E-Paper
Advertisement

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!
Advertisement

Sabarimala Special Trains 2027: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అదిరిపోయే న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో  చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొస్తోంది.  జనవరిలో ఈ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, గుంతకల్, రాయచూర్ మీదుగా వెళ్లే ఈ రైలతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళకు వెళ్లే భక్తులకు ప్రయాణం ఈజీ కానుంది.

జనవరి 18న చర్లపల్లి నుంచి..

ఈ స్పెషల్ రైలు (నంబర్ 07691) చర్లపల్లి-కొల్లాం స్పెషల్ ఎక్స్‌ ప్రెస్ పేరుతో నడవనుంది.  జనవరి 18న సోమవారం సాయంత్రం 5:40 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. జనవరి 20న బుధవారం ఉదయం 6 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (నంబర్ 07692) కొల్లాం-చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ ప్రెస్ పేరుతో జనవరి 20న ఉదయం 9:30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి, జనవరి 21న గురువారం సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఏ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందంటే..

Advertisement

చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు సీతాఫల్‌ మండి, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, రాయచూర్, ఆదోని, మంత్రాలయం రోడ్, అనంతపురం, మదనపల్లె రోడ్, కాట్పాడి, విల్లుపురం, తెన్‌కాశి, పునలూర్, సెంగోట్టై, తిరుచిరాపల్లి, కొట్టారకర స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రెండు ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, 13 స్లీపర్ కోచ్‌లతో పాటు రెండు జనరల్ సీటింగ్ కమ్ లగేజీ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

నాందేడ్ నుంచి మరో ప్రత్యేక రైలు

చర్లపల్లి రైలుతో పాటు నాందేడ్ నుంచి కొల్లంకు కూడా రైల్వే ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. రైలు నంబర్ 07687 నాందేడ్-కొల్లాం స్పెషల్ జనవరి 11 నుంచి 25 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, బుధవారం ఉదయం 6 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07688 కొల్లాం-నాందేడ్ స్పెషల్ ప్రతి బుధవారం ఉదయం 9:30 గంటలకు బయలుదేరి గురువారం రాత్రి 11 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రూట్ లో మొత్తం ఆరు ట్రిప్పులు నడపనున్నారు.

టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే? 

Advertisement

శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణానికి ముందు రైలు నంబర్లు, స్టాపులు, సమయాలు, టికెట్ల గురించి తెలుసుకునేందుకు అధికారిక రైల్వే వెబ్‌ సైట్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుని ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించాలన్నారు.

Read Also: అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

Tags

Related News

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

జపాన్ కోసం అరకు రైల్వే మార్గం? ఈ రైల్వేలైన్ వెనుక ఉన్న అసలు కథ తెలుసా?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

Big Stories

Advertisement
×