Intinti Ramayanam Today Episode May 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ దగ్గరకు వెళ్లిన అవని మీరు రారేమో అనుకున్నానండీ.. మీరు రాకపోతే ఆరాధ్య చాలా ఫీల్ అయ్యేది. వచ్చినందుకు చాలా థాంక్స్ అండీ’అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. నేను వచ్చింది నీ కోసం కాదు.. నా కూతురి కోసం అని అంటాడు. నాకోసం వచ్చారని చెప్పడం లేదు.. నా కోసం రాలేదని అంటున్నారంటే.. నా గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట అని అంటుంది అవని.. అదంతా నీ భ్రమ మాత్రమే నేను వచ్చింది నా కూతురు కోసమే అని అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు. నాది భ్రమకావచ్చు. రేపు అనేది మాత్రం నిజం. మీరు నాకోసం వచ్చేరోజు దగ్గరలోనే ఉంది అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. జరగని వాటి కోసం ఎక్కువ ఆలోచించుకోకు. ఆశలు పెట్టుకోకు అని అంటాడు. మనిషిని బతికించేదే ఆశ. అందర్నీ ఫంక్షన్ లో హాల్లో కూర్చొని టీచర్లు చెప్తారు.. ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ వచ్చారని చెప్పారు. అందరూ స్కూల్ గురించి స్కూల్ గొప్పతనం గురించి అలాగే పిల్లల తీరు గురించి గొప్పగా చెప్తారు. అందులో ఆరాధ్యను ఎక్కువగా మెన్షన్ చేస్తూ చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సంతోష పడతారు.కమల్ రాజేంద్రప్రసాద్ ని పార్వతిని ఒకచోట కూర్చో పెడతాడు..
అలాగే అక్షయ్ పక్కన అవని నీ కూర్చోమని చెప్తాడు. కానీ అక్షయ మాత్రం అవని పక్కన కూర్చోడానికి ఇష్టపడడు. అమ్మానాన్నలు కూర్చున్నారు అన్నయ్య.. అందరు చూస్తే బాగోదు ఆరాధ్యకు అవార్డులు ఇచ్చేటప్పుడు మీరిద్దరు పక్కపక్కనే ఉంటే చూడ్డానికి బాగుంటుంది. కూర్చుని కమల్ ఒప్పించి పక్కపక్కన కూర్చో పెడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి ప్లాన్ చేసి అవనిని ఎలాగైనా ఇరికించాలని అందరి ముందురా పరువు తీయాలని అనుకుంటుంది. ఆరాధ్య పేరెంట్స్ తో అవార్డులను తీసుకోవడం పై కలెక్టరు వీరిద్దరి దాంపత్యం గురించి గొప్పగా చెప్తాడు. అయితే మధ్యలో ఒక ఆవిడ లేసి మీరందరూ అనుకున్నట్టు అవని అక్షయలు కలిసి ఉండటం లేదు. వారిద్దరూ విడాకులు తీసుకోకుండానే విడివిడిగా ఉంటున్నారంటూ అందరి ముందర స్టేజ్ మీదే పరువు తీయాలని మాట్లాడుతుంది. అయితే వెంటనే అవని అక్కడికొచ్చి ఈవిడెవరో కానీ నా గురించి బాగా తెలిసినట్లు కరెక్ట్ గానే చెప్పారు. మేమిద్దరం కలిసి ఉండట్లేదు.. కానీ అలాగని విడాకులు తీసుకుని విడిపోలేదు.. కొన్ని గొడవలు రావడంతో మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం అంతే తప్ప ఎప్పుడూ మా మనసులు వేరు కాదని దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.
ప్రతి ఇంట్లోనూ గొడవలు అనేవి కామన్ గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటేనే ఆ బంధం మరింత బలపడుతుందని అంటారు. ఎంతమందికి గొడవ లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి అంటూ అవని నిలదీస్తుంది.. దాంతో కలెక్టర్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తాడు. భార్య అడగడం హక్కు భర్త వాదించడం మరో హక్కు అన్నట్లే ఉంటారు అది దాంపత్య జీవితానికి కరెక్ట్ సూచన అని అంటాడు. ఇక కమల్ అక్కడికి వచ్చి పల్లవిశ్రియాలకు చూశావా మా వదిన గురించి కలెక్టర్ ఎంత గొప్పగా చెప్పాడో అది అనేసి అంటాడు.
