Intinti Ramayanam Today Episode November 15th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… భరత్ ప్రణవి చున్నీని తీసుకున్నాడని అక్షయ్ కోపంతో కొడతాడు. అంతేకాదు కోపంతో వాడికి బుద్ది చెప్పాలని పోలీసులకు అప్పగిస్తారు. ఇక అవని తన తమ్ముడు అలాంటి వాడు కాదని చెప్పిన వినడు. భరత్ తో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఇక అవని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫీల్ అవుతుంది. వాడికి ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష పడాలని కమలంటాడు అది విన్న అవని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పార్వతి అబ్బాయి అవనితో పాటు అనాధాశ్రమంలో పెరిగాడు అందుకే బాధపడుతుందని అంటుంది. దానికి అక్షయ్ బాధపడితే బాధపడనివ్వు వాడు చేసిన పనికి ఏమనాలి అని అక్షయ్ కోప్పడతాడు. ప్రణవి ఇదంతా మర్చిపో ఇలా జరిగినందుకు బాధపడకు వాడిని ఇంకా ఇప్పట్లో వదలరు పోలీసులు అని అంటాడు.. అవని ఒక్కటే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్క నీ తమ్ముడిని కాలర్ పట్టుకుని అందరూ కొట్టి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అంటే నీవు చెప్పిన మాట కూడా వినట్లేదని అర్థం చేసుకో అక్క ఇంట్లో వాళ్ళకి నువ్వేంటోనీ విలువెంటో అని వార్నింగ్ ఇస్తుంది. ఒకప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు ఇప్పుడు నువ్వు వినట్లేదు అంటే ఇక నీ విలువెంటో ఇంట్లో అర్థం చేసుకో అనేసి పల్లవి అంటుంది. దానికి పల్లవికి అవని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భరత్ను స్టేషన్లో పెట్టడంతో అవని ఫీలవుతూ ఉంటుంది. తమ్ముడు లేకపోతే అమ్మ టెన్షన్ పడుతుంది వాడు ఇలా జైల్లో ఉన్నాడని తెలిస్తే ఇంక అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుందని అదే ఆలోచనలతో ఉంటుంది. ఇక ఉదయం లేవగానే భరత్ను విడిపించడానికి పోలీస్ స్టేషన్కు వెళుతుంది. లాయర్ తో మాట్లాడి భరత్ కు బెయిల్ ఇప్పిస్తుంది. భరత్ ని రిలీజ్ చేస్తారు పోలీసులు. అక్క నన్ను ఎందుకు విడిపించావు నా తప్పు లేదన్న మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలేదు నిన్ను ఏమైనా అంటారు నీకు కాపురం ఏదైనా అవుతుంది అంటే నా వాళ్ల గురించి నాకు తెలుసులే అని భరత్ ను హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తుంది.. ఇక అవని సైలెంట్గా ఇంట్లోకి వస్తుంది. ఎదురుగా అక్షయ్ వస్తుంటే చూసుకోకుండా ఇద్దరు డ్యాష్ ఇచ్చుకుంటారు. వాళ్ళ ఫోజులు చూసి పల్లవి కుళ్ళుకుంటుంది.
ఈ ఫోజు యాక్సిడెంటల్ గా వచ్చిందా లేక కావాలనే ఉన్నారా వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేక పోతున్నాను మళ్ళీ దూరం పెంచాలని ప్లాన్ చేస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను టైం అయింది వదిలేయమంటావా అని అక్షయ్ అవనిని అడుగుతాడు. అయ్యో అవునా నేను బాక్స్ పెడతాను ఆగండి అనేసి అంటుంది. నువ్వు బయటికి వెళ్లి వచ్చావా ఎక్కడికి వెళ్లి వస్తున్నావంటే హౌటోస్ కి వెళ్లి వస్తున్నానండి. అక్కడ పని మనిషిని క్లీన్ చేయమని చెప్పాను సరిగా క్లీన్ చేసిందో లేదో చూసేసి వస్తున్నాను అని అబద్ధం చెప్తుంది. నీకు ఇప్పుడే చిటికెలో క్యారేజ్ కట్టేసి తీసుకొస్తానని వంట గదిలోకి వెళ్తుంది. క్యారేజ్ కట్టడం అయిపోతున్న సమయంలో పల్లవి కాల్ చేస్తుంది. కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో పల్లవి ఎవరు అని ఆలోచిస్తుంటుంది ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతానని బయటకు వెళ్తుంది.
వీరిద్దరి మధ్య ఇంకా దూరం పెంచాలి వీళ్లిద్దరు సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని పల్లవి క్యారేజ్లో ఉప్పు కారం ఎక్కువ వేసి కడుతుంది. బయటికి వెళ్లి వచ్చినా అవని అది గమనించకుండా బాక్స్ ని సెట్ చేసి పెడుతుంది. ఇక అక్షయ్ అమ్మ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అనేసి అంటాడు. అవనీకి చెప్పానురా బాక్స్ పెట్టేసింది అని పార్వతి అంటుంది. ఈ బాక్స్ తీసుకుని వెళ్ళు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అవని అక్షయ మధ్య దూరం ఇంకాస్త పెరుగుతుందని పల్లవి మనసులో అనుకుంటుంది. ఆఫీస్ కెళ్ళి నాకు చేయి డైనింగ్ హాల్ ని ఓపెన్ చేస్తాడు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అక్షయ్ అంటాడు. ఇక కమల్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు. ఆఫీస్ కి ఎక్కట్టాలని దొంగ నాటకాలు వేసి నాకు కాఫీ మీద సాకు పెట్టావు కదా అనేసి అడుగుతుంది. ఈ విషయాన్ని నాన్నకు చెప్తానంటే నీ గురించి కూడా నేను నాన్నకు చెప్తానని కమలంటాడు.
ఇక ఇంటికి చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. కూతురు నెలతప్పడంతో ప్రతిసారి చూడాలనిపిస్తుందని పార్వతితో రాజేశ్వరి అంటుంది. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. పల్లవిని మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తుంది రాజేశ్వరి. మీకు ఈ కడుపు ఇష్టం లేదనుకొని అనుకుంటున్నాను ఎవరికీ తెలియకుండా అబార్షన్ లాంటివి చేయించుకోవాలి అనుకోకు నువ్వు మీ నాన్న చేసే ప్లాను నాకు తెలివి అనుకోవద్దు అని అడుగుతుంది. దానికి పల్లవి షాక్ అవుతుంది.అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…