Intinti Ramayanam Today Episode May 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య అక్షయ్ తో వెళ్లనని అంటుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కోలాగా అక్షయ్ తో అవని గురించి చెప్తారు. కానీ అక్షయ్ మాత్రం సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కూతురిని నేను ఎలాగా నా దగ్గరికి తీసుకురావాలో నాకు తెలుసు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు పార్వతి అందరూ ఆరాధ్య కోసం బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఆరాధ్య కోసం బావగారు వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని పార్వతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అక్షయ్ ఇంటికి వస్తాడు. ఆరాధ్య ను ఎందుకు తీసుకురాకుండా వచ్చావని పార్వతి అడుగుతుంది. ఆరాధ్య అవని దగ్గర్నుంచి రానని చెప్పింది అని అంటాడు అక్షయ్.. మీరు పోలీసులు తీసుకెళ్లిన కూడా మీరు పోలీసుల్ని తీసుకెళ్లినా కూడా ఆరాధ్యను అవని ఎందుకు పంపించలేదు అని పల్లవి అడుగుతుంది. స్కూల్ నుంచి ఆరాధ్యను తీసుకెళ్లింది అవని కాదు నాన్న అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఆరాధ్య ను అవని దగ్గర వదిలిపెట్టి నీ బిడ్డ నువ్వు నీ దగ్గరికి చేర్చాను జాగ్రత్తగా చూసుకోవాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇంట్లో అన్ని సమస్యలను తీర్చిన నువ్వే తప్పు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పు అని అవనిని అడుగుతాడు. కానీ నిజం చెప్పదు.. ఇక ఇంటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ పై అందరు సిరీయస్ అవుతారు. ఆరాధ్యను అవని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అని పార్వతి అడుగుతుంది. తల్లిని బిడ్డను వేరు చేయడం ఇష్టం లేకే నేను ఆ పసిధాన్ని తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి మీరు తప్పు చేసారు..ఇది న్యాయమేనా మీకు.. ఇంట్లో గొడవలన్నీటికి అవని అక్క కారణమని తెలుసు అవని అక్క వల్లే ఇదంతా జరుగుతుందని తెలిసి కూడా మీరు అవని అక్కకి ఎలా సపోర్ట్ చేశారు అని పల్లవి అడుగుతుంది..
రాజేంద్రప్రసాద్ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సపోర్ట్ చేశాను నీకు ఏమైనా ప్రాబ్లమా అని షాక్ ఇస్తాడు రాజేంద్రప్రసాద్.. అయితే రాజేంద్ర ప్రసాద్ ని మాత్రం అక్షయ్ అరుస్తాడు. ఎందుకు మీరు అలా చేశారు మీరు నాకు ఇప్పుడు ఒక శత్రువులాగే కనిపిస్తున్నారు అని బాధపడతాడు. నా కూతురిని నాకు కాకుండా చేశారు కదా మీకు ఇది న్యాయమేనా అని రాజేంద్రప్రసాద్ ని అడుగుతాడు. నా ఫ్యామిలీ విషయంలో కలగ చేసుకోవడానికి మీరెవరు మీకు ఏం సంబంధం ఉంది అని అక్షయ్ అంటాడు.
నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటున్నావు నువ్వు నా కొడుకు కాబట్టి నీ బాధ్యతలు నేను తీసుకున్నాను. నీ భార్య మా ఇంటికి కోడలు ఆమె సంతోషాన్ని కూడా మేము చూసుకోవాలి కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. నీకన్నా అమ్మే నయం ఆమె కడుపున పుట్టకపోయినా నన్ను కన్న కొడుకు లాగా చూసుకుంటుంది అని రాజేంద్ర ప్రసాదని అంటాడు. నీకు నేను కన్న కొడుకుని అన్న విషయం కూడా నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావ్ నీ కొడుకుని అయితే నువ్వు ఇలా చేసే వాడివి కాదు అని రాజేంద్రప్రసాద్ ని దారుణంగా తిడతాడు అక్షయ్.
ఇక రాత్రి అందరూ భోజనానికి రమ్మని పార్వతి పిలుస్తుంది. కానీ రాజేంద్రప్రసాద్ ను మాత్రం ఎవ్వరు భోజనానికి పిలవరు. కమల్ శ్రీకర్ నాన్న ఎందుకు రాలేదు అని వెళ్లి నాన్నని పిలుచుకు రమ్మని కమల్ కి చెప్తాడు. రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్ళిన కమల్ ఏంటి నాన్న అందరు భోజనానికి వస్తే మీరు భోజనానికి రాలేదు అని అడుగుతాడు. నేనంటే ఇంట్లో వాళ్ళందరికీ కోపం రా ఇప్పుడు నేను అక్కడికి భోజనానికి వస్తే వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు అని అంటాడు. కానీ కమల్ మీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అమ్మ భోజనం కూడా చేయలేదు అని పిలుచుకొని కిందకు తీసుకొస్తాడు.. కానీ కింద మాత్రం పార్వతి భోజనం చేయడం చూసి రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..