BigTV English

Hyderabad News: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి

Hyderabad News: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి

Hyderabad News: ‘భరత్ అనే నేను’ సినిమా హైదరాబాద్‌ సిటీలో రిపీట్ కానుందా? అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారికి ఇకపై భారీ జరిమానాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సిటీలో వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. నమోదైన కేసులు చూసి అధికారులు షాకయ్యారు. ఒక్కటీ రెండు కాదు.. ఏకంగా దాదాపు 19 వేల కేసులు నమోదు అయ్యాయి.


ట్రాఫిక్ విషయంలో అధికారులు ఎన్ని రూల్స్ తెచ్చినా వాహనదారులు అస్సలు పట్టించుకోలేదు. రూల్స్ అధిగమించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనం గతవారం పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్. ఎన్ని చలాన్లు వేసినా వాహనదారుల్లో మార్పు రాలేదు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం కామన్‌గా మారిపోయింది.

ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ చేతిలో ఉన్న కెమెరాలకు పని కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రికార్డు స్థాయిలో నిబంధనల అతిక్రమణ కేసులు నమోదయ్యాయి.


మే 20 నుంచి మే 26 వరకు అంటే కేవలం వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 18 వేల 798 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి డేటాను మంగళవారం విడుదల చేశారు అధికారులు. అందులో రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినవారిపై దాదాపు 14 వేల 917 కేసులు బుక్కయ్యాయి. చెప్పాలంటే ఇదొక డేంజర్ బెల్స్ అన్నమాట.

ALSO READ: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన, నాలుగు రోజులు ఇలాంటి పరిస్థితే

రూల్స్ అధిగమనించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఫొటో క్లిక్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి చలాన్లపై డిస్కౌంట్లు ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలు అతిక్రమించడం వాహనాదారులకు కామన్‌గా మారిపోయింది. ఈ విషయంలో తాము మారేది లేదని వాహనదారులు చెప్పకనే చెబుతున్నారు.

నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై కొరడా ఝుళిపించారు పోలీసులు. ఈ వ్యవహారంలో మొత్తం 3,881 కేసులు నమోదు అయ్యాయి. వాహనదారులు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రమాదాలు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఫైన్లు వేయడం, వాటిని కట్టలేని వారు వాహనాలను సీజ్ చేయకుంటే మారే అవకాశం ఉండదని కొందరు నిపుణుల మాట.

ఇక్కడే చాలామంది ‘భరత్ అనే నేను’ సినిమాను గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా ప్రమాదాలు కంటిన్యూ అవుతాయని అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా ఏ మాత్రం మారినట్టు కనిపించడం లేదు. స్కూళ్లు, కాలేజీలు లేని సమయంలో ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.

పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ తర్వాత ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయోనని అంటున్నారు. కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు, ఇంటికి చేరుకోవచ్చు. లేకుంటే జరిమానా చెల్లించుకోవాల్సివస్తుంది. రూల్స్ అధిగమించినవారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోషల్ సర్వీసు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు అధికారులు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×