Krishna Birth anniversary: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన అతి తక్కువ మంది హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ(Krishna ) ప్రథమ స్థానంలో ఉంటారు. తన అద్భుతమైన నటనతోనే కాదు నిర్మాణంతో కూడా పేరు సొంతం చేసుకున్నారు.. హాలీవుడ్ సినిమాలను కూడా తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఈయనకే సాధ్యం. ఇకపోతే ఈరోజు ఈయన జయంతి. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆస్ట్రేలియాలో అలాంటి అరుదైన ఘనత కృష్ణకే సాధ్యమైంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
నటుడిగానే రాజకీయ నాయకులు కూడా..
వీర రాఘవయ్య – నాగరత్నం దంపతులకు శివ రామకృష్ణమూర్తి అనే అబ్బాయి జన్మించాడు. అయితే ఆ అబ్బాయి సినిమాల్లోకి వచ్చిన తర్వాత దర్శకుడు ఆదుర్తి.. కృష్ణగా పేరు మార్చారు. కృష్ణ నటుడు, దర్శకుడు, నిర్మాత గానే కాకుండా రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. ఏలూరు నుంచి ఎంపీగా గెలిచిన రాజీవ్ గాంధీ మరణంతో ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమై.. సినిమాల పైన ఫోకస్ పెట్టారు. నిజానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో కూడా కృష్ణకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే మొత్తం తన సినీ కెరియర్లో 16 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన.. 1974లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 1976లో కేంద్ర కార్మిక శాఖ నటశేఖర అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. 1997లో ఫిలింఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కూడా కృష్ణకి లభించింది.
ఆస్ట్రేలియాలో అలాంటి అరుదైన గౌరవం అందుకున్న కృష్ణ..
ఇక అంతే కాదు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సంవత్సరంలో కూడా కృష్ణకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించగా.. కృష్ణ పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసింది. ఇలా పక్క దేశంలో ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న నటుడిగా కృష్ణ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే కృష్ణ సినీ నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా పలు సేవలు అందించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన ఆయన.. 1984లో రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి చేరి.. 1989 లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడే ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో అవి సద్దుమణిగాయి అనే వార్తలు వచ్చాయి కానీ వాటిపై స్పష్టత లేదు. ఒక కృష్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన మేనమామ కూతురైన ఇంద్రాదేవితో 1962 లోనే వివాహం జరిగింది. వివాహం తర్వాత మహేష్ బాబు(Maheshbabu ), రమేష్ బాబు(Rameshbabu )అనే ఇద్దరు కొడుకులతోపాటు పద్మావతి ,మంజుల, ప్రియదర్శిని అనే ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. ఇందిరాతో వివాహమైన నాలుగేళ్లకు 1969లో విజయనిర్మల(Vijay Nirmala)తో కృష్ణ రెండో వివాహం జరిగింది. దాదాపు ఆమెతో కలిసి 48 సినిమాలలో నటించారు. ఇక విజయనిర్మలకి కృష్ణతో కంటే ముందే వివాహం జరగగా.. మొదటి భర్తతో వీకే నరేష్ జన్మించారు.