Intinti Ramayanam Today Episode May 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆఫీసుకు వెళ్తే అక్షయ్ నీ సర్వీస్ మాకు అవసరం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇలా చెప్తే ఎలాగో వింటావు? మీ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్తానని అంటాడు.. అవని నేను ఆఫీసుకు వచ్చేది జీతం కోసం కాదు మీలో మార్పు కోసం అని అవని అక్షయ్ ని దుమ్ము దులిపేస్తుంది.. నా కుటుంబాన్ని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నావు. అందుకే నీ సర్వీస్ నాకు అక్కర్లేదు నీ మొహం చూడాలని కూడా నాకు లేదు అని అక్షయ్ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అవని నీ కుటుంబాన్ని నేను విడగొడుతున్నానా ఏం మాట్లాడుతున్నారండి మీరు జాబ్ మానేయాలి అని ఆలోచన నాకు రావాలి మీరు ఎవరు చెప్పడానికి అని వాదిస్తుంది. ఇక అక్షయ్ కోపం కట్టలు తెలుసుకోవడంతో కాంట్రాక్ట్ ని క్యాన్సల్ చేస్తున్నామంటూ అవని ఆఫీసు వాళ్లకి ఫోన్ చేసి చెప్తాడు.
నా తమ్ముళ్ళని ఎక్కడ నాకు దూరం చేస్తావన్న బాధ భయం నాకున్నాయి దయచేసి ఆ పని చేయొద్దు అని అవని నీ వేడుకుంటాడు అక్షయ్.. అవని ఇంటికి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. నాతో పట్టి మీరందరూ ఇక్కడే ఉంటున్నారు పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా పెద్దగా ఉన్న వాళ్ళు కాదు కదా మావయ్య వాళ్లకి ఏదో ఒక విధంగా ఆసరాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే త్వరలోనే జాబ్ తెచ్చుకోవాలని అవని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని నీ జాబ్ లోంచి తీసేయించిన విషయాన్ని అక్షయ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. పార్వతి సంతోషపడుతుంది. దగ్గర అవ్వాలని చూస్తుందా.. మంచి పని చేశాడని మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కమల్, శ్రీకర్లు సీరియస్ అవుతారు. అవని వదిన ఏం పాపం చేసింది అన్నయ్య మీరెందుకు అవని వదిన జాబ్ అయ్యేలా చేశారు ఆమె బతుకేదో ఆమె బతుకుతుంది కదా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీకర్ నిలదీస్తాడు. ఓ ఇప్పుడు మీరందరూ నన్ను నిలదీసే వాళ్ళే అయ్యారా అంటూ అక్షయ్ కూడా వాళ్లకి ధీటుగా సమాధానం చెప్తాడు.. మొత్తానికి అవని జాబ్ అవడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మధ్యలో పల్లవి కలగజేసుకొని అవని అక్క జాబ్ పోవడం ఎంతవరకు కరెక్ట్ బావగారు మీరు చేసింది ముమ్మాటికీ తప్పే అని అంటుంది.
తన బ్రతికేదో తన బ్రతుకుతుంది కదా ఇంట్లో వాళ్ళను కూడా తనే చూసుకుంటుంది కదా అలాంటప్పుడు మీరు తన జాబ్ పోయేలా చేయడం తప్పు బావ గారు అని పల్లవి అంటుంది.. ఇప్పుడు తన జాబ్ పోయింది కదా.. మీ వల్లే జాబ్ అయిందని కోపంతో ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఏడ్చాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అవని అక్క అంటూ పల్లవి అంటుంది. అప్పుడే ఇంట్లోకి చక్రధర్ ఎంట్రీ ఇస్తాడు. ఇది నిజం.. కూతురు పల్లవి అన్నది అక్షరాల నిజం అంటూ చక్రధర్ ఇంట్లో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అవని జాబ్ పోయిందన్న కోపంతో ఇంట్లో వాళ్ళని ఏమైనా చేయొచ్చు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు.
చక్రధర్ మాటలు విన్న కమల్ సీరియస్ అవుతాడు. వదిన గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు రా అంటూ చక్రధర్ ని తిడతాడు. ఇంకా కోపం ఎక్కువయి కొడతాడు కూడా. మా నాన్ననే కొడతావా అని పల్లవి భర్త అని కూడా చూడకుండా కమల్ ని కొడుతుంది. కమల్ నన్నే కొడతావా అని పల్లవిని కొట్టబోతుంటే అక్షయ్ అడ్డుపడి ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం తప్పు అని వాదిస్తాడు. పార్వతి పల్లవి నువ్వు చేసింది తప్పు భర్తని ఎవరైనా కొడతారా అంటూ అరుస్తుంది. నాన్నను కొట్టడం కరెక్టేనా అత్తయ్య గారు అనేసి పల్లవి అంటుంది. మొత్తానికి పల్లవి కమల్ కి సారీ చెప్పడంతో గొడవ సద్దుమనుకుతుంది. చక్రధర్ ఇలాంటి గొడవలుపెడితేనే రేపు మనం ఏం చేసినా కూడా అది అవని అకౌంట్ లోకి వెళ్ళిపోతుందంటూ అంటాడు..
శ్రియ, నా గురించి నువ్వు అసలు పట్టించుకోవట్లేదు శ్రీ అంటూ అడుగుతుంది.. ఏదాని గురించి మాట్లాడుతున్నావ్? ఎందుకు మాట్లాడుతున్నావ్అ?ని శ్రీకర్ అడుగుతాడు.. ఇంట్లో అవని అక్క తర్వాత ఆ స్థానం నాదే కదా.. మరి అత్తయ్య గారు ఎందుకు పల్లవికి అధికారం ఇచ్చారు అంటే నేను ఇంట్లో ఎందుకు పనికిరానా? అని భర్తతో గొడవ పెట్టుకుంటుంది. ఈ అధికరాలు హక్కుల గురించి నేను అత్తయ్య గారితోనే తేల్చుకుంటాను అని శ్రియ అంటుంది.. అటు అవనికి జాబ్ ఉంది ఇంటర్వ్యూ కి వెళ్ళాలని రాజేంద్రప్రసాద్ తీసుకొని వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..