Nbk Daaku Maharaaj: కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత రచయితగా కూడా మంచి గుర్తింపును సాధించుకొని పవర్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బాబి. అయితే రవితేజ హీరోగా చేసిన ఈ పవర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం బాబీకి దక్కింది. అయితే బాబీకి తన సొంత కథను పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం రాలేదు. పవన్ కళ్యాణ్ రాసి కథను సినిమాగా చేసే అవకాశం వచ్చింది. జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పెన్ను పట్టుకుని రాసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కు గురైంది.
పవన్ కళ్యాణ్ తో పడిన ఫ్లాప్ ను ఎన్టీఆర్ భర్తీ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత బాబీకి ఎన్టీఆర్ తనతో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాను చేశాడు బాబి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ లో పరిపూర్ణమైన నటుడిని మూడు పాత్రల్లో బయటకు తీసాడు బాబి. ఇంకా గతేడాది సంక్రాంతి కానుక రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి మెగాస్టార్ చిరంజీవికి మాస్ కం బ్యాక్ అయింది. ఇక ప్రస్తుతం బాబి బాలకృష్ణ నటిస్తున్న 109 వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Also Read : Ram Charan: రాయలసీమకి గ్లోబల్ స్టార్.. కారణం తెలిస్తే క్యూ కడతారంతే..!
టీజర్ మొదటి నుంచి చివరి వరకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ టీజర్ లో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. “ఈ కథ వెలుగును పంచె దేవుళ్లది కాదు, చీకటిని శాసించే రాక్షసులుది కాదు, ఆ రాక్షసులను ఆడించే రాబందుదే కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది” అని దర్శకుడు బాబి వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ టీజర్ లో బాలకృష్ణను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ చేసే డ్యూటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అది మరోసారి ఈ టీజర్ తో ప్రూవ్ అయింది. ఈ సినిమాకు డాకు మహారాజు అనే టైటిల్ ని ఫిక్స్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా టీజర్ లో ప్రకటించింది చిత్ర యూనిట్.