BRS: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ బానోతు మదన్‌లాల్ గుండెపోటుతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మదన్‌లాల్ మరణవార్త తెలియగానే బీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు.
వైరా నియోజకవర్గం నుంచి బానోతు మదన్‌లాల్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఈర్లపూడి గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఆ తర్వాత వైసీపీ చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆ తర్వాత 2018, 2023 వైరా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.మదన్‌లాల్‌కు భార్యను మంజుల, కొడుకు మృగేందర్ లాల్,కుమార్తె మనీషాలక్ష్మి ఉన్నారు. కుమారుడు మృగేందర్ లాల్ ఐఏఎస్ తమిళనాడు క్యాడర్ అధికారి. కోడలు కూడా ఐఏఎస్ అధికారి.
ALSO READ: కేసీఆర్-కవిత మధ్య చర్చలు.. తొలి విడత ఫెయిల్
కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఏఐజీ చికిత్స పొందుతున్న మదన్‌లాల్. మదన్‌లాల్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వైరాకు ఆయన ఆయన మృతదేహాన్ని తరలించనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఈర్లపూడి గ్రామంలో ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.