Intinti Ramayanam Today Episode November 22nd: పల్లవి గురించి జడ్జికి ఎంత చెప్పాలని చూసినా సరే పల్లవి మాత్రం తనదే న్యాయం తన వాళ్ళందరూ తనకి అన్యాయం చేస్తున్నారు అని క్రియేట్ చేస్తుంది. అమాయకపు నటనకి కోర్టు జడ్జ్ పడిపోతాడు. ఈమె నిజంగానే అమాయకురాలు ఈమె భర్త ఏమని టార్చర్ చేస్తున్నాడు అని ఒక నిర్ణయానికి వస్తాడు. పల్లవి చెప్పిన మాటలకి కమలిచ్చిన సమాధానం చూసి జడ్జి కూడా పల్లవి నిజంగానే గ్రేట్ అంటూ అనుకుంటాడు. పల్లవి చెప్తున్నా మాటలు విని కమల్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. తను నాకొద్దు నా జీవితంలో నుంచి తను వెళ్ళిపోవాలి అని గట్టిగా అరవడంతో ఇది కోర్ట్ అనుకుంటున్నవా మీ ఇల్లు అనుకుంటున్నావా? అలా అరుస్తున్నావని జడ్జ్ అంటాడు. మొత్తానికి పల్లవి మాటలను నమ్మిన జడ్జ్ పల్లవికి ఎలాగైనా సరే న్యాయం చేయాలని అనుకుంటాడు. కమల్ ఇంకొకసారి పల్లవి పై అరిస్తే మాత్రం తనకి పోలీస్ స్టైల్ లో మర్యాదలు చేయాల్సి వస్తుంది అని జడ్జ్ ఆదేశిస్తాడు.
జడ్జ్ గారు మా ఆయన చాలా మంచోడు అమాయకుడు. కానీ ఇవ్వాళ వొదిన అంటే చాలా గౌరవం ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాడు అంటూ పల్లవి అనడంతో అవన్నీ షాక్ అవుతుంది. ఎలాగైనా సరే పల్లవి ఆ ఇంటికి రాకూడదని కమల్ అనుకుంటూ ఉంటాడు కానీ అవనీని విలన్ గా చేసి పల్లవి చూపించడంతో చర్చి నిజంగానే తన తోడికోడలు నిజంగా శాడిస్ట్ అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ తర్వాత పల్లవికి కచ్చితంగా న్యాయం చేయాలి అని కోర్టు తీర్పు ఇవ్వాలని అనుకుంటాడు. నా భర్తను మార్చుకునే ప్రయత్నం నేను చేస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని పల్లవి అడగగానే ఇక జడ్జి కూడా ఏమీ కాదనకుండా తనకి ఒక అవకాశం ఇస్తాడు.. మళ్లీ పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది అని తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి షాక్ లో ఉండిపోతారు. ఇక పల్లవి కమల్ కలిసి ఉండడానికి జడ్జ్ అన్ని ఏర్పాట్లు చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు..
పల్లవి కేసు గెలిచింది అని తెలుసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు.. నెల రోజులు పల్లవి ఇక్కడే ఉంటుంది అంటే కచ్చితంగా ఇంకేదైనా సమస్యలు తెచ్చి పెడుతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు . పల్లవి ఏదో పక్కా ప్లాన్ తో నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం తన నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. మళ్లీ ఇంట్లో అడుగుపెడితే ఇంకా ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి. అని అందరూ బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటారు. కానీ కమల్ మాత్రం మీరు ఏమీ భయపడకండి దాని గురించి మనకు తెలుసు కదా దాని నుంచి దూరంగా ఉండి ఎందుకు ప్రయత్నాలు చేద్దాము అని అనుకుంటారు.
అవని దగ్గరకొచ్చిన అక్షయ్ పల్లవి మళ్లీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అంటే ఏదో పక్కా ప్లాన్ ప్రకారం చేస్తుంది అని అర్థమవుతుంది. మరి పల్లవిని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి వాటి గురించి ఆలోచించాలి కదా అని అవని దగ్గర అడుగుతాడు. మీ చెల్లెలు మళ్లీ ఇంటికి వస్తుందా నువ్వు సంతోషంగా ఉన్నట్లు ఉన్నావు కానీ పల్లవి వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఎన్ని అనర్ధాలు జరుగుతాయని నాకు భయంగా ఉంది అవని అని అక్షయ్ అంటాడు. అయితే పల్లవి ఎలాగైనా సరే తనని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి పల్లవిడ్ని ముందే తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయం నువ్వు నాకు సాయం చేయాలని అక్షయ అవనీని అడుగుతాడు. ఇది నా కుటుంబం అండి నేను నా కుటుంబం కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని అవని అంటుంది..
ఇక తర్వాత రోజు బయట ఏదో బాంబుల సౌండ్ వినిపించడంతో అందరూ కంగారు పడిపోతూ అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ మొత్తం బాంబులు పేలుస్తూ కనిపించడంతో ఏంటబ్బా అని అందరూ చూస్తూ ఉండిపోతారు కానీ ఆ బాంబులం పొగలోంచి పల్లవి అలా నడుచుకుంటూ వస్తుంది. రానున్నావు రాలేను అన్నావు ఎలా ఉంది మన గ్రాండ్ ఎంట్రీ అని పల్లవి అవనితో అంటుంది అయితే పల్లవిని అలా చూస్తున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..