Intinti Ramayanam Today Episode November 22th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ భరత్ ను విడిపించిందని అవని పై సీరియస్ అవుతాడు. నా ఇంట్లో నా మాట వినకుండా ఉంటే అవసరం లేదు. నా పెద్దరికంకు ఇచ్చే మర్యాద ఇదేనా అని నానా రచ్చ చేస్తాడు. నాకు తప్పు చేసిన నా నిర్ణయాన్ని దిక్కరించిన నాకు నచ్చదు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఇక కోపంగా నా కూతుర్ని ఏడిపించారని ఆ వెధవల్ని నేను పోలీసులు అప్పగిస్తే అవని వాళ్ళ వాడిని విడిపించిందని 24 గంటలే ఇస్తాడు. ఆ భరత్ తప్పేమి లేదని నిరూపించలేకుంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని చెప్తాడు. హాస్పిటల్ కు వెళ్లిన అవని భరత్ ను అడిగి నిజం తెలుసుకుంటుంది. ఇక పల్లవి ఇదంతా చేసిందని నిజం తెలుసుకుంది. ఇక ఎలాగైనా బయట పెట్టాలని అనుకుంటుంది. ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన అవనిని పార్వతి అడుగుతుంది. ఇక ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పార్వతి ఈయన పెట్టిన గడువులో అవని భరత్ తప్పేమని లేదని నిరూపిస్తుందో లేదో అని అనుకుంటుంది. బామ్మ వేసే సెటైర్లకు కమల్ కౌంటర్లు ఇస్తాడు. వదిన మహారాణి లాంటిది తన తప్పుని నిరూపించుకుంటుంది అనేసి అంటాడు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. అవని ఆ దోషులు ఎవరో తెలిసిందా భరత్ తప్పేం లేదని తెలుసుకున్నావు అని అడుగుతుంది. తెలిసింది అత్తయ్య గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయని ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు అక్కడికి వెళ్లి వస్తున్నాను అనేసి అంటుంది. ఆ సీసీ కెమెరాలో ప్రణవి నేర్పించడం వల్ల ఫేసులు ఉంటాయని ఆయన చెప్పడంతో త్వరలోనే వాళ్ళు పట్టుకుంటామని కూడా చెప్పారు అని పార్వతితో అంటుంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందమ్మా అని పార్వతి అంటుంది.. ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. పల్లవి వాళ్ళను దాచిపెడుతుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఈయన గారు ఇచ్చిన టైం అయిపోతుంది మరి ఈయన నిర్ణయం తీసుకుంటాడో అని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవనిని అడుగుతుంది. అవని వాళ్ల గురించి ఏదైనా తెలిసిందా అంటే లేద అత్తయ్య తెలియలేదు అనేసి అంటుంది. ఆయన ఇచ్చిన టైం అయిపోతుంది ఇంకా తెలియలేదు అంతా వెంటనే టెన్షన్ పడిపోతుంది పార్వతి. ఆయన కిందకు వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నా కాళ్ళు చేతులు ఆడటం లేదని పార్వతి అంటుంది. పార్వతి వాళ్ళ అత్తయ్య ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచించాలి ముందు చేసిన తర్వాత కాదు అని అంటుంది. నీకు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే కమ్మలు నువ్వేంటి నువ్వు ఇలా అంటున్నావ్ అని బామ్మను అరుస్తాడు. ఇక అంతలోకే రాజేంద్రప్రసాద్ కిందకు వస్తాడు. అవని నీకు ఇచ్చిన టైం అయిపోవడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది మరి ఆ భరత్ నిర్దోషిని నిరూపించడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. కానీ అవని ఏం మాట్లాడదు.
