Intinti Ramayanam Today Episode November 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని మీద కోపంతో అవనిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లి తమ్ముడు ఏమయ్యారని టెన్షన్ పడుతూ వెతుకుతుంది.. చక్రధర్ చెప్పినట్లే డాక్టర్ అంతా చెప్పడంతో షాక్ అవుతుంది. ఆ డాక్టర్ చెప్పింది విన్న అక్షయ్ నీ డ్రామాలు ఇంకెంతవరకు ఉంటాయి ఇకనైనా ఆపు అనేసి అంటాడు. నీ హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన అక్షయ్ నిద్రపోతాడు. పక్కనే అవని పడుకో ఉండడం చూసి కోపంతో రగిలిపోతాడు. అవని చెప్పిన అబద్ధం కలుచుకొని కోపంతో రగిలిపోతూ ఎలాగైనా ఈ బాధను మర్చిపోవాలని తాగడానికి బాటిల్ తీసుకుంటాడు. వీడి గురక సౌండ్ కి నిద్ర కూడా రావట్లేదు అంటూ కమల్ ని తిట్టుకుంటుంది. అటు గదిలో అక్షయ్ తాగడం చూసి అవని ఆపుతుంది. అక్షయ్ నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ అరుస్తాడు. నేను నిన్ను ఎంతగా నమ్మాను కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని తాగుతాడు. నా మీద కోపంతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు అని అవని వాదిస్తుంది. ఇక పల్లవి అవని వాళ్ళ గదిలో పెట్టిన మైక్రోఫోన్ ఆన్ లో ఉందో లేదో అని అసలు అవని అక్షయ్ ఏం చేస్తున్నారో అని వింటుంది. అవని బాధపడడం విని నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాలుగు గోడల మధ్య బాధపడితే ఏముంది అనేసి అనుకుంటుంది పల్లవి. పల్లవి ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ జేమ్స్ బాండ్ గెటప్ లో కిందకు వస్తాడు. భామ్మని పిలుస్తాడు. నేను ఎలా ఉన్నాను అచ్చం జేమ్స్ బాండ్ లాగా ఉన్నాను కదా చెప్పవే ముసలి అని అడుగుతాడు. ఇక ఈ గెటప్ లో ఉన్న నాకు ఫోటోలు తీయమని బామ్మను అడుగుతాడు. దానికి బామ్మ ఫోటోలు తీస్తుంది. ఎన్ని ఫోటోలు తీసాను. ఇక నావల్ల కాదు నేను తీయలేను అని అంటుంది. అప్పుడే ఇంటికి వస్తాడు. చక్రధర్ ని చూసిన కమల్ ఇద్దరినీ నువ్వు కిడ్నాప్ చేసి మర్డర్ చేశావు ఈ విషయాన్ని నేను ఒప్పుకో నాకు ఎలా తెలుసుకొని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అది విన్న చక్రధర్ కు చెమటలు. అల్లుడు ఏంటి ఇలా నన్ను అడుగుతున్నాడు కొంపతీసి నిజం తెలిసిపోయిందని చక్రధర్ ఆలోచిస్తుంటాడు.. మావయ్యను పట్టుకొని ఏంట్రా మాటలని అరుస్తారు. పార్వతి, రాజేంద్ర ప్రసాద్ అరుస్తారు. ఆ గెటప్ ని వెళ్లి వెంటనే మార్చుకోమని చెప్తారు. ఇక కమల్ లోపలికి వెళ్ళిపోతాడు. పల్లవితో మాట్లాడాలని చక్రధర అనగానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పల్లవి వాళ్ళ డాడీని తీసుకొని గార్డెన్ లోకి వెళ్తుంది. పల్లవి డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని రాత్రి జరిగిందంతా చక్రధర్ తో చెప్తుంది. అవని ఆ లెటర్ చదివింది అని తెలుసుకొని చక్రధర్ సంతోషపడతాడు.. అక్షయ్ నిద్ర లేవగానే హంగోర్ ఎక్కువైందని తల పట్టుకుని కూర్చుంటాడు. అవని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అక్షయ్ తాగడు. తల బద్దలై పగిలిపోయిన సరే నీ చేత్తో ఇచ్చిన మజ్జిగను తాగని చెప్తాడు. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి అంతేకానీ మీ మీద మీరు చూపించుకోవడం మంచిది కాదు అనేసి అవని హితవు పలుకుతుంది.
