Intinti Ramayanam Today Episode May 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆరాధ్యను అవని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అక్కడ అవనికి జ్వరం రావడం చూసి టెన్షన్ పడతారు.. ఆరాధ్య లోపలికి వెళ్ళగానే అవని పడుకో తడి బట్ట పెడతాను అని అడుగుతుంది. కానీ ఇది నిజం జ్వరం కాదు ఉత్తిత్తి జ్వరమే అని అసలు విషయాన్ని బయటపెడుతుంది అది విన్న రాక్షసి సీరియస్గా కమల్ ని అడగడానికి వెళ్తాడు. కమల్ చేసిన విషయాన్ని అందరికీ చెప్తాడు. కమలి ఇంట్లోకి వెళ్ళగానే.. అక్షయ్ కోపాన్ని కమల్ మీద చూపిస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఐడియాలు ఇస్తారా అసలు నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని అక్షయ్ కమ్మలని దారుణంగా తిడతాడు. నేను చేశాను అన్నయ్య ఏమైంది అని కమల్ అడుగుతాడు.
ఇంట్లోని వాళ్ళందరూ ఏం చేశారు రా ఎందుకు కొడుతున్నావ్ అని అడిగితే.. ఆరాధ్యకు ఉల్లిపాయ ట్రిక్ చెప్పి జ్వరం వచ్చేలా చేసి అవినీతికి తీసుకెళ్లాల చేశాడు. చిన్న పిల్లలకు లేని అలవాట్లు అన్ని నేర్పిస్తున్నాడు అని అక్షయ్ కమల్ ని కొడతాడు. ఇలా ఎందుకు చేసావురా అని పార్వతి అడిగితే. నేనేది కావాలని చేయలేదు ఆరాధ్య పసిపిల్ల మనసు కాబట్టి అమ్మానాన్న ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటుంది. పంతాలు మీ పట్టింపులతో ఆరాధ్య మనసును విరిచేస్తున్నారు అందుకే నేను మంచిగా ఉండాలని చూసుకున్నాను దాంట్లో తప్పేంటి అని కమల్ అరుస్తాడు. మీ పంతాలతో పట్టింపులతో పసిపిల్ల మనసును ఎంత గాయపరుస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇవన్నీ నాకు ఏమీ తెలియదు ఆరాధ్య సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని కమలంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆఫీసుకు వెళ్తే అక్షయ్ నీ సర్వీస్ మాకు అవసరం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇలా చెప్తే ఎలాగో వింటావు? మీ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్తానని అంటాడు.. అవని నేను ఆఫీసుకు వచ్చేది జీతం కోసం కాదు మీలో మార్పు కోసం అని అవని అక్షయ్ ని దుమ్ము దులిపేస్తుంది.. నా కుటుంబాన్ని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నావు. అందుకే నీ సర్వీస్ నాకు అక్కర్లేదు నీ మొహం చూడాలని కూడా నాకు లేదు అని అక్షయ్ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అవని నీ కుటుంబాన్ని నేను విడగొడుతున్నానా ఏం మాట్లాడుతున్నారండి మీరు జాబ్ మానేయాలి అని ఆలోచన నాకు రావాలి మీరు ఎవరు చెప్పడానికి అని వాదిస్తుంది. ఇక అక్షయ్ కోపం కట్టలు తెలుసుకోవడంతో కాంట్రాక్ట్ ని క్యాన్సల్ చేస్తున్నామంటూ అవని ఆఫీసు వాళ్లకి ఫోన్ చేసి చెప్తాడు.
నా తమ్ముళ్ళని ఎక్కడ నాకు దూరం చేస్తావన్న బాధ భయం నాకున్నాయి దయచేసి ఆ పని చేయొద్దు అని అవని నీ వేడుకుంటాడు అక్షయ్.. అవని ఇంటికి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. ఫ్లవర్ డెకరేషన్ షాప్ అతనికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలని అనుకుంటుంది. అయితే అతను అక్షిలాంటి పెద్ద కాంట్రాక్టర్ ఏ మనకు వద్దనుకున్నప్పుడు ఇంకా మేమేం చేస్తామండి మమ్మల్ని ఇంకా సంప్రదించకండి అని ఒక్క మాటతో చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. అవని తన ఆఫీసు వాళ్లతో ఫోన్ మాట్లాడడం రాజేంద్రప్రసాద్ వింటాడు. నేను ఇప్పుడు జాబ్ చేయడం చాలా అవసరం మావయ్య మీ అబ్బాయి ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది..
నేను ఒక్కదాన్నే ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడు నాకు నీడనిచ్చారు బాబాయ్ పిన్ని. వాళ్లకి భారం కాకూడదని నేను జాబ్ లో జాయిన్ అయ్యాను ఆ తర్వాత భరత్ ప్రణతి కూడా నాతో పాటు వచ్చేసారు.. ఇప్పుడు మీరు ఆరాధ్య కూడా ఇక్కడే ఉంటున్నారు.. వీళ్లు అంత ఉన్నోళ్లు కూడా కాదు.. నేను జాబ్ చేసి అంతో ఇంతో సహా ఉంటే మనందరం భారం కాకుండా ఉంటామని నేను అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఇకమీదట ఏదో ఒక జాబు వెతుక్కోవాలి అని అవని అంటుంది.
రాజేంద్రప్రసాద్ నీకు జాబ్ పోవడం కూడా మన మంచికే అనుకో ఏదో ఒకటి వస్తుంది లేమ్మా అని అవనితో అంటాడు.. పల్లవి ఇంట్లో కూర్చొని ఉంటుంది. శ్రేయ ఫోన్ మాట్లాడుతూ పల్లవికి చురకలంటిస్తుంది.. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని ఇద్దరు మరోసారి వాదించుకుంటారు.. ఇంట్లో గుర్తింపు లేదు అందుకే నేను నీతో కలిసి ఉండను నా ఇష్ట ప్రకారం నేను ఉంటానని శ్రీయ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది..
అవని జాబ్ కోసం వెతుకుతూ రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక ఆవిడ పడిపోతుంది. అక్షయ్ కారుని ఆపి ఆవిడను ఆ కారులో హాస్పిటల్ కి తీసుకెళ్తుంది.. ఇక ఇంటికి రాగానే శ్రీకర్ అవని వదిన జాబ్ పోవడానికి మీరే కారణం ఆమె పని తాము చేసుకుంటుంది. కానీ మీరు ఆమె జాబ్ పోవడానికి మీరే కారణం. ఇక పల్లవి కూడా మీరే తప్పు చేశారు బావగారు అని అంటుంది. మన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఆ ఇంట్లో ఉన్నారు అక్కకి భారం కాకుండా జాబ్ చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటుంది. వాళ్లంతా ఎక్కడికి వెళ్తారు అది ఆలోచించండి అని అంటుంది.. అప్పుడే చక్రధర వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…