Intinti Ramayanam Today Episode November 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ కోసం తన ఫ్రెండు వెయిట్ చేస్తూ ఉంటాడు. ముందు ఇది తీసుకోరా నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటాడు. ఆ భరత్ నీ భార్య తమ్ముడు అని అంటున్నావు కదా వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఎఫైర్ నడుస్తుందని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ తన ఫ్రెండ్ ని కొడతాడు. భార్య గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడుతావా అసలు నీకేం తెలుసు అవని గురించి అని అంటాడు. కొడతావని నేను ఊహించాను కాకపోతే ఈ ఫోటోలను చూడు ఒకసారి అనేసి అంటాడు. పక్కపక్కనే నిల్చుని ఫోటో దిగినంత మాత్రాన ఎఫైర్ అంట కడతావా అనేసి అనగానే అక్షయ్ మరోసారి తనని కొడతాడు. అక్షయ్ మనసులో అనుమానం మొదలవుతుంది. ఇంటికి రాగానే అవనిని నిలదీస్తాడు. భరత్ మీనాక్షి నా తమ్ముడు తల్లి అని నిజం చెబుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది కానీ అక్కడ మీనాక్షి, భరత్ కనిపించరు. అక్షయ్ మాత్రం కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతాడు. మొత్తానికి అతనికి అనుమానం అనేది మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని మీద కోపంతో అవనిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లి తమ్ముడు ఏమయ్యారని టెన్షన్ పడుతూ వెతుకుతుంది.. అక్కడ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ డాక్టర్ని అడుగుతానని బయటకు వస్తుంది. డాక్టర్ చెప్పింది విని షాక్ అవుతుంది అవని షాక్ అవుతుంది. ఈ బంధువులు ఎవరు లేరండి ఈ ఊర్లో నేనే అని చెప్పగానే మిమ్మల్ని నేనెప్పుడూ ఇక్కడ చూడలేదు మీరు ఎవరు అన్నట్టుగా మాట్లాడుతాడు. అది విన్న అక్షయ్ నీ డ్రామాలు ఇంకెంతవరకు ఉంటాయి ఇకనైనా ఆపు అనేసి అంటాడు. నీ హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన అక్షయ్ నిద్రపోతాడు. పక్కనే అవని పడుకో ఉండడం చూసి కోపంతో రగిలిపోతాడు. అవని చెప్పిన అబద్ధం కలుచుకొని కోపంతో రగిలిపోతూ ఎలాగైనా ఈ బాధను మర్చిపోవాలని తాగడానికి బాటిల్ తీసుకుంటాడు. తన గదిలో ర్యాక్ లో ఉన్న బాటిల్ తీసుకొని తాగుతాడు. ఇక కమల్ పెట్టే గురక సౌండ్ కి పల్లవి లేస్తుంది. వీడి గురక సౌండ్ కి నిద్ర కూడా రావట్లేదు అంటూ కమల్ ని తిట్టుకుంటుంది. అటు గదిలో అక్షయ్ తాగడం చూసి అవని ఆపుతుంది. అక్షయ్ నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ అరుస్తాడు.
కానీ అవని మాత్రం నా మీద కోపంతో మీరు తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని అక్షయ్ ని బ్రతిమలాడుతుంది. మాత్రం నాకు తెలియకుండానే నువ్వు వేరే వాడితో వెళ్తున్నావ్. నేను నిన్ను ఎంతగా నమ్మాను కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని తాగుతాడు. నా మీద కోపంతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు అని అవని వాదిస్తుంది. ఇక పల్లవి అవని వాళ్ళ గదిలో పెట్టిన మైక్రోఫోన్ ఆన్ లో ఉందో లేదో అని అసలు అవని అక్షయ్ ఏం చేస్తున్నారో అని వింటుంది. అవని బాధపడడం విని నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాలుగు గోడల మధ్య బాధపడితే ఏముంది అనేసి అనుకుంటుంది పల్లవి.
అటు అవని ఏడుస్తుందని సంతోషపడాలో ఇటు వీడు గురకను తట్టుకోలేక బాధపడాలో అర్థం కావట్లేదు అనేసి పల్లవి అనుకుని ఈ గురకనుంచి బయట పడాలంటే నేను కింద పడుకోవడమే బెస్ట్ అని పల్లవి కింద పడుకుంటుంది. ఇక ఉదయం లేవగానే కమల్ జేమ్స్ బాండ్ గెటప్ లో కిందకు వస్తాడు. భామ్మని పిలుస్తాడు. నేను ఎలా ఉన్నాను అచ్చం జేమ్స్ బాండ్ లాగా ఉన్నాను కదా చెప్పవే ముసలి అని అడుగుతాడు. ఇక ఈ గెటప్ లో ఉన్న నాకు ఫోటోలు తీయమని బామ్మను అడుగుతాడు. దానికి బామ్మ ఫోటోలు తీస్తుంది. ఇన్ని ఫోటోలు ఇన్ని ఫోటోలు నావల్ల కాదు నేను తీయలేను అని అంటుంది. అప్పుడే ఇంటికి వస్తాడు. చక్రధర్ ని చూసిన కమల్ ఇద్దరినీ నువ్వు కిడ్నాప్ చేసి మర్డర్ చేశావు ఈ విషయాన్ని నేను ఒప్పుకో నాకు ఎలా తెలుసుకొని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అది విన్న చక్రధర్ కు చెమటలు. అల్లుడు ఏంటి ఇలా నన్ను అడుగుతున్నాడు కొంపతీసి నిజం తెలిసిపోయిందని చక్రధర్ ఆలోచిస్తుంటాడు.
ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మావయ్యను పట్టుకొని ఏంట్రా మాటలని అరుస్తారు. ఆ గెటప్ ని వెళ్లి వెంటనే మార్చుకోమని చెప్తారు. ఇక కమల్ లోపలికి వెళ్ళిపోతాడు. పల్లవితో మాట్లాడాలని చక్రధర అనగానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పల్లవి డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని రాత్రి జరిగిందంతా చక్రధర్ తో చెప్తుంది. అవని ఆ లెటర్ చదివింది అని తెలుసుకొని చక్రధర్ సంతోషపడతాడు.. అక్షయ్ నిద్ర లేవగానే హంగోర్ ఎక్కువైందని తల పట్టుకుని కూర్చుంటాడు. అవని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అక్షయ్ తాగడు. తల బద్దలై పగిలిపోయిన సరే నీ చేత్తో ఇచ్చిన మజ్జిగను తాగని చెప్తాడు. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి అంతేకానీ మీ మీద మీరు చూపించుకోవడం మంచిది కాదు అనేసి అవని హితవు పలుకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో పల్లవికి అవని ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అబార్షన్ అవుతుంది. మరి అవని తన తప్పు లేదా నిరూపించుకుంటుందా లేదా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..