నువ్వు ఎంత చెప్పినా నీ చేత్తో మజ్జిగ తాగను నువ్వు లక్ష రూపాయలు చెప్పినా నాకు ఆ మజ్జిగ వద్దు అని అక్షయ్ మొండికేసి కూర్చుంటాడు.. నువ్వు చేసే పనులకి నా తల పగిలిపోతుంది ఇప్పుడు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే అది చల్లారి పోతుంది అనేసి కౌంటర్ ఇస్తాడు. సరే మీరు తాకుంటే నేను వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్ళిపోతున్నట్టు వెనక్కి తిరుగుతుంది అవని.. ఇక అవని అక్షయ్ కు బలవంతంగా మజ్జిగను తాగిస్తుంది. ఇక అవని కింద కూర్చొని అక్షయ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక చక్రధర్ తన ఫ్రెండుకి పార్టీ ఇస్తాడు. మీనాక్షిని తన కొడుకుని చంపేసాను అని చెప్పి పార్టీ ఇస్తాడు. మొదటి దానికి తన ఫ్రెండు షాక్ అయినా ఆ తర్వాత నువ్వు అనుకునే సాధించావు రా అని అంటాడు.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అవని కోసం పార్వతి వస్తుంది. ఏమైందని ఇంకా భోజనం చేయలేదా అంటే లేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా అనేసి అంటుంది.. ఇంట్లో ఉన్నప్పుడన్నా తొందరగా వచ్చి తినొచ్చు కదా అనేసి పార్వతి అంటే లేదా అత్తయ్య ఏదో ముఖ్యమైన పనుంది వస్తానని చెప్పాడు అనేసి అంటుంది. నేను పిలుచుకొని వస్తానని పార్వతి అంటే వద్దు అత్తయ్య ముఖ్యమైన పని ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పాడుగా సరే మేమిద్దరం కలిసి తింటాంలే అనేసి అంటుంది.
10 నిమిషాల తర్వాత వాడు రాకుంటే నువ్వు తినేసేయ్ వాడు వచ్చినప్పుడు వాడికి పెట్టు అనేసి పార్వతి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ కిందకి వస్తాడు. మీకు ఇష్టమని పులిహోర చేశానని అనగానే అక్షయ్ నాకొద్దు నేను వడ్డించుకుంటాను అనేసి అంటాడు. కానీ అవని మాట వినకుండా వడ్డిస్తుంది. ఇది నువ్వే చేసావు కదా అంటే అవునండి నేనే చేస్తాను ఈసారి బాగా కుదిరింది ఇంట్లో వాళ్ళందరూ బాగుందని మెచ్చుకొని తిన్నారని అవని అంటుంది. అక్షయ్ మౌనంగా ఉండడం చూసి పల్లవి షాక్ అవుతుంది. ప్లేట్ విసిరి కట్టుకున్న మౌనంగా చూస్తున్నాడేంటే అని ఆలోచిస్తుంది. అక్షయ్ వెళ్లి ఉప్పు కారం తీసుకుని వచ్చి అన్నంలో ఉప్పు కారం ఎక్కువ వేసుకుని తింటాడు. వద్దని చెప్పినా కూడా అక్షయ్ వినడు. ఇది తింటే నాకు కడుపు మంటే కనిపిస్తుంది కానీ నా గుండెల్లో మంట నీకు కనిపించదనేసి అంటాడు. ఆ సీన్ చూసి పల్లవి సంబరపడిపోతుంది. ఇది కథ నాకు కావాల్సింది పుస్తకాల్లో చదివితే ఏదోలా ఉంది కళ్ళకు కట్టినట్లు చూస్తే ఆ ఆనందమే వేరు అనేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది పల్లవి.
ఇక రాత్రి ఆరాధ్యకు నూనె పెట్టాలని నూనె బాటిల్ తీసుకొని వస్తుంది. జుట్టు చూడు ఎలా ఉందో పీచ్ లాగా ఉంది నూనె పెడతాను అనేసి అనగానే ఆరాధ్య నాకొద్దు అని ఆట పట్టిస్తుంది. ఇద్దరిని చూసి పల్లవి ఇది నాకు తగ్గట్టు చేసుకోవాలనేసి అనుకుంటుంది. తన గదిలో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని వచ్చి బయట పోస్తుంది. దాని మీద కావాలని కాలు పెట్టి జారి పడుతుంది. పల్లవి అరుపులకి ఇంట్లో నుంచి అందరూ బయటకు వస్తారు. అవని చేతిలో నూనె ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. బామ్మ పల్లవి కడుపులో బిడ్డ చనిపోతే ఆరాధ్యకే ఆస్తి మొత్తం వస్తుందని ప్లాన్ చేసే నూనె పోసిందని అవమానిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ బామ్మ మాటలు విని షాక్ అవుతారు. ఇక కమల్ అవని వదిన ఎప్పుడూ అలా చేయదు నువ్వు ఇలాంటి పాడి బుద్ధి పెట్టుకోవద్దు అనేసి బామ్మకి కౌంటర్ ఇస్తాడు. ఆ ముసల్ది అన్ని మాటలు అంటుంటే నువ్వు వదినని ఒక్క మాట కూడా అనట్లేదు ఏంటి ఆ ముసలి దాన్ని గట్టిగా అనాలి కదా అన్నయ్య అంటే అక్షయ్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో అవని చేతే అబార్షన్ ఎలా చేయాలని ప్లాన్ వేస్తుంది అనుకున్నట్టుగానే ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..