నారు. అలా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఏకంగా సినిమాలలో అవకాశాలు దక్కించుకొని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఆ అమ్మాయిలు ఎవరు? ఏ సినిమాలలో హీరోయిన్ గా చేశారు? ఆ సినిమాల ఫలితం ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
శ్రీదేవి..
ఇటీవల నాని (Nani ) నిర్మాణంలో ప్రియదర్శి (Priyadarshi ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్’. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్ (Ram Jagadeesh) తొలి పరిచయంలో వచ్చిన ఈ సినిమా మొదటి టాక్ తోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో రోషన్ తో పాటు జాబిలి పాత్రలో నటించిన అమ్మాయే శ్రీదేవి(Sridevi ). వీరిద్దరూ ఇందులో ప్రేమికులుగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిని వెతుకుతుంటే.. ఎవరో తనకు శ్రీదేవి చేసిన రీల్ చూపించారని, ఆ తర్వాత శ్రీదేవిని ఆడిషన్ కి పిలిస్తే ఆమె నేను ఇచ్చిన డైలాగ్ను పర్ఫెక్ట్ గా చెప్పడంతోనే ఇందులో హీరోయిన్గా తీసుకున్నామని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అలా ఇన్స్టా రీల్ తో ఏకంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది శ్రీదేవి.
ఆంచల్ ముంజాల్..
అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లోనే భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’.. ఈ సినిమాలో పుష్ప రాజుకి జపాన్ కాంట్రాక్ట్ ఇచ్చే పాత్రలో ‘యానిమల్’ నటుడు సౌరభ్ సచ్ దేవ్ (Sourabh Sach Dev) నటించిన విషయం తెలిసిందే..ఇక ఈయన గర్ల్ ఫ్రెండ్ గా ఆంచల్ ముంజాల్ (Anchal Munjal)నటించింది. ముఖ్యంగా ఈమె ఇన్ స్టా లో పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కంట పడడంతో ఈమెను ఈ పాత్ర కోసం తీసుకున్నారట డైరెక్టర్ సుకుమార్. వాస్తవానికి ఈమె తమిళ సీరియల్స్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ తెలుగులోకి మాత్రం ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారానే నటిగా పరిచయమైనట్లు సమాచారం.
శ్రీ లక్ష్మీ సతీష్..
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఆయన ఇంట్రడ్యూస్ చేయబోయే కొత్త మూవీ హీరోయినే ఈ ఆరాధ్య దేవి. కెమెరా పట్టుకుని శారీలో అద్భుతంగా ఇన్స్టాలో కనిపించడంతో.. ఇక ఈమెను వెతికి పట్టుకొని మరి ఈమెతో సినిమా చేసేసారు వర్మ. తాజాగా వీరి కాంబినేషన్లో వచ్చిన శారీ మూవీ త్వరలో విడుదల కాబోతుంది.
సాక్షి వైద్య..
అఖిల్ (Akhil) డిజాస్టర్ మూవీగా నిలిచిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ కి జోడీగా నటించిన సాక్షి వైద్య (Sakshi Vaidya) ను కూడా డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendhar reddy) ఇలా ఇంస్టాగ్రామ్ రీల్స్ చూసే తీసుకున్నట్లు తెలిపారు.
ఇమాన్వి ఇస్మాయిల్..
ఇక ఈమె వీరందరి కంటే కాస్త భిన్నం అనే చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో ఈమె డాన్స్ వీడియోలను చూసిన డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఆడిషన్స్ కి పిలిచి మరీ ఈమెను హీరోయిన్గా చేసేశారు. వీరందరి కంటే ఈమె ప్రత్యేకత ఎందుకంటే.. ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) సినిమాలో జోడి కట్టే ఛాన్స్ అంటే ఇక ఈమె అదృష్టం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా వీరంతా కూడా సరదాగా రీల్ చేసి ఇప్పుడేకంగా సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్స్ అయిపోయారు.
Rashmika Mandanna: రష్మిక పాలిట శాపంగా మారిన స్టార్ హీరో.. చెప్తే విన్నావా..అనుభవించు..!