Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు హైదరాబాద్‌లోనే ఉన్నాడన్న విషయం అమర్‌కు తెలిసిపోతుంది. పైగా అమర్ హైదరాబాద్‌లో ఉన్న విషయం మనోహరికి కూడా తెలుసన్న నిజం కూడా అమర్‌కు తెలియగానే.. కోపంతో ఇంటికి వెళ్తాడు. అమర్ ఇంటికి వెళ్లగానే.. హాల్లో కూర్చన్న మంగళ రండి అల్లుడు గారు మీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అంటుంది. అదేమీ అమర్ పట్టించుకోకుండా కోపంగా హాల్లోకి వెళ్లి మిస్సమ్మ, మనోహరిలను పిలుస్తాడు. అమర్ కేకలు వేయడంతో అందరూ వస్తారు. అమర్ కోపంగా చూస్తుంటే..
మిస్సమ్మ ఏమైందండి ఎందుకు అంత గట్టిగా కేకలు వేశారు అంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది. నాకు తెలియకుండా మీరంతా ఏం చేస్తున్నారు అంటూ అమర్ అడిగితే.. మంగళ భయంతో తాను పార్థు ఫోటో చూసిన విషయం అమర్ కు తెలికసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటుంది. అమర్ కోపంగా అసలు మీరంతా ఇంట్లో ఏం చేస్తున్నారు అంటూ మళ్లీ అడిగితే.. మంగళ భయంగా అయ్యో నేను భాగీతో చికెన్, మటన్ చేయించుకున్న విషయం తెలిసిపోయిందా..? అని భయపడుతుంది. మనోహరి మాత్రం నీకు తెలియకుండా మేమేం చేస్తాము అమర్ అని అడిగితే.. నీకు పార్థు హైదరాబాద్‌లోనే ఉన్నాడన్న విషయం తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు మనోహరి అంటూ అమర్ అడిగితే.. అందరూ షాక్ అవుతారు. మనోహరి భయంతో వణికిపోతుంది. చంభా భయపడుతూ మెల్లగా మనోహరికి దగ్గరగా జరిగి మనోహరి ఇక ఇంట్లోంచి వెళ్లిపో అడ్డంగా బుక్కయ్యావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో అంటూ చెప్పగానే..
అమర్ చెప్పు మనోహరి పార్థు హైదరాబాద్‌లోనే ఉన్నాడన్న విషయం తెలిసినా మాకెందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తుంటే.. ఏం చెప్పాలో అర్థం కాక మనోహరి ఏడుస్తుంది. ఎలా చెప్పాలి అమర్ ఇప్పటికే మీరు నాకోసం చాలా చేశారు. కేవలం ఆరుకు ఫ్రెండ్ అన్న ఒకే ఒక్క కారణంతో నా పెళ్లి చేయాలనుకున్నారు. నా బాగొగుల గురించి ఆలోచించారు. పార్థుకు నాకు పెళ్లి చేశారు. మీరు ఇంత చేసినా నా కర్మ ఇలా ఉంది. ఇంకా మీకు నా బాధలు కష్టాలు చెప్పి ఇబ్బంది పెట్టకూడదని చెప్పలేదు అమర్ అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది మనోహరి. రాథోడ్ కోపంగా అబ్బా మనోహరి.. ఏం యాక్టింగ్ చేస్తున్నావు.. మిస్సమ్మ.. ఈసారి కూడా దొరికినట్టే దొరికి తప్పించుకుంది ఏం యాక్టింగ్ చేస్తుందో చూడు అంటాడు. మిస్సమ్మ కూడా అవును రాథోడ్ చాలా తెలివిగా మాట్లాడి ఎస్కేప్ అవుతుంది అంటుంది.
అమర్ మాత్రం అదేంటి మనోహరి నువ్వేం పరాయిదానివి కాదు కదా… ఈ ఇంట్లో నువ్వు ఒక దానివి మాకు ఆరు ఎంతో నువ్వు అంతే కదా నువ్వు పరాయిదానివి కాదు అంటాడు. అమర్ మాటలకు చంభా అబ్బా సార్‌లో ఉన్న ఈ వీక్‌నెస్‌ను ఆధారం చేసుకుని మనోహరి భలే ఎస్కేప్ అవుతుంది అని మనసులో అనుకుంటుంది. మనోహరి మాత్రం నాకు తెలుసు అమర్ మిమ్మల్ని అడిగితే కాదనరు మీరు నాకోసం ఏమైనా చేస్తారు. కానీ నాకే ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగాలనిపించలేదు అని చెప్పగానే.. ఇబ్బంది ఏమీ లేదు మనోహరి మేమంతా నీ మంచి కోరే వాళ్లం నీకోసం ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉంటాము అంటూ అమర్ చెప్తుంటే.. మనోహరి ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.