పార్వతి మాత్రం ఇదే చివరి తప్పని వదిలేయండి ఇకమీద ఇలాంటివి జరగకుండా చూసుకుంటుంది అనేసి అంటుంది. కానీ పార్వతి మాట కూడా రాజేంద్రప్రసాద్ వినడు. ఇంట్లో తప్పు చేస్తే ఎవరికైనా ఇదే శిక్ష పడుతుంది అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. నీకు కమల్ శ్రీకర్ అన్నయ్య తప్పు చేశాడని ఇంట్లో నుంచి పంపించావు ఇప్పుడు భోజనం తప్పు చేసిందని పంపిస్తున్నావ్ ఇంట్లో ఇలా తప్పు చేసినోళ్ళని పంపిస్తే ఇంట్లో ఎవరు ఉండరు నాన్న అనేసి అంటాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇదే శిక్ష పడుతుంది ఆఖరికి నేను తప్పు చేసిన కూడా నాకు నేను శిక్ష వేసుకుంటానని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక పది నిమిషాలు మాత్రమే ఉంది అవని నువ్వు ఇంట్లో నుంచి వెళ్లడానికి రెడీగా ఉండాలని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. పల్లవి సంతోషంలో మునిగిపోయి ఉంటుంది.
చూడక్క దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి నీ వల్లే అనుకొని నెత్తిన పెట్టుకున్నావ్ అతను తప్పు చేశాడో లేదో తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే నీకే చెడు ఎదురయింది అనేసి పల్లవి క్లాస్ తీసుకుంటుంది. ఉన్న పది నిమిషాలు పల్లవి క్లాస్ తో అయిపోతాయి. ఇక రాజేంద్రప్రసాద్ ఆపు అనేసి పల్లవి నంటాడు. అవని నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇక నువ్వు అనేసి అనగానే చక్రధర్ ఆగండి బావగారు అంటాడు. అవని చేసిన తప్పేమీ లేదు ఆ భరత్ నిజంగా నేను నిర్దోషి అని చెప్తాడు. ప్రణవిని గుళ్లో ఏడిపించిన వాళ్ళు వీళ్లే అనేసి వాళ్ళని లోపలికి రమ్మని చెప్తాడు. పోలీసులు వీళ్ళ గురించి వెతుకుతున్నారు మీరు నాకు చిక్కారనేసి చెప్తాడు. అక్షయ్ మాత్రం చక్రధర్ మీద అనుమానంతో ఉంటాడు. పోలీస్ వెతుకుతున్న వాళ్ళు మీకెలా దొరికారు మావయ్య అనేసి అడుగుతాడు. దానికి చక్రధర్ పల్లవి నాకు ఫోన్ చేసి మామయ్య అవనికి శిక్ష విధించాడు నాన్న అవని అక్కని ఇంట్లో నుంచి పంపించేస్తాడని అన్నాడు అని బాధపడింది. దాంతో నేను ప్రైవేట్ డిటెక్టివ్ వాళ్లకి కాంటాక్ట్ అయ్యాను పోలీసుల కన్నా ముందు వీళ్ళని పట్టించి నాకు ఇచ్చారని అంటాడు. ఆ విషయం తెలుసుకున్న కమల్ అక్షయ్ వాళ్ళని కొట్టడానికి వెళ్తారు.
పోలీసులు వీళ్ళ గురించి వెతుకుతున్నారు ఇప్పుడు మీరు వీళ్లను కొడితే అదొక కేసు అవుతుంది అదొక తలనొప్పి అవుతుంది వీళ్ళని వదిలేసేయని కమల్ ను ఆపుతాడు చక్రధర్. అవని తప్పేమీ లేదని తెలుసుకొని పార్వతీ సంతోషపడుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ మంచి చెడు ఆలోచించకుండా నువ్వు చేయవని తెలుసు కానీ ఇలా విచక్షణంగా నేను ఆలోచించాను నన్ను క్షమించమని అడుగుతాడు. అక్షయ్ అవనికి సారీ చెప్తాడు. ఇక పల్లవి మాత్రం వాళ్ళ డాడీ ఎందుకు ఇలా చేశాడని ఆలోచిస్తూ ఉంటుంది. అవని పల్లవి గురించి తెలుసుకున్న నిజాన్ని చెప్పి షాక్ ఇస్తుంది. పల్లవి నీదంతా చేసిందని ఒక వీడియో ని చూపిస్తుంది. ఇలాంటివి చేసే ముందు ఆలోచించాలని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. మీ ఇంట్లో వాళ్ల గురించి నేను ఇక్కడ చెప్తాను అనేసి అంటుంది. నాకు కావాల్సింది కూడా అదే నువ్వు వెళ్లి చెప్పు అనేసి అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..