Gang Rape In Kadapa : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా ఆడపిల్లలు, మహిళలపై దారుణాలు ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఓ చోట.. అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. అయితే.. దారుణంగా బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు సైతం నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. కడప జిల్లాలో ఓ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నెల రోజుల తర్వాతి.. బాధిత బాలిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రాంతానికి చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. కాగా.. అత్యాచారం ఘటన సమయంలో వీరికి తోడుగా మరో బాలుడు కూడా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక.. తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు.. వీడియో తీసిన నిందితులు.. దాన్ని చూపించి బెదిరించారు. తాము చెప్పినట్లు వినకపోతే.. ఆ వీడియోను అందరికీ చూపిస్తామని, బాలిక ఇంట్లోని తల్లిదండ్రులకు చూపిస్తామని భయపెట్టించారు. దాంతో.. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో.. నిందితులకు లొంగిపోయిన బాలిక వారి చేతిలో అత్యాచారానికి గురైంది.
అత్యాచారానికి పాల్పడిన వారిలో ఉదయ్ కిరణ్ అనే ఓ వ్యక్తి కీలకం కాగా.. మరోకరు మైనర్. వీరిద్దరూ అత్యాాచారానికి పాల్డడగా.. వాళ్లకు తోడుగా వెళ్లిన మరో బాలుడు సైతం ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇన్నాళ్లు బయటకు చెప్పడానికి భయపడిన బాలిక.. ఎట్టకేలకు విషయాన్ని ఇంట్లో చెప్పింది. దాంతో.. బాలిక తండ్రి కడపలోని దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. రూ.2 లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్
ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్ ఆదేశాలతో ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.