E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: శోభనం కోసం ఇందును నందు రెడీ చేస్తుంది. ఇద్దరి మధ్య వెంకీ గురించి చర్చ జరుగుతుంది. వెంకీ నీతో ఎలా వేగుతాడో ఏంటో అని ఇందు అంటే.. వేగకపోతే నేనే వేయించుకు తింటాను అక్కా అంటూ చెప్తుంది.  అప్పుడే ఆ రూంలోకి అపర్ణ వెళ్తుంది. ఏంటే ఏం వేయించుకుతింటావే అని అడుగుతుంది. అందుకు నందు పల్లీలు నాన్నమ్మ అని చెప్పగానే.. నాన్నమ్మ ఇందాకటి నుంచి ఇది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది అని ఇందు చెప్పగానే.. నేనేం అనలేదు అక్కే ఈ నగలు వేసుకోమంటే వద్దు అంటుంది అని నందు చెప్పగానే.. అపర్ణ నవ్వుతూ ఉండనివమ్మా లోపలికి వెళ్లాక ఎలాగూ వాటితో పని ఉండదు కదా అంటుంది.

అందుకు ఇందు నాన్నమ్మ  నువ్వు కూడానా..? ఇది కూడా వచ్చినప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతుంది అయినా నాకు అంత బంగారం ఏమీ వద్దు నాకు చాలా చిరాకుగా ఉంటుంది అంటూ ఇందు చెబితే.. అక్కా ఆ నగలు తీసేయ్‌.. ఆ చీర కూడా తీసేసి నైటీ మీద వెళ్లు బావకు కూడా స్పెషల్ గా అనిపిస్తుంది అంటూ నందు చెప్పగానే.. నాన్నమ్మ చూశావా..? ఎలా మాట్లాడుతుందో అంటూ చెప్పగానే.. అపర్ణ ఏం మాట్లాడుతున్నావే అంటే నేనేం మాట్లాడలేదు నాన్నమ్మ చిన్న పిల్లను అంటూ చెప్తుంటే.. ఏంటి నువ్వు చిన్న పిల్లవా..? ఏది ఇటు రా అంటూ నందును దగ్గరకు పిలిచి చెవి పట్టుకుని గిల్లుతుంది. అపర్ణ వదలవే.. ఇలాంటివి ఏమైనా ఉంటే లోపల ఉన్నాడు కదా మీ ఆయన ఆయనతో చూపించుకో అంటుంది.

Advertisement

ఇందు నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు అంటుంది. నందును అక్కడి నుంచి పంపిచేస్తుంది. ఎందుకే దాన్ని అలా పంపించేశావు సరే ఈ నగలు పెట్టుకో కుందనపు బొమ్మలా ఉంటావు అంటూ నగలు పెట్టి చూడు ఎంత ముద్దుగా ఉన్నావో…? నీకు నా దిష్టే తగిలేలా ఉంది. నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే.. ఇన్నేళ్లుగా నా గుండెల్లో దాచుకున్న బాధంతా పటాపంచలు అయిపోయినట్టు ఉంది. ఇన్నాళ్లు నువ్వు రేఖ ఆగడాలకు బలైపోతావో అని భయపడ్డాను..కానీ రాజు వచ్చాక నా చిలుకమ్మకు రెక్కలు వచ్చాయి నేను ఊపిరి పీల్చుకున్నాను అంటే.. ఇందు కూడా ఎమోషనల్‌ అవుతూ నాన్నమ్మ మనందరికీ కొత్త ఊపిరి పోయడానికే దేవుడు బావను ఇక్కడకు చేర్చాడు అని చెప్తుంది. అవును ఇందు.. మీరిద్దరూ ఇలాగే నిండు నూరేళ్ల సుఖంగా సంతోసంగా పిల్లాపాపలతో బతకాలి అంటూ దీవిస్తుంది.

మరోవైపు రూంలో రెడీ అవుతున్న రాజు దగ్గరకు శేషు వెళ్తాడు. శేషును చూసిన రాజు ఇదేంటి మామ చికాకు పెడుతుంది. సీరియల్‌ అత్త కన్నా ఎక్కువగా రాచి రంపాన పెడుతుంది అంటూ తను కట్టుకునే పంచె గురించి చెప్తుంటే.. అల్లుడు నువ్వేదో కొండను తవ్వి భుజాల మీద మోస్తున్నట్టు ఎందుకు అలా ఫీల్‌ అవుతున్నావు నేను సెట్‌ చేస్తాను కదా వెయిట్‌ అండ్ సీ అంటూ శేషు సెట్‌ చేయబోతుంటే.. ఒక్కసారికే నన్ను ఇంత ఇబ్బంది పెడితే పాపం ఆ కాలంలో మన మగాళ్లంతా ఎంత ఇబ్బంది పడేవారో ఏమో అంటాడు రాజు. అంత లేదు అల్లుడు గోచి రోజు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోతుంది అంటూ శేషు చెప్తుంటే.. రాజు మౌనంగా ఇందు ఏం చేస్తుందో అన్నట్టు ఆలోచిస్తుంటాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

హీరో బాలయ్య పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Big Stories

Advertisement
×