Prabhas – Hanu : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. అయితే హను తీసిన సీతారామన్ సినిమా చూసిన తర్వాత, మాకు ఉన్నాడు మణిరత్నం అని కొంతమంది పొగడడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు తన కెరీర్లు ఎక్కువ లవ్ స్టోరీస్ తీశాడు హను. సీతారామం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తెలుగులో దుల్కర్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఫౌజి అనే సినిమాను చేస్తున్నాడు హను. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.హను ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ 1940లో కథను జరగబోతున్నట్లు రీవీల్ చేశాడు. అయితే అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగు ప్రేక్షకులకు సినిమా మీద ఉన్నంత అభిమానం మరో ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఉండదు అనేది వాస్తవం. ఒక సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇండస్ట్రీలోనూ చాలా మంది స్టార్ హీరోస్ కూడా తెలుగు ప్రేక్షకులు అంటే తమకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఒక సినిమాకు సంబంధించి ఒక కొత్త నటి ఎంట్రీ ఇస్తుంది అని అంటే తన గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు వెంటవెంటనే న్యూ క్రష్ అంటూ స్టేటస్ లు కూడా పెడుతూ ఉంటారు.
Also Read : Nani Odela movie : నానికి సీనియర్ విలన్ ను సెట్ చేసిన శ్రీకాంత్
ఇక ఇమాన్వి విషయానికొస్తే తన పేరు తెలియగానే కేవలం దాదాపు 24 గంటల కాల వ్యవధిలో 60 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. సినిమా రిలీజ్ అవ్వకముందే తన గురించి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఇమాన్వి కు మంచి రీజనబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఒక ఏడాది వరకు కంప్లీట్ గా ఆమెను లాక్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ డేట్స్ ని బట్టి ఆమె షూటింగ్ కి రావలసి ఉంటుంది. యూఎస్ నుండి వచ్చే ప్రతి సారీ బిజినెస్ క్లాస్ టికెట్స్ తో ఇక్కడ ఫైవ్ స్టార్ అకామిడేషన్ ఇవ్వనున్నారట. ఇకపోతే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్ సంస్థ. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక జైలు సెట్ ను కూడా క్రియేట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Ilayaraja: ఆ వీడియోని ఎక్కడైనా పోస్ట్ చేస్తే మంచి డబ్బులు వస్తాయి