Intinti Ramayanam Today Episode May 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ప్లాన్ చేసి అవనిని ఎలాగైనా ఇరికించాలని అందరి ముందురా పరువు తీయాలని అనుకుంటుంది. ఆరాధ్య పేరెంట్స్ తో అవార్డులను తీసుకోవడం పై కలెక్టరు వీరిద్దరి దాంపత్యం గురించి గొప్పగా చెప్తాడు. అయితే మధ్యలో ఒక ఆవిడ లేసి మీరందరూ అనుకున్నట్టు అవని అక్షయలు కలిసి ఉండటం లేదు. వారిద్దరూ విడాకులు తీసుకోకుండానే విడివిడిగా ఉంటున్నారంటూ అందరి ముందర స్టేజ్ మీదే పరువు తీయాలని మాట్లాడుతుంది.
అయితే వెంటనే అవని అక్కడికొచ్చి ఈవిడెవరో కానీ నా గురించి బాగా తెలిసినట్లు కరెక్ట్ గానే చెప్పారు. మేమిద్దరం కలిసి ఉండట్లేదు.. కానీ అలాగని విడాకులు తీసుకుని విడిపోలేదు.. కొన్ని గొడవలు రావడంతో మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం అంతే తప్ప ఎప్పుడూ మా మనసులు వేరు కాదని దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. రాజేంద్రప్రసాద్ అందరికి దిమ్మతిరిగేలా చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య ఇంటికి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. ఆరోగ్యం సంతోషంగా చూసుకుంటే అవని దగ్గరికి వెళ్ళదని పల్లవి ప్లాన్ చేస్తుంది.. అది విన్న కమ్మలు ఆరాధ్యం ఇక్కడే ఉంచాలని తల్లికి దూరం చేయాలనుకుంటావా అంటూ పల్లవి పై సీరియస్ అవుతాడు.. ఇక శ్రీయ కూడా అలానే అనుకుంటుంది. కమల్ శ్రియ ఫై కూడా సీరియస్ అవుతాడు. మీరు చేస్తున్నది ఏం బాగోలేదు కనీసం కొంచెమైనా ఆలోచించండి అంటూ అందరినీ తిడతాడు.. ఇక ఆరాధ్య వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఆరాధ్యుని బాగా చూసుకోవాలి అప్పుడే అవనిని మర్చిపోతుందని అంటారు.
కమల్ ఆరాధ్య దగ్గరకు వెళ్లి బంగారం నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఊహించలేదు నీకేం కావాలో చెప్పు మనిద్దరం కలిసి ఆటలాడుకుందామా ఏమైనా తినాలా అనేసి అడుగుతాడు. అయితే నాకేం వద్దు బాబాయ్ అని అంటుంది.. అమ్మను చూడాలనిపిస్తుంది అమ్మ దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది కానీ నాన్న ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నా అని ఆరాధ్య అంటుంది. అయితే నీ ఆలోచన బాగానే ఉంది కానీ.. పెద్దవాళ్ళం మాచైతే కావట్లేదు చిన్నపిల్లవి నీచైతే ఎలా అవుతుంది అని కమలంటాడు..
అమ్మానాన్నని కలిసేలా చేయాలి బాబాయ్ ఎలాగైనా అని ఆరాధ్య అడుగుతుంది. అయితే నీకు జ్వరం వస్తే కచ్చితంగా అమ్మ ఇక్కడికి వస్తుంది. లేదా నాన్న అక్కడ తీసుకెళ్లిపోతాడని కమల్ ప్లాన్ గురించి ఆరాధ్యతో ఉంటాడు. ఆరాధ్య సరే బాబాయ్ మనం ఆ ప్లాన్ చేద్దాం నాకు జ్వరం రాగానే తీసుకెళ్లిపోతాడు అని అంటుంది.. ఇక భోజనానికి అందరు రాలేదని పార్వతి అందరిని పిలుస్తుంది. కమలు కంగారుగా వచ్చి ఆరాధ్యకు బాగా జ్వరం వచ్చింది అమ్మ అమ్మాయిని కలవరిస్తుందని అనగానే అందరూ టెన్షన్ పడిపోయి లోపలికి వెళ్ళిపోతారు.
జ్వరం రావడం చూసి అందరూ షాక్ అవుతారు. అయితే అందరూ కలిసి ఆరాధ్యను అవని దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పగానే అక్షయ్ అవినీ దగ్గరికి ఆరాధ్యను తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆరాధ్య పరిస్థితిని చూసి అందరూ కంగారు పడతారు. ఇక ఆ పని లోపలికి తీసుకెళ్లి ఆరాధ్యకు జ్వరం తగ్గాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అక్షయ్ ఆరాధ్య ఇక్కడ ఉంటే నాన్న అని బెంగపెట్టుకుంటుంది అక్కడ ఉంటే అమ్మ అని బెంగ పెట్టుకుంటుంది అని అంటాడు. రాజేంద్రప్రసాద్ మీ పంతాలు మీవే గాని ఆ పసి దాని మనసుని అర్థం చేసుకోరా అని అంటాడు. ఇంట్లోని అందరూ తలా ఒక మాట అనేస్తారు. ఆరాధ్య లోపలికి వెళ్ళగానే అవని పడుకో తడి బట్ట పెడతాను అని అడుగుతుంది. కానీ ఇది నిజం జ్వరం కాదు ఉత్తిత్తి జ్వరమే అని అసలు విషయాన్ని బయటపెడుతుంది అది విన్న రాక్షసి సీరియస్గా కమల్ ని అడగడానికి వెళ్తాడు. కమల్ చేసిన విషయాన్ని అందరికీ చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..