నీలాగా వాళ్ళిద్దరిని కలపాలని చూసి మోసం చేయలేదు నాకు ఆలోచన కూడా లేదు అని అంటుంది పల్లవి. దానికి కమల్ మంచి చేస్తే మంచిగానే నేను పొగుడుతాను నువ్వు మంచి చేసే ఆలోచనలో లేవు కాబట్టి నేను అరుస్తున్నానని అంటాడు. పార్వతి అక్కడికి వచ్చి పెద్ద గొప్ప పని చేశావులే అని కమల్ని అరుస్తుంది. ఇక్కడ ఎందుకు ఆవనిది పొగుడుతుంటే మనం చూస్తూ ఉండాలా వెళ్లిపోదాం పదండి అని పార్వతి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ మాత్రం అప్పుడే వెళ్ళిపోతారా కాస్త ఆగండి మీకు ఇంకొకటి చూపించాలి అని వాళ్ళని ఆపుతాడు.
చెక్కు తీసుకొచ్చి ఒక పది లక్షలు స్కూల్ కి ఇవ్వాలని చెప్తాడు రాజేంద్రప్రసాద్రా. జేంద్రప్రసాద్ స్టేజ్ మీద కెళ్ళి మా అమ్మాయి మీ స్కూల్లో చదువుతుంది కాబట్టి మీ స్కూలుకు డొనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నామని అంటారు. ప్రిన్సిపల్ సంతోషిస్తుంది.. అక్షయ్ ని చెక్కు తీసుకొచ్చి ఒక పది లకలు స్కూల్ కి ఇవ్వాలని చెప్తాడు రాజేంద్రప్రసాద్.. ఇక తండ్రి మాట కాదనలేక 10 లక్షల చెక్కుని తీసుకువచ్చికి రాజేంద్రప్రసాద్ కి ఇస్తాడు.. అయితే రాజేంద్రప్రసాద్ ఆ చెక్కుని అవినీ చేతుల మీదుగా ఇవ్వాలని అంటాడు. మా అత్తయ్య మావయ్య గారి చేతుల మీదగా ఇస్తేనే మంచిది అని చెప్తుంది.
అవని మంచిదని చెప్పుకోవడానికి ఇలా చేస్తుంది అని పల్లవి కుళ్ళుకుంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. అప్పుడే ఆరాధ్య నేను ఈరోజు నాన్నతో వెళ్తానని అంటుంది. చూశారా రెండ్రోజులు కూడా నీ దగ్గర ఉండలేదు ఇప్పుడు మళ్లీ అక్షయ దగ్గరకే వెళ్లాలని అనుకుంటుంది అంటూ పార్వతి అంటుంది. సందు దొరికింది కదా అని పల్లవి కూడా అవనిని దారుణంగా తిడుతుంది.. తన తండ్రి దగ్గర ఉండాలని అనుకుంటుందే తప్ప తల్లిని వదిలేయాలని ఎక్కడ అనుకోలేదని అవని అంటుంది. ఇక రాజేంద్రప్రసాద్ అవనిని నువ్వు చేసింది ఏం బాగోలేదమ్మా అని అంటాడు. ఏం చేశాను మామయ్య ఆరాధ్య తన తండ్రితో కూడా ఉండాలని అనుకుంటుంది అప్పుడే కదా ఆయన సంతోషంగా ఉంటారు అని అక్షయ్ గురించి ఆరాధ్య ఆలోచిస్తుంది. అది విన్న రాజేంద్రప్రసాద్ నీకున్న ఆలోచన వాడికి లేదు కదా అని అంటాడు..
ఇంట్లో అవని వాళ్ళు వచ్చేలోగా లేట్ అవుతుందని భరత్, ప్రణతి ఇద్దరు కలిసి వంట చేస్తారు. అవని డౌట్ పడుతుంది.. ఇద్దరూ కలిసి ఉంటే ఖచ్చితంగా ప్రేమలో పడతారేమో అని ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఆరాధ్యను మళ్ళీ అవని ఇంటికి చేరుస్తాడు అక్షయ్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…