Podarillu Today Episode November 22nd: మాధవ్ ఎంత చెప్పినా సరే వీళ్ళు వినట్లేదు వీళ్ళ జీవితం వేలే ఇష్టమని అనుకుంటాడు. ఇక చక్రి సడన్గా ఇంటికి రాగానే టీ తాగుతూ కనిపిస్తాడు. అరే నీకు టీ పెట్టుకోవడం కూడా వచ్చా. నువ్వు ఎందుకు అప్పుడే టీ పెట్టుకుని తాగుతున్నావా నాకు కూడా టీ కావాలి అని చక్రి ఆలోచిస్తూ అడుగుతాడు. అయితే నేనేం పెట్టుకోలేదు అన్నయ్య పెట్టాడు అని చెప్పగానే అన్నయ్య అప్పుడే వచ్చేసాడా ఏంటి అని చక్రి డౌట్ పడతాడు. అయితే అప్పుడే స్నానం కూడా చేసి రావడం చూసినా చక్రి ఏంటయ్యా అప్పుడే వచ్చేసావ్ ఎక్కడికైనా వెళ్తున్నావా స్నానం కూడా చేశావు అని అడుగుతాడు. అయితే మాధవ్ మాత్రం ఇంట్లోకి రాదని ఏదో ఒక సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు కానీ చక్రి వాళ్ళకి అనుమానం మొదలవుతుంది. నిజంగానే వాళ్ళిద్దరూ మాధవ్ పై డౌటుతో తనని ఫాలో అవ్వాలని అనుకుంటారు మాధవి రెడీ అయ్యి చాలా స్మార్ట్గా తయారయ్యి వెళ్ళిపోతాడు.
పని ఉంది సైట్ ఇంజనీర్ మనవరాలు కొమ్మలు కొట్టే ఫంక్షన్ అది ఇది అని అబద్ధం చెప్పాడు అన్నయ్య అని చక్రి కన్ఫామ్ చేసుకుంటాడు. ఎలాగైనా సరే అన్నయ్య మనీషా దగ్గరకి వెళ్తున్నాడని అర్థం ఉంది. కచ్చితంగా మనీషా దగ్గరే అన్నయ్య ఉంటాడు అని ఆలోచిస్తూ చక్రి అలాగే కన్నా ఇద్దరూ కూడా మనిష వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అన్నయ్య ఇంకా రాలేదేంటి మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా లేదా అన్నయ్య రావడానికి టైం పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చక్రి మాత్రం అన్నయ్య సైకిల్ మీద వస్తున్నారు కదా.. కాస్త నిదానంగానే వస్తాడు అని అనగానే అప్పుడే మాధవ్ అక్కడ సడన్గా ప్రత్యక్షమవడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మాధవ్ రాగానే సిగ్గు పడిపోతూ మనిషా దగ్గరికి వెళ్తాడు అది చూసినా ఇద్దరు తమ్ముళ్లు కూడా అన్నయ్య ఇంత ముదిరిపోతాడని అస్సలు ఊహించలేదని అనుకుంటారు..
ఇక మాధవ్ పని నుంచి తొందరగా వచ్చి మనిష దగ్గరికి వెళ్తాడు. అయితే లోపల మనిషా మాధవ్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చక్కరి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మాధవ్ మాత్రం లోపల ఏం చేస్తున్నాడో తెలియలేదు అని చక్రి వినాలి అని ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు అయితే లోపల వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక చక్రి అయోమయంలో ఉండిపోతాడు. కానీ లోపల మాధవ్ మాత్రం మనీషా పెట్టిన టీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మసాలా టీ ఎలా పెట్టాలో అని నేర్చుకుంటాడు.. ఆ టీ గురించి తెలుసుకొని వెంటనే మా ఇంట్లో కూడా ఇలాంటి టీనే నేను ప్రిపేర్ చేస్తాను అని మాధవ్ అంటాడు. ఇక ఆ టీ గురించి తర్వాత తెలుసుకుంటాను అని మాధవ్ మనిషా ఇద్దరూ కూడా బయటకు వెళ్లాలని అనుకుంటారు అయితే స్టైలిష్ లుక్ లో మాధవ్ బయటికి రావడం చూసి వాళ్ళ తమ్ముళ్లు షాక్ అవుతారు. అన్నయ్య ఇంత ముదిరిపోతాడు అని అస్స ఊహించలేదని కంగారు పడిపోతూ ఉంటారు. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టాలి అని ఇద్దరు ఫాలో అవుతూ వెళ్తారు.
మహాలక్ష్మి చక్రీ అన్న మాటల్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక చక్రి తనకు విడాకులు ఇస్తాను అని అనడం తలుచుకొని తను అయోమయంలో ఉండిపోతుంది.. అసలు ఎందుకు చక్రి ఇలా అంటున్నాడు. ఏం జరిగింది నేనంటే ఇష్టం లేదా ఇన్ని రోజులు నేనంటే ఇష్టం అని నా వెనకాల పడ్డాడు కదా.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు అంటూ ఆలోచిస్తూ ఒకచోట గుంతలో కి బండిని పంపించి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాలక్ష్మిని పైకి లేపి ఏమైంది అమ్మ అని అడుగుతున్నా సరే ఏం కాలేదండీ పరవాలేదు నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఇంటికి రాగానే నారాయణ చాలా సంతోషంగా తనకి టీ పెట్టి ఇవ్వాలని అనుకుంటాడు. మహాలక్ష్మి మాత్రం ఏదో ఆలోచనలో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..