Intinti Ramayanam Today Episode March 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి తన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినందుకు బాధపడుతూ ఉంటుంది తను ప్రేమించిన వ్యక్తికి ఎక్కడ దూరం అవ్వాలని తన ఏడుస్తూ ఉంటే తన ముగ్గురు అన్నలు ప్రణతి దగ్గరికి వెళ్లి పెళ్ళికొడుకు చాలా మంచివాడు నువ్వు ఈ సంబంధం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటావు అనేసి అందరు మాట్లాడతారు కానీ ప్రణతి మాత్రం అసలు నిజం చెప్పుకోలేక. అవని వదిన అంటే నన్ను బాగా అర్థం చేసుకునేది అందుకే ఇప్పుడు ఆమె లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది. పార్వతి పూజ చేసి తన కూతురి పెళ్లి ఎటువంటి విజ్ఞాలు కలగకుండా పూర్తి కావాలని పెళ్లి పత్రికను అక్కడ పెట్టి ఆ తర్వాత చూస్తుంది. పెళ్లి పత్రికలో అవని పేరు ఉండటంతో షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో తెలుసుకోవాలని రాజేంద్రప్రసాద్ ని పిలుస్తుంది. ఇంట్లోనే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతారు. పెళ్లి పత్రికలో అవని పేరు ఎందుకుంది అవని పేరు కూడా ఇందులో ఉండకూడదని నేను చెప్పాను కదా మీరు ఎందుకు పెట్టారు అని రాజేంద్రప్రసాన్ని నిలదీస్తుంది. పెళ్లి పత్రికలో అవని పేరు లేకుండా అంటే పెళ్లి వాళ్ళు మీ కోడల గురించి దారుణంగా మాట్లాడతారు అని అంటారు.. మొత్తానికి పెళ్లి పత్రికలో అవని పేరు వేయడంతో ఇంట్లోని ఆడవాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవినీకి పెళ్లి పత్రిక ఇస్తాడు.. పెళ్లికి రమ్మని పెళ్లి పత్రిక ఇచ్చారా వద్దని పెళ్లి పత్రిక ఇస్తున్నారా అని అవని అడుగుతుంది. దానికి అక్షయ్ ఎందుకు అవని ఇంకా అలా మాట్లాడుతున్నావ్. నేను రమ్మనే నీకు పెళ్లి పత్రిక ఇచ్చాను ఒకవేళ వద్దనుకునే వానైతే నీ పేరుని పెళ్లి పత్రికలో ఎందుకు వేయిస్తానని అంటాడు.. నాకు ఆ ఇంట్లో స్థానం లేదు కానీ నా పేరు మాత్రం పెళ్లి పత్రికలో ఎలా ఉంది అని అవని అడుగుతుంది. ప్రణతిని పదేళ్లపనించి నేనే అమ్మ లాగా పెంచుతున్నాను అలాంటిది నా బిడ్డ పెళ్లికి నా భర్త చేతనే నువ్వు పెళ్లి పత్రిక తీసుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది నా అంత దరిద్రం ఎవరికి రాదు అని అవని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళ సంగతి మర్చిపో నేను ఈ పెళ్లి పత్రిక నీకు ఇస్తున్నాను అంటే నువ్వు ఈ పెళ్లికి రావాలనే కదా అని అక్షయ్ అంటాడు. దానికి అవని నేను ఏ మొహం పెట్టుకొని పెళ్లికి రావాలి ఏ అర్హతతో పెళ్లికి రావాలి అని అంటుంది. ఆ ఇంటి పెద్ద కోడలు కావాలా మీ భార్యగా రావాలా లేక నా కూతురికి టీచర్ రావాలా అనేసి అనేసి అడుగుతుంది.
నిజం చెప్పాలంటే నేను ప్రణతి ఎంగేజ్మెంట్ అప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? ప్రణతి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని అంటేనే నేను ఆ ఇంటికి వచ్చాను మీ అందరూ నన్ను ఎంతగా అవమానించారో చూశారు కదా ఇప్పుడు మళ్లీ నేను ఈ పెళ్లికి వచ్చాను అంటే ఇక నా బ్రతుకుని అవమానపాలు చేస్తారు అనేసి అవని బాధపడుతుంది. అవని చెప్పిన మాటలు అక్షయ్ ప్రణతి దగ్గరికి వెళ్లి అడుగుతాడు ప్రణతి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మీ వదినను ఇందాకే కలిసాను. ఫోన్ చేసి రమ్మన్నావని చెప్పింది అంటే అవును అన్నయ్య నా ఎంగేజ్మెంట్ కి భోజనం ఉండాలని అనుకున్నాను అనేసి అంటుంది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నాన్నకు చెప్తావు కదా నువ్వు నాన్నకి ఎక్కువ క్లోజ్ గా ఉంటావు కదా అనేసి అక్షయ్ తన మనసులోని ప్రేమను మనసులోనే ఉండేలా చేస్తాడు.
ఇక తర్వాత రోజు ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి పనుల గురించి హడావిడి చేస్తూ ఉంటారు. శ్రీకర్ కమల్ అక్షయ్ ముగ్గురు కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. ఎవరెవరికి పెళ్లి పత్రిక ఇవ్వాలి. ఏమేమి తీసుకురావాలి అని రాసుకుంటూ ఉంటారు అప్పుడే రాజేంద్రప్రసాద్ వియ్యంకులు ఇంటికి వస్తారు. పెళ్లి తక్కువ రోజుల్లోనే అయిపోతుంది కదా అందుకే మాకు కూడా టైం లేదు అందరికీ ఫోన్ చేసే పెళ్లికి రమ్మని చెప్తున్నామని అంటారు. నేను కూడా అంతే వదినగారు అందరికీ ఫోన్ చేసే రమ్మని చెప్తున్నామని పార్వతి అంటుంది.
ఇక ప్రణతి కోసం తీసుకొచ్చిన నగల్ని పార్వతికి ఇస్తుంది. మరేం లేదండి మేము పట్టింపులు ఎక్కువగా అనుకుంటాము ఇక మా బంధువులు కూడా అన్ని పట్టించుకోని ప్రతి చిన్న విషయాన్ని తీసి పడేస్తూ ఉంటారు. మీ పెద్ద కోడలు వాళ్ళ అమ్మగారికి బాగాలేదని అక్కడికి వెళ్ళింది కదా పెళ్లికైనా వస్తుందా లేదా అని కనుక్కుందామని వచ్చాము అని వాళ్ళ అంటారు. వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉంది కదండీ అందుకే దగ్గర ఉండి చూసుకోవాలని ఆమె అక్కడే ఉంది లేకపోతే రాకుండా ఉంటుందని పల్లవి శ్రియాలు అంటారు. పెళ్లికి రాకుండా ఉంటే మా వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు ఏదో జరిగిపోయింది అనుకుంటారు మీరు దయచేసి ఆలోచించండి అనేసి వాళ్ళ అంటారు.
ఇక పార్వతి మా పెద్ద కోడలు పెళ్లికి వస్తుంది లేండి అనగానే వాళ్ళు ఇక మేము వెళ్లి వస్తామని చెప్పి వెళ్ళిపోతారు.. ఇక రాజేంద్రప్రసాద్ అవనీ పిలిస్తే గాని రాదు అవని నీ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు కదా అని అనగానే పార్వతి నేను అవనీని పిలుస్తానని ఎలా అనుకున్నారు అవని స్థానంలో ఇంకొకరు వస్తారు అని అంటుంది